ఒకే ఒక్క ఒప్పందం… లక్షల రూపాయల సేవింగ్.. ఇక సామాన్యుడు కూడా బీఎండబ్ల్యూ కార్ కొనేయొచ్చు
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన సరికొత్త వాణిజ్య ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఒక మహా విప్లవానికి తెరలేపింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) ఎట్టకేలకు ఖరారైంది. దీనివల్ల విదేశీ కార్లంటే మోయలేని భారం అనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అని అభివర్ణించారు.
భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇప్పటివరకు యూరప్ నుంచి ఒక కారును పూర్తి స్థాయిలో తయారైన స్థితిలో (CBU) దిగుమతి చేసుకుంటే, దానిపై ప్రభుత్వం సుమారు 110 శాతం వరకు దిగుమతి సుంకాన్ని (Import Duty) వసూలు చేసేది. అంటే కారు అసలు ధర కంటే పన్నులే ఎక్కువగా ఉండేవి. కానీ తాజా ఒప్పందం ప్రకారం ఈ సుంకాన్ని ఏకంగా 10 శాతానికి తగ్గించారు. దీనివల్ల యూరప్ నుంచి వచ్చే లగ్జరీ, ప్రీమియం కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

పన్ను తగ్గింపు ప్రయోజనం అన్ని కార్లకు వర్తించదు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ప్రతి సంవత్సరం గరిష్టంగా 2.5 లక్షల (2,50,000) యూరోపియన్ కార్లను మాత్రమే ఈ తక్కువ పన్ను రేటుతో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. అంటే ఈ కోటా దాటితే మళ్ళీ పాత పన్నులే వర్తిస్తాయి. దీనివల్ల యూరోపియన్ కంపెనీలు తమ అత్యుత్తమ మోడళ్లను భారత్‌కు పరిమిత సంఖ్యలోనైనా సరసమైన ధరలకే అందించే అవకాశం ఉంటుంది.
ఈ ఒప్పందంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) ఎటువంటి పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. దీనికి కారణం భారతదేశంలోని దేశీయ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను రక్షించడమే. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే భారత్‌లో ఈవీ రంగంలో దూసుకుపోతున్నాయి. విదేశీ ఈవీలు తక్కువ ధరకే వస్తే స్థానిక తయారీదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించి, ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్లను ఈ రాయితీ నుంచి మినహాయించారు.

ఈ డీల్ వల్ల ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), రెనాల్ట్ (Renault), స్టెల్లాంటిస్ వంటి కంపెనీలతో పాటు లగ్జరీ బ్రాండ్లయిన మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే కంపెనీలకు భారీ లాభం కలుగుతుంది. ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో యూరోపియన్ కంపెనీల వాటా కేవలం 4 శాతం కంటే తక్కువగా ఉంది.
ఈ పన్ను తగ్గింపు వల్ల 2030 నాటికి ఈ వాటా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి భారతదేశంలో ఏటా 60 లక్షల కార్ల విక్రయాలు జరుగుతాయని అంచనా, ఇది అమెరికా, చైనా తర్వాత మనల్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్కెట్‌గా మారుస్తుంది.

ప్రస్తుతం అమెరికా తన దిగుమతి సుంకాలను పెంచుతుండటం, చైనా తన ఎగుమతులను నియంత్రిస్తుండటంతో ప్రపంచ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం వెతుకుతున్నాయి. అటువంటి సమయంలో భారత్-EU ఒప్పందం ఒక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సిగ్నల్‌గా పనిచేస్తుంది.
యూరోపియన్ కంపెనీలు కేవలం కార్లను అమ్మడమే కాకుండా, రాబోయే రోజుల్లో భారత్‌ను ఒక మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ అన్నట్లుగా, ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగిన రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల కలయిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కొత్త దిశను చూపుతుంది.


Click it and Unblock the Notifications








