చాలా మంది ఈ కారు కొన్నాక బస్సులు, రైళ్లు మర్చిపోతున్నారు.. దేశంలోనే బెస్ట్ 7 సీటర్ ఇదే!

భారత మార్కెట్లో 7-సీటర్ MPV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కుటుంబాల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఈ MPV, మే 2026లో కూడా అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచి తన నంబర్-1 స్థానాన్ని కొనసాగించింది. మే 2026లో మారుతి సుజుకి మొత్తం 20,350 ఎర్టిగా యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రస్తుతం SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, పెద్ద కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఉండే ఎర్టిగాపై వినియోగదారుల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతేకాదు, ఎర్టిగా కేవలం MPV సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో కూడా తన సత్తా చాటింది. మే 2026 టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మారుతి సుజుకి డిజైర్, రెండో స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలవగా, ఎర్టిగా మూడో స్థానంలో నిలిచి మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.

India Best 7 Seater Maruti Suzuki Ertiga May 2026 Sales Recorded 20350 Units

విశాలమైన క్యాబిన్, 7-సీటర్ సౌకర్యం, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, CNG ఆప్షన్ వంటి అంశాలు ఎర్టిగా విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అందుకే కుటుంబ వినియోగదారులు, కమర్షియల్ ఆపరేటర్లు ఇద్దరూ ఈ MPVని పెద్ద ఎత్తున ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎర్టిగా భారత మార్కెట్లో అత్యంత విజయవంతమైన 7-సీటర్ MPVగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇది చాలా కాలంగా పెద్ద కుటుంబాలకు మంచి రవాణ సాధానంగా నిలుస్తుంది.

భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ MPVగా ఎర్టిగా తన స్థానాన్ని సంవత్సరాలుగా నిలబెట్టుకుంటోంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆకర్షణీయమైన ధర. ప్రస్తుతం ఎర్టిగా ధరలు రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఒక కుటుంబ కారుకు అవసరమైన విశాలమైన క్యాబిన్, 7-సీటర్ సౌకర్యం, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్‌ను అందుబాటు ధరలో అందించడమే ఎర్టిగా విజయానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

India Best 7 Seater Maruti Suzuki Ertiga May 2026 Sales Recorded 20350 Units

పనితీరు పరంగా కూడా ఎర్టిగా వినియోగదారులను నిరాశపరచదు. ఇందులో అందిస్తున్న 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ నగర రోడ్లపై స్మూత్, హైవేలపై మంచి స్థిరత్వంతో ప్రయాణించేందుకు సహాయపడుతుంది. కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌లు వెళ్లేవారికి సరైన ఎంపిక. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉండటంతో వివిధ రకాల వినియోగదారుల అవసరాలను ఇది తీర్చగలుగుతోంది.

అంతేకాకుండా, పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎర్టిగా CNG వెర్షన్‌కు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మైలేజ్ విషయంలో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తే, CNG వేరియంట్ 26.11 కిలోమీటర్లు/కేజీ వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. ఈ గణాంకాలు దీర్ఘకాలంలో వాహన నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఎక్కువ మైలేజ్ కోరుకునే వినియోగదారులు ఎర్టిగాను ప్రాధాన్యంగా చూస్తున్నారు.

India Best 7 Seater Maruti Suzuki Ertiga May 2026 Sales Recorded 20350 Units

మంచి పనితీరు, విశాలమైన ఇంటీరియర్, 7-సీటర్ సౌకర్యం, అద్భుతమైన మైలేజ్, నమ్మకమైన మారుతి సుజుకి సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు కలిసి ఎర్టిగాను భారతదేశంలో అత్యంత విజయవంతమైన MPVలలో ఒకటిగా నిలబెట్టాయి. SUVల హవా కొనసాగుతున్న ఈ కాలంలో కూడా ఎర్టిగా అమ్మకాలు పెరుగుతుండటం, ఈ MPVపై వినియోగదారుల నమ్మకం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది.

Article Published On: Sunday, June 7, 2026, 7:28 [IST]
English summary
India best 7 seater maruti suzuki ertiga may 2026 sales recorded 20350 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+