ఈ కలర్ కార్లు కనిపిస్తే ఆశ్చర్యపోకండి.. అవి ఓలా, ఉబెర్‌లకు కొత్త విలన్! కొత్త క్యాబ్ సర్వీస్ స్టార్ట్!

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ మొబిలిటీ రంగంలో వేగంగా ఎదుగుతున్న వియత్నాం సంస్థ గ్రీన్ SM, ఇప్పుడు భారత మార్కెట్లో కూడా తన అడుగులు మోపింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల ఆధారంగా నడిచే తన ప్రీమియం టాక్సీ సర్వీస్ గ్రీన్ SM లిమో (green sm limo)ను అధికారికంగా దేశంలో ప్రారంభించింది. పెరుగుతున్న కాలుష్యం, ఇంధన వినియోగం నేపథ్యంలో ఈ కొత్త సేవ ఇండియాలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రీన్ SM తన ఎలక్ట్రిక్ టాక్సీ సేవను ఆవిష్కరించింది. గ్రీన్ స్మార్ట్ మొబిలిటీ వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్‌కు అనుబంధ సంస్ధగా పనిచేస్తుంది. టాక్సీ సేవను ప్రారంభించడంతో విన్‌ఫాస్ట్ ఇప్పుడు టాక్సీ సేవలోకి కూడా ప్రవేశించింది.

ఇప్పటికే వియత్నాంలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రీన్ SM, అనంతరం లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు విస్తరించింది. ఇప్పుడు భారతదేశంలో సేవలను ప్రారంభించి అంతర్జాతీయ విస్తరణలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశేషం ఏమిటంటే, కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించిన ఐదవ అంతర్జాతీయ మార్కెట్‌గా భారత్ నిలిచింది. హర్యానా మంత్రి రావు నర్బీర్ సింగ్, డాక్టర్ విరిందర్ శర్మ, వియత్నాం ప్రతినిధుల సమక్షంలో ఈ ఎలక్ట్రిక్ టాక్సీ సేవ ప్రారంభమైంది.

India Gets Green Sm Electric Cab Service Starting From Delhi Ncr Full Details

ప్రారంభ దశలో గ్రీన్ SM లిమో సర్వీస్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశ రాజధానిలో రోజురోజుకు పెరుగుతున్న రవాణా అవసరాలు, ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మొదట ఈ మార్కెట్‌పైనే దృష్టి సారిస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే స్పందన తర్వాత ఈ ఎలక్ట్రిక్ టాక్సీ సేవను ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాలకు దశలవారీగా విస్తరించాలనే ప్రణాళికను గ్రీన్ SM ప్రకటించింది.

ఈ టాక్సీ సర్వీస్ కోసం కంపెనీ ప్రత్యేకంగా విన్‌ఫాస్ట్ తయారు చేసిన లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించనుంది. కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లో పరిచయమైన విన్‌ఫాస్ట్ MPV 7 ఆధారంగా రూపొందించిన ఈ వాణిజ్య వెర్షన్, టాక్సీ సేవలకు అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీటింగ్, పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ప్రయాణికులకు నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనుంది.

India Gets Green Sm Electric Cab Service Starting From Delhi Ncr Full Details

అంతేకాకుండా, గ్రీన్ SM టాక్సీలను రోడ్లపై సులభంగా గుర్తించేందుకు కంపెనీ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. తమ వాహనాలన్నింటికీ ఆకర్షణీయమైన టర్కోయిస్ నీలం రంగును ఉపయోగించనుంది. దీంతో గ్రీన్ SM టాక్సీలు సాధారణ క్యాబ్‌ల నుంచి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, కంపెనీకి ఒక ప్రత్యేక బ్రాండ్ గుర్తింపును కూడా తీసుకురానున్నాయి. భారతదేశంలో పరిశుభ్రమైన, సుస్థిరమైన మరియు ఆధునిక రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రీన్ SM తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

గ్రీన్ SM లిమో సర్వీస్ కోసం ఉపయోగిస్తున్న ఈ ఎలక్ట్రిక్ SUV ప్రయాణికులకు నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, అధిక సామర్థ్యం గల బ్యాటరీ కారణంగా నగర ట్రాఫిక్‌లోనూ, పొడవైన ప్రయాణాల్లోనూ మంచి పనితీరు కనబరుస్తుంది. ప్రతి గ్రీన్ SM లిమో వాహనం 'రైడ్ 5 స్టార్' ప్రమాణాలతో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల కోసం త్రాగునీరు, వెట్ టిష్యూలు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు.

India Gets Green Sm Electric Cab Service Starting From Delhi Ncr Full Details

భద్రత కోసం AI ఆధారిత అంతర్గత, బాహ్య కెమెరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఎమర్జెన్సీ సపోర్ట్ బటన్లు కూడా ఉన్నాయి. ఈ వాహనాలను ప్రత్యేక శిక్షణ పొందిన 'గ్రీన్ డ్రైవర్లు' నడుపుతారు. రోడ్డు భద్రత, కస్టమర్ సర్వీస్, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి 'గ్రీన్ SM' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని టాక్సీని బుక్ చేసుకోవచ్చు.

అలాగే హాట్‌లైన్ నంబర్ లేదా నేరుగా వాహనాన్ని ఆపి కూడా సేవలను పొందవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా జూన్ 5 నుంచి జూన్ 11 వరకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే వారికి గరిష్టంగా రూ.250 వరకు 50 శాతం తగ్గింపును కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ లేని వారు 9228853333 నంబర్‌కు కాల్ చేసి టాక్సీని బుక్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఉన్నవారు మాత్రమే దీనిని ఉపయోగించగలరు.

Article Published On: Saturday, June 6, 2026, 9:18 [IST]
English summary
India gets green sm electric cab service starting from delhi ncr full details
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+