పేదోళ్లు సైతం ఈ కారును ఈజీగా కొనగలరు.. 33 కి.మీ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్.. చాలా మంది కొంటున్నారు!
భారతదేశంలో సామాన్యుల కారు కలను నిజం చేసిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10) ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన డ్రైవింగ్ ఈ మూడు లక్షణాల వల్లే ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ సమానంగా ప్రాచుర్యం పొందిన ఈ మోడల్, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. మార్కెట్లో కొత్త కార్లు ఎంత వచ్చినా, ఆల్టోకు ఉన్న డిమాండ్ మాత్రం ఇంకా తగ్గలేదు. తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 మార్చి నెలలో ఆల్టో మొత్తం 11,515 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఫిబ్రవరి నెలలో నమోదైన 9,787 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.
అంటే, కేవలం ఒక నెల వ్యవధిలోనే వినియోగదారుల ఆసక్తి ఎంతగా పెరిగిందో ఈ సంఖ్యలు తెలియజేస్తున్నాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ, మార్చి 2026లో ఆల్టో అమ్మకాల జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ఈ కారు ఇంకా మార్కెట్లో ఎంత బలంగా ఉందో చెప్పే స్పష్టమైన సంకేతం. ముఖ్యంగా ఈ కాలంలో ఆల్టో దాదాపు 17 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం మరింత విశేషం.

అంటే, కొత్త మోడళ్ల పోటీ మధ్యలో కూడా ఈ కారు తన స్థిరమైన డిమాండ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, మరింత పెంచుకుంటూ పోతోందని అర్థం. ఇటీవల సంవత్సరాల్లో మార్కెట్లో SUV వాహనాల డిమాండ్ పెరిగింది. ఈ ప్రభావంతో సెడాన్‌లతో పాటు హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు కొంత తగ్గడం ప్రారంభమైంది. అయినప్పటికీ, ఆల్టో K10 వంటి మోడళ్లు వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ అమ్మకాల్లో పెరుగుదల నమోదు చేయడం విశేషం అని చెప్పాలి.
మారుతి సుజుకి ఆల్టో K10 సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సింపుల్, ఎఫిషియంట్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తోంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పనితీరు పరంగా ఇది గరిష్టంగా 67 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్ వేరియంట్‌తో పాటు, ఈ హ్యాచ్‌బ్యాక్‌ను సీఎన్‌జీ ఎంపికలో కూడా అందిస్తున్నారు.

సీఎన్‌జీ వేరియంట్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మైలేజీ విషయంలో కూడా ఈ కారు వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పెట్రోల్‌తో నడిచే Alto K10 సుమారు 24.90 kmpl వరకు మైలేజీ ఇస్తే, సీఎన్‌జీతో నడిచినప్పుడు ఇది 33.40 km/kg వరకు చేరుతుంది. ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో Alto K10 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల మధ్య ఉంది.
నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభంగా నడపడానికి మారుతి సుజుకి ఆల్టో K10 సరైన సైజ్, ఈజీ డ్రైవింగ్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. కాంపాక్ట్ డైమెన్షన్స్ వల్ల ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఈ కారు LXI, VXI, VXI Plus వంటి వేరియంట్లలో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు తమ బడ్జెట్‌కు తగ్గట్లు ఎంపిక చేసుకోవచ్చు. డిజైన్ పరంగా ఈ మోడల్‌లో ఆధునిక టచ్ కనిపిస్తోంది.

ఆకర్షణీయమైన లుక్ కోసం LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లు అందించారు. ఇవి కారు స్టైలింగ్‌ను మరింత మెరుగుపరుస్తాయి. అదే సమయంలో భద్రతపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌లో ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. దీంతో, తక్కువ ధరలోనే మంచి సేఫ్టీ ఫీచర్లను కోరుకునే వారికి Alto K10 ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








