34 కి.మీ మైలేజ్, ధర రూ.6 లక్షల నుంచే.. రోజూ ప్రయాణించే వారికి దేశంలో 3 బెస్ట్ కార్లు
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే వారికి ప్రయాణ ఖర్చు పెద్ద భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే, తక్కువ ఖర్చుతో నడిచే కార్ల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే CNG కార్లు నగర ప్రయాణికుల కోసం ఉత్తమ ఎంపికగా మారాయి. తక్కువ ఇంధన ఖర్చుతో పాటు మంచి మైలేజీ ఇవ్వడం వల్ల మారుతి సుజుకి సెలెరియో, టాటా పంచ్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇవి కేవలం ఖర్చు తగ్గించే కార్లే కాకుండా, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్, కుటుంబానికి సరిపడే స్థలం, భద్రతా ఫీచర్లతో కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో ఇస్తున్నాము.
Tata Punch CNG: టాటా పంచ్ సీఎన్‌జీ ధరలు రూ.6.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. SUV తరహా బోల్డ్ డిజైన్, ఎత్తైన స్టాన్స్‌తో ఈ కారు యువతతో పాటు కుటుంబాలను కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజన్ మంచి పనితీరుతో పాటు సుమారుగా 26.99 కి.మీ/కేజీ వరకు మైలేజీని అందిస్తుంది. నగర ట్రాఫిక్‌లో ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఇది ఖర్చు తగ్గించే మంచి ఎంపికగా మారింది.

CNG కార్లలో సాధారణంగా బూట్ స్పేస్ తగ్గిపోతుంది. కానీ టాటా పంచ్ CNGలో మాత్రం ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉపయోగకరమైన ట్రంక్ స్పేస్‌ను అందించారు. అంతేకాకుండా, ఈ కారు 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకోవడం వల్ల భద్రత విషయంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది మరింత నమ్మకాన్ని ఇస్తుంది. ఫీచర్ల పరంగా కూడా టాటా పంచ్ CNG ఆకట్టుకుంటుంది.
Maruti Suzuki Celerio CNG: మారుతి సుజుకి సీఎన్‌జీ ధరలు సుమారు రూ.5.97 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ కోరుకునే నగర ప్రయాణికుల కోసం ఈ కారు ప్రత్యేకంగా రూపొందించబడినట్టే ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ K10C పెట్రోల్-CNG ఇంజన్ సాఫీ పనితీరుతో పాటు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఇది కిలో CNGకి 34.43 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు.

భద్రత విషయంలో ఇప్పుడు మరింత మెరుగైంది. కొత్త మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక హై-స్పెక్ వేరియంట్‌ను ఎంచుకుంటే స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునే ORVMలు వంటి ఆధునిక ఫీచర్లు కూడా లభిస్తాయి. తక్కువ ఖర్చు, భారీ మైలేజీ, ఫీచర్ల కలయికతో సెలెరియో CNG ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ను సంపాదిస్తోంది.
Maruti Suzuki Fronx CNG: మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ ధరలు సుమారుగా రూ.7.78 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. స్టైలిష్ లుక్, SUV తరహా హైట్, కూపే స్టైల్ డిజైన్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ప్రీమియం ఫీలింగ్ ఇచ్చే డిజైన్‌తో పాటు, ప్రతిరోజూ నగర ప్రయాణాలకు సరిపోయే ఇంధన సామర్థ్యాన్ని కూడా ఇది అందిస్తుంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్ సుమారుగా 28.51 కి.మీ/కేజీ వరకు మైలేజీ ఇవ్వగలదు.

ఫ్రాంక్స్ CNGలో కేవలం మైలేజీ మాత్రమే కాదు, ఆధునిక ఫీచర్ల పరంగానూ మంచి అనుభూతి లభిస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి భద్రతా ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, కంఫర్ట్ సీటింగ్ హైవేపై కూడా మంచి పనితీరును అందించే స్వభావం డ్రైవర్‌కు మరింత నమ్మకాన్ని ఇస్తాయి.


Click it and Unblock the Notifications