7-సీటర్ కార్లలో ఇండియాలోనే బెస్ట్ కారు.. మిడిల్‌క్లాస్ వాళ్లు ఒక్కసారి కొంటే కొన్నేళ్లు హాయిగా వాడొచ్చు!
భారత్‌లో కుటుంబంతో కలిసి ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకే కారులో భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఇతర కుటుంబ సభ్యులు కలిసి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలా పెద్ద కుటుంబానికి 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) బాగా అనుకులంగా ఉంటుంది. ఇది పెద్ద కుటుంబాలకు సరిపోయే సౌకర్యవంతమైన సీటింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా కంఫర్ట్‌ను అందించే సస్పెన్షన్, అలాగే తక్కువ మెయింటనెన్స్ ఖర్చులతో మధ్యతరగతి సరైన ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ కారులో దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే వారు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది ప్రతినెలా వేలల్లో అమ్ముడవుతూ మారుతి కంపెనీకి బంగారు గుడ్డు పెట్టే కోడిలా మారింది.
తాజాగా ఈ కారుకి సంబంధించిన అమ్మకాలు వచ్చాయి. గణంకాల ప్రకారం, ఎర్టిగాకు భారత మార్కెట్లో డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, జూన్ 2026లో ఈ ఎంపీవీ 16,111 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 13.85 శాతం వృద్ధిని సూచిస్తుంది. 2025 జూన్‌లో ఈ కారు 14,151 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, ఈ సారి సేల్స్ మెరుగ్గానే వృద్ధి చెందాయి.

మారుతి సుజుకి ఎర్టిగా రూ.8.85 లక్షల నుంచి రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉంది. క్యాబిన్‌లోకి అడుగుపెడితే ప్రీమియం అనుభూతి కలిగించే ఇంటీరియర్‌తో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో టెక్నాలజీతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా వాయిస్ కమాండ్లతో అనేక ఫంక్షన్లను నియంత్రించవచ్చు.
అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కారణంగా వెహికల్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, టో-అవే అలర్ట్‌లు, ఓవర్‌స్పీడ్ అలర్ట్ ఫీచర్లను మొబైల్ యాప్ ద్వారా రిమోట్‌గా ఆపరేట్ చేసే సౌకర్యం లభిస్తుంది. ఈ ఫీచర్లు వాహనాన్ని మరింత స్మార్ట్‌గా, భద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజన్ పరంగా ఎర్టిగాలో 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఇంజన్ 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే ఎక్కువ మైలేజ్, తక్కువ ఫ్యూయల్ ఖర్చు కోరుకునే వారి కోసం CNG వేరియంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే కుటుంబాలు, కమర్షియల్ వినియోగదారులకు కూడా ఎర్టిగా ఒక లాభదాయకమైన ఎంపికగా నిలుస్తోంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తే, CNG వేరియంట్ ఒక కిలో CNGతో 26.11 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది.
పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఈ స్థాయి మైలేజ్ వినియోగదారుల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే ఎక్కువ మైలేజ్ కోరుకునే వారు ఎర్టిగాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక కుటుంబ ప్రయాణాల విషయానికి వస్తే, ఎర్టిగా ప్రత్యేకంగా నిలిచే అంశం దాని విశాలమైన 7-సీటర్ క్యాబిన్. ఒకేసారి ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుండటంతో పాటు, రెండో, మూడో వరుస సీట్లలో కూడా తగినంత స్థలం లభిస్తుంది.

అవసరమైతే వెనుక సీట్లను మడిచి లగేజీ కోసం అదనపు స్థలాన్ని కూడా పొందవచ్చు. ఫ్యామిలితో కలిసి వెళ్లే టూర్లు, పండుగల సమయంలో బంధువులతో కలిసి ప్రయాణాలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లకు కుటుంబం అంతా కలిసి వెళ్లడానికి, ట్యాక్సీలగా కూడా నడపి ఉపాధి పొందడానికి, అలాగే రోజువారీ అవసరాలన్నింటికీ అనువైన MPVగా మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటికీ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications