చిన్న కుటుంబాల ఫేవరెట్ కారు.. రూ.3.70 లక్షలే.. పైగా 33.40 కి.మీ మైలేజ్ కూడా..!

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనాలనే కలను అందుబాటులోకి తీసుకొచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) ఎప్పుడూ ముందుంటుంది. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో దశాబ్దాలుగా లక్షలాది కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. 1990ల చివర్లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఆల్టో, కాలానుగుణంగా ఎన్నో మార్పులు, సాంకేతిక అప్‌డేట్లను అందుకుంటూ మరింత ఆధునికంగా మారింది. ఒకప్పుడు 800cc ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ఇప్పుడు 1.0-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో విక్రయించబడుతోంది. నగర ప్రయాణాలకు, గ్రామాల్లో చిన్న కుటుంబాలకు ఇది ఇప్పటికీ బెస్ట్ బడ్జెట్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.

ఇదిలా ఉండగా, తాజాగా విడుదలైన 2026 జూన్ అమ్మకాల గణాంకాలు ఆల్టో క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి. జూన్ 2026లో ఈ కారు 10,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 5,045 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 106 శాతం వృద్ధి సాధించడం విశేషం. ఈ గణాంకాలు ఆల్టోకు ఇప్పటికీ ఉన్న ఆదరణ ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

India Middle Class Best Hatchback Maruti Alto K10 June 2026 Sales 106 Percent Growth

ఒక్కడ కీలక విషయం ఏమిటంటే, ప్రస్తుతం మార్కెట్లో వివిధ కార్ల తయారీదారుల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా చాలా మంది కొత్తగా కార్లను కొనుగోలు చేసే సమయంలో SUVల పట్ట ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఒక హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి ఆల్టో పోటీని తట్టుకుని మరి వినియోగదారులను ఆకట్టుకోవడం కంపెనీ సాధించిన పెద్ద విషయం అని చెప్పుకోవాలి.

ఈ కారు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికి 3గురు సభ్యులు ఉన్న కుటుంబానికి సరిపోద్ది. డిజైన్ గురించి చూసినట్లయితే, ముందు పెద్ద గ్రిల్, ఆకట్టుకునే హెడ్‌ల్యాంప్స్ కారను అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం దీని కాంపాక్ట్ సైజు. దీంతో నగర రోడ్లలో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. చిన్న గల్లీల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోద్ది. సైడ్ నుంచి లేదా వెనక నుంచి చూసిన కూడా ఇది ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

India Middle Class Best Hatchback Maruti Alto K10 June 2026 Sales 106 Percent Growth

ఇంజిన్, పనితీరు, మైలేజ్ గురించి చూద్దాం. మారుతి సుజుకి ఆల్టోలో 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 bhp పవర్, 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ బరువు ఉన్న బాడీతో కలిపి ఈ ఇంజిన్ మంచి పికప్‌ను అందించడంతో పాటు ట్రాఫిక్‌లో కూడా కారును సులభంగా నడిపే అవకాశం కల్పిస్తుంది. చిన్న కుటుంబాలకు, ప్రతిరోజూ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి బెస్ట్.

కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆల్టో K10ను 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్లలో అందిస్తున్నారు. క్లచ్ ఉపయోగించకుండా సులభంగా డ్రైవ్ చేయాలనుకునే వారికి AMT వేరియంట్ మంచి ఎంపిక. మరోవైపు ఇంధన ఖర్చును మరింత తగ్గించుకోవాలనుకునే వారి కోసం కంపెనీ CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

India Middle Class Best Hatchback Maruti Alto K10 June 2026 Sales 106 Percent Growth

మైలేజ్ పరంగా కూడా ఆల్టో K10 తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్ల వరకు, CNG వేరియంట్ కిలో గ్యాస్‌కు 33.40 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ప్రస్తుతం ఆల్టో K10 ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల మధ్య ఉంది.

Article Published On: Monday, July 13, 2026, 13:10 [IST]
English summary
India middle class best hatchback maruti alto k10 june 2026 sales 106 percent growth
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+