ఏ కంపెనీ ఈవీ కార్లను ఎక్కువగా కొంటున్నారో తెలుసా? ప్రజల ఫస్ట్ ఛాయిస్ ఇదే! సాక్ష్యం చూడండి
ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ విభాగం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి వస్తోందని తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వినియోగదారుల్లో మారుతున్న ఆలోచనలు అన్నీ కలిసి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. దీనికి బలమైన ఉదాహరణగా 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. నివేదికల ప్రకారం, భారతీయ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగం జనవరి 2026లో మొత్తం 18,042 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కేవలం ఒక నెల గణాంకమే అయినా, మార్కెట్ దిశను స్పష్టంగా చూపించే సంఖ్యగా చెప్పుకోవచ్చు.
ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మరింత ఆకట్టుకునే విషయం. జనవరి 2025లో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 11,909 యూనిట్లకే పరిమితమయ్యాయి. అయితే, ఏడాది వ్యవధిలోనే ఈ సంఖ్య భారీగా పెరిగి, దాదాపు 51 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. అంటే, చాలా తక్కువ సమయంలోనే భారత వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.

భారత ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా చాటుకుంది. జనవరి 2026లో దేశీయ మార్కెట్‌లో టాటా మొత్తం 7,852 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే సుమారు 48 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం.
ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV మోడళ్లు నిలిచాయి. మంచి రేంజ్, టాటా బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకం EV మార్కెట్‌లో బెస్ట్ సెల్లర్లుగా మార్చాయి. టాటా తర్వాతి స్థానంలో JSW MG మోటార్ నిలిచింది. జనవరి 2026లో MG మోటార్ మొత్తం 4,606 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, ఈ నెలలో రెండవ అతిపెద్ద EV తయారీదారుగా తన స్థానాన్ని నిలుపుకుంది.

అయితే, అమ్మకాల పరంగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 2 శాతం వద్దే పరిమితమైంది. అంటే, MG మోటార్ అమ్మకాలు స్థిరంగా ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ లాంటి వేగవంతమైన గ్రోత్‌ను ఈసారి నమోదు చేయలేకపోయింది. జనవరి 2026లో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కొన్ని బ్రాండ్లు భారీ వృద్ధిని నమోదు చేశాయి.
మహీంద్రా 3,589 ఎలక్ట్రిక్ SUVలను డెలివరీ చేసి 386 శాతం వృద్ధితో తన EV మార్కెట్ వాటాను 6 శాతం నుంచి 20 శాతానికి పెంచుకుంది. కొత్త బ్రాండ్ అయిన విన్‌ఫాస్ట్ 432 యూనిట్లు విక్రయించి నాలుగో స్థానంలో నిలిచి 2 శాతం మార్కెట్ వాటా సాధించింది. అదే సమయంలో హ్యుందాయ్ 326 EVలను విక్రయించి 2 శాతం తగ్గుదల నమోదు చేసింది.

ఇక కియా మాత్రం ఐదు రెట్లు వృద్ధితో 306 యూనిట్ల అమ్మకాలతో ఆకట్టుకుంది. BYD గత నెలలో 224 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 34 శాతం తగ్గుదల. జనవరి 17న తన తొలి ఎలక్ట్రిక్ వాహనం, ఇ-విటారా SUVని ఆవిష్కరించిన మారుతి సుజుకి వాహన్ పోర్టల్‌లో 210 యూనిట్లను నమోదు చేసింది.
లగ్జరీ సెగ్మెంట్‌లో బీఎండబ్ల్యూ జనవరి 2026లో 312 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 61 శాతం ఎక్కువ. మెర్సిడెస్-బెంజ్ 69 ఎలక్ట్రిక్ వాహనాలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే, జనవరి 2026 భారత EV మార్కెట్‌లో వేగంగా మారుతున్న పోటీని స్పష్టంగా చూపించింది.


Click it and Unblock the Notifications








