రోజూ నడిపినా ఖర్చు తక్కువ.. అతి తక్కువ ధరకే 7 సీటర్ ఫ్యామిలీ కారు.. దేశమంతా కొనేస్తోంది!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను గమనిస్తే, ముఖ్యంగా 7 సీట్ల MPV కార్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చిన్న కుటుంబాలకు ఐదుగురు సౌకర్యంగా కూర్చోగల హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ.6-7 లక్షల మధ్య ధరలో దొరికినా, రూ.9 లక్షల లోపు 7 సీట్ల MPV ఎంపికలు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ ఖాళీని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) నిలుస్తోంది. ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ప్యాకేజీగా ఎర్టిగా భారత కుటుంబాల మనసు దోచుకుంది. తక్కువ ధరలో 7 మందికి సరిపడా స్థలం, మంచి కంఫర్ట్, రోజువారీ వాడుకకు అనుకూలమైన ఫీచర్లు అందించడం వల్ల ఇది ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది.

అందుకే ప్రతి నెలా ఎర్టిగా అమ్మకాలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. జనవరి 2026లో మాత్రమే ఎర్టిగా 17,892 యూనిట్లు అమ్ముడవ్వడం ఈ కారు ప్రజాదరణకు నిదర్శనం. అంతేకాదు, 2025 మొత్తం సంవత్సరంలో 1,92,025 యూనిట్ల విక్రయాలతో ఈ MPV తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ఈ గణాంకాలు చూస్తే, భారత మార్కెట్లో ఎర్టిగా ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో అర్థమవుతుంది.

India Best 7 Seater Mpv Maruti Suzuki Ertiga January 2026 Sales Report

ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే, టయోటా రుమియన్, టయోటా ఇన్నోవా, రెనాల్ట్ ట్రైబర్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, వాటన్నింటిని వెనక్కి నెట్టి 7 సీట్ల MPV విభాగంలో నంబర్ 1 స్థానాన్ని ఎర్టిగా నిలబెట్టుకోవడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి సరిపోయే నమ్మకమైన కారు కావాలనుకునే వారికి ఎర్టిగా ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. పండుగలు, జాతర్ల సమయాల్లో కుటుంబం అంతా కలిసి ప్రయాణించడానికి ఇది బాగా సెట్ అవుతుంది.

భారత మార్కెట్‌లో 2025 మారుతి సుజుకి ఎర్టిగా కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పూర్తి స్థాయి 7 సీట్ల MPVగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు రూ. 8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 12.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు వెళ్తుంది. ఈ ధర శ్రేణిలో 7 మందికి సౌకర్యవంతమైన ప్రయాణం, నమ్మకమైన పనితీరు అందించడమే ఎర్టిగా ప్రత్యేకత.

India Best 7 Seater Mpv Maruti Suzuki Ertiga January 2026 Sales Report

ఇందులో మరో ప్రధాన ఆకర్షణ CNG ఆప్షన్ లభ్యత. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, తక్కువ రన్నింగ్ ఖర్చు కోరుకునే కుటుంబాలకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి ఎర్టిగా పెట్రోల్, CNG ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 101.64 bhp పవర్, 139 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

అదే సమయంలో, 1.5 లీటర్ CNG ఇంజిన్ 86.63 bhp పవర్,122 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించడం వల్ల, డ్రైవర్‌కు తన అవసరానికి తగ్గట్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మైలేజ్ విషయంలో కూడా ఎర్టిగా తన క్లాస్‌లో బలమైన స్థానంలో ఉంది. పెట్రోల్ వేరియంట్ 20.51 కి.మీ/లీటర్ మైలేజీని అందిస్తే, CNG వేరియంట్ 26.11 కి.మీ/కిలోగ్రామ్ మైలేజీని ఇస్తుంది.

India Best 7 Seater Mpv Maruti Suzuki Ertiga January 2026 Sales Report

7 సీట్ల కారు భద్రతలో కూడా బెస్ట్‌గా ఉంటుంది. ప్రయాణ సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), రివర్స్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి వివిధ భద్రతా లక్షణాలతో వస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 4, 2026, 10:12 [IST]
English summary
India best 7 seater mpv maruti suzuki ertiga january 2026 sales report
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+