మూడు కార్లు.. మూడు కథలు.. కానీ గెలిచింది మాత్రం జనాల మనసే! ట్రెండ్ సెట్ చేసిన మూడు కాంపాక్ట్ SUVలు

మార్కెట్లో కాంపాక్ట్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఈ సెగ్మెంట్ కార్లు మంచి ఎంపికగా మారాయి. సెడాన్‌ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే విశాలమైన క్యాబిన్, అలాగే బూట్ స్పేస్ ఉండటం వల్ల కాంపాక్ట్ SUVలు భారతీయ వినియోగదారుల అవసరాలకు బాగా సరిపోతున్నాయి. నగరాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మెరుగుపడాల్సిన రోడ్ల పరిస్థితులు కూడా ఈ వాహనాల పాపులారిటీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. కాంపాక్ట్ SUVలు అన్ని రకాల రోడ్లపై సులభంగా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు, డ్రైవర్‌కు మంచి విజిబిలిటీని కూడా అందిస్తాయి. ఈ కథణంలో గత నెలలో టాప్ 3 కాంపాక్ట్ SUVల గురించి చూద్దాం.

Tata Nexon: భారతదేశ కాంపాక్ట్ SUV మార్కెట్లో టాటా నెక్సాన్ తన స్థానం మరింత బలంగా నిలుపుకుంటోంది. అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ జాబితాలో టాటా నెక్సాన్ టాప్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. జనవరి 2025లో మొత్తం 15,397 యూనిట్లు అమ్ముడవగా, జనవరి 2026లో ఈ సంఖ్య 23,365 యూనిట్లకు చేరుకుంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే, నెక్సాన్ అమ్మకాలు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

India Top 3 Compact Suvs In January 2026 Tata Nexon Punch And Maruti Suzuki Brezza Details

నెక్సాన్ రూ. 7.32 లక్షల నుంచి రూ. 14.05 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. ఈ SUV 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 118 PS హార్స్‌పవర్‌తో పాటు 170 Nm పీక్ టార్క్‌ను, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 113 PS పవర్‌, 260 Nm టార్క్‌ను, 1.2-లీటర్ CNG ఇంజిన్ 99 PS పవర్, 170 Nm టార్క్‌ను ఇస్తుంది. మైలేజ్ పరంగా 17 kmpl నుంచి 24 kmpl ఇస్తుంది.

Tata Punch: భారతదేశ కాంపాక్ట్ కార్ మార్కెట్లో టాటా పంచ్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. తాజా అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ జాబితాలో టాటా పంచ్ కారు రెండవ స్థానంలో నిలవడం విశేషం. జనవరి 2025లో మొత్తం 16,231 యూనిట్లు అమ్ముడవ్వగా, ప్రస్తుతం ఈ సంఖ్య 19,257 యూనిట్లకు చేరింది. దీన్ని పరిశీలిస్తే, టాటా పంచ్ అమ్మకాలు సుమారు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

India Top 3 Compact Suvs In January 2026 Tata Nexon Punch And Maruti Suzuki Brezza Details

టాటా పంచ్ ప్రారంభ ధర కేవలం రూ. 5.49 లక్షలే. ఇంజిన్ పరంగా పంచ్‌లో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఇది 86 PS పవర్‌తో పాటు 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలుగా 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌లను అందిస్తోంది. ఇది 18.97 kmpl మైలేజీని అందిస్తుంది. టాటా పంచ్ ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో మార్కెట్లో లభిస్తుంది.

Maruti Suzuki Brezza: భారతదేశ కాంపాక్ట్ SUV మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజా అమ్మకాల గణాంకాల ప్రకారం, ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా కారు మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. జనవరి 2025లో మొత్తం 14,747 యూనిట్లు విక్రయించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 17,486 యూనిట్లకు చేరుకుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, బ్రెజ్జా అమ్మకాలు సుమారు 19 శాతం మేర పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

India Top 3 Compact Suvs In January 2026 Tata Nexon Punch And Maruti Suzuki Brezza Details

ప్రారంభ ధర రూ. 8,25,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 13,01,300 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది K-సిరీస్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడింది. పెట్రోల్ వేరియంట్‌లో ఇది 17.38 kmpl మైలేజీని అందిస్తే, CNG వేరియంట్‌లో 25.51 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 10, 2026, 17:18 [IST]
English summary
India top 3 compact suvs in january 2026 tata nexon punch and maruti suzuki brezza details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+