దేశంలో ఇంతకంటే మంచి కారు చూపించగలరా? అందరి ఫేవరెట్ ఇదే.. 33 కి.మీ మైలేజ్, రూ.5.79 లక్షలు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ఒకటి. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు తనదైన స్టైల్, పనితీరు, మైలేజ్‌తో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణను సంపాదించింది. కాలం మారినా, కొత్త మోడళ్లు వచ్చినా, స్విఫ్ట్‌పై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం ఒక హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాదు, భారతీయ మధ్యతరగతి కుటుంబాలకి ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది. ఏళ్ల తరబడి మార్కెట్లో నిలదొక్కుకుని, వినియోగదారుల అంచనాలను అందుకుంటూ వస్తున్న ఈ కారు, ప్రతి కొత్త అప్‌డేట్‌తో మరింత మెరుగైందే తప్ప తగ్గలేదు. యువతకు స్పోర్టీ లుక్, ఫ్యామిలీలకు కంఫర్ట్, డ్రైవర్‌కు స్మూత్ హ్యాండ్లింగ్ కలిపి ఇది అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఉంది.
నగర ట్రాఫిక్‌లోనూ, హైవేలపై కూడా సులభంగా నడిచే డ్రైవింగ్ అనుభవం దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉండి కూడా ప్రీమియం ఫీల్ ఇవ్వడం దీని పెద్ద ప్లస్ పాయింట్. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 5.79 లక్షల నుంచే ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ కూడా రూ. 8.65 లక్షల పరిధిలోనే ఉండటం వల్ల విభిన్న బడ్జెట్‌లకు ఇది సూట్ అవుతుంది.

ఇది LXi, VXi, ZXi, ZXi+ వంటి వేరియంట్లలో లభిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు సరైన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు. ప్రతి వేరియంట్‌లోనూ అవసరమైన ఫీచర్లు సమతుల్యంగా అందించడం స్విఫ్ట్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. డైలీ యూజ్‌కు కావాల్సిన సౌకర్యాలు, టెక్నాలజీ బేసిక్ నుంచి టాప్ వేరియంట్ వరకు సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయబడిన విధానం వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైన్ పరంగా కూడా కొత్త తరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మరింత ఆధునికంగా, స్పోర్టీ స్టైలింగ్‌తో రూపొందించబడింది. మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఫ్రంట్ ప్రొఫైల్‌ను తీర్చిదిద్దారు. ప్రీమియం LED హెడ్‌ల్యాంప్‌లు, స్టైలిష్ LED DRLలు కారుకు ఒక ప్రత్యేక ఐడెంటిటీని తీసుకొస్తాయి. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఈ లైటింగ్ సిగ్నేచర్ వెంటనే గుర్తుపడేలా ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్‌లో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత స్పోర్టీ స్టాన్స్‌ను ఇస్తాయి. కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ బలమైన ప్రెజెన్స్‌ను చూపించడం స్విఫ్ట్ ప్రత్యేకత. వెనుక భాగంలో LED టెయిల్‌లైట్లు డైనమిక్ లుక్‌ను అందిస్తూ, మొత్తం డిజైన్‌ను పూర్తి చేస్తాయి. మొత్తం మీద ఈ కారు యూత్‌ఫుల్, ఎనర్జిటిక్ ఫీల్‌ను ఇస్తుంది. ఇంటీరియర్‌లోకి అడుగుపెడితే టెక్నాలజీ, కంఫర్ట్ రెండింటి సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది.
పనితీరు విషయానికి వస్తే, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 PS శక్తి, 112 Nm టార్క్‌ను అందిస్తూ సిటీ డ్రైవింగ్‌లో చురుకుదనం, హైవేపై స్థిరత్వం రెండింటినీ ఇస్తుంది. ట్రాఫిక్‌లో ఈజీగా నడిపించుకోవచ్చు, అవసరమైనప్పుడు మంచి పిక్‌అప్ ఇస్తుంది. ఇక 1.2-లీటర్ CNG ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం మరో పెద్ద ప్లస్. ఈ వేరియంట్ 70 PS పవర్, 102 Nm టార్క్‌ను అందిస్తూ మంచి ఎకానమీని ఇస్తుంది.

గేర్‌బాక్స్ ఎంపికల్లో 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్లు 24.80 నుంచి 25.75 కి.మీ./లీటర్ వరకు ఇస్తే, CNG వేరియంట్ 32.85 కి.మీ./కిలో వరకు అందించడం ఈ కారును మరింత ఆర్థికంగా మార్చుతోంది. ఈ కారులో ప్రయాణికులకు అవసరమైన ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి.


Click it and Unblock the Notifications








