ఇంత కంటే మంచి కారు చూపించగలరా? ప్రతిఒక్కరికి నచ్చుతుంది.. రూ.5.79 లక్షలే
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుకు చెందిన ప్రసిద్ద హ్యచ్‌బ్యాక్. కొన్నేళ్లకు పైగా మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మారుతున్న కాలానికి, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇది కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మార్కెట్లో తన సత్తా ఎంటో చూపిస్తుంది. ఇది విడుదల అయినప్పటి నుంచి తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోవడం లేదు. భారతీయలకు ఒక నమ్మకమైన చిన్న కారుగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇది చాలా ఏళ్లుగా మెరుగైన అమ్మకాల గణంకాలను నమోదు చేస్తుంది. ఒక నెల తక్కువ అమ్మకాలను నమోదు చేసినప్పటి ఆ తరువాతి నెలలో అంతకన్నా ఎక్కువ సాధించడం ఈ స్విఫ్ట్ ప్రత్యేకత. తాజాగా ఈ కారుకి సంబంధించిన అమ్మకాలు విడుదల అయ్యాయి.
ఈ గణంకాలను ఒకసారి చూసినట్లయితే, మార్కెట్లో దీని పెర్ఫామెన్స్ గురించి తెలుస్తుంది. 2026 జూన్ నెలలో స్విఫ్ట్‌ను 15,215 మంది కొనుగోలు చేశారు. ఈ సంఖ్యలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది అని చెప్పొచ్చు. అంటే, ఈ లెక్కన 2025 జూన్ నెలలో అమ్మకాలు 13,275 యూనిట్లుగా నమోదు కాగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధించినట్లు.

ఎస్‌యూవీలకు ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ నెలకొంది. తయారీదారులు వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తుండటంతో పాటు, తమ పాత వాటిని కూడా అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ తీసుకొస్తున్నారు. పైగా దేశీయ కంపెనీల నుంచే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న తయారీదారులు భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొత్త కార్లను తెస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా స్విఫ్ట్ 15 శాతం వృద్ధి చెందడం విశేషం.
స్విఫ్ట్ ఫ్యామిలీలకు కంఫర్ట్, యువతకు స్పోర్టీ లుక్, డ్రైవర్‌కు స్మూత్ హ్యాండ్లింగ్ ఇస్తుంది. సిటీ రోడ్లపై లేదా గ్రామాల్లో నడిపినా కూడా ఇది కంఫర్ట్ ప్రయాణాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దీని డిమాండ్‌కు ఇంకొక కారణం ధర. భారత మార్కెట్లో బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.79 లక్షల నుంచే ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ రూ.8.65 లక్షల రేంజ్‌లోనే ఉండటంతో వివిధ బడ్జెట్ వినియోగదారులకు సూట్ అవుతుంది.

ఇది LXi, VXi, ZXi, ZXi+ వంటి వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా చూసినట్లయితే, ప్రీమియం LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ LED DRLలు కారును మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటాయి. కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ సైడ్ నుంచి 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత ఆకట్టుకునే రూపాన్ని తెచ్చాయి. ముందు నుంచే కాకుండా వెనుక భాగంలో LED టెయిల్‌లైట్లు డైనమిక్ లుక్‌ను మరింత అందంగా చూపిస్తాయి.
దీని ఇంజిన్ గురించి చూసినట్లయితే, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.2-లీటర్ CNG ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం మరో పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ అందించారు. దీంతో సిటీ ట్రాఫిక్‌లో ఈ కారును నడిపే సమయంలో చాలా కంఫర్ట్ అనుభూతిని అందిస్తుంది. కొత్తగా డ్రైవింగ్ మొదలు పెట్టిన వారకి కూడా అనుకూలంగా అనిపిస్తుంది.

ఇక, చివరగా మైలేజ్ గురించి చూద్దాం, మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్లు 24.80 నుంచి 25.75 కి.మీ./లీటర్ వరకు ఇస్తే, పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారు CNG వేరియంట్ ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఈ వేరియంట్ మైలేజ్ విషయానికి వస్తే, కిలో సీఎన్‌జీకి దాదాపుగా 32.85 కి.మీ ప్రయాణిస్తుంది. మొత్తంగా స్విఫ్ట్ కస్టమర్లను అన్ని విధాలుగా ఆకట్టుకునే మోడల్.


Click it and Unblock the Notifications