చీపెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. వీటిని చూస్తే పెట్రోల్, డీజిల్ కారు కొనరు! రూ.5 లక్షల నుంచి స్టార్ట్

అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై అనిశ్చితిని తీసుకొచ్చాయి. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయా లేదా అన్న సందేహం ప్రజల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చాలామంది వినియోగదారులు సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు కొనడం ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాకుండా ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తూ, రోజురోజుకీ మరింత బలపడుతోంది. ఇప్పుడు ఈ కథణంలో ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని ఈవీ కార్లను చూద్దాం.

Tata Tiago EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్న ఈ సంస్థ, అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని విభిన్న ఎంపికలను తీసుకువచ్చింది. ఈ లైనప్‌లో ప్రత్యేకంగా నిలిచేది టియాగో ఈవీ. ధర విషయానికి వస్తే, ఈ కారు ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ స్థాయిలో రూ. 7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Indias Most Affordable EV Cars Tiago EV Punch EV XUV 3XO Ev And Comet EV Details

టియాగో ఈవీ ప్రధానంగా అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారును కోరుకునే వారికి ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. టాటా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యంత చౌకైన మోడల్ కావడం దీని ప్రత్యేకత. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను టాటా రెండు బ్యాటరీ ఆప్షన్లలో 19.2kWh, 24kWh అందిస్తోంది. వినియోగదారుల అవసరాలను బట్టి తక్కువ రేంజ్‌తో కూడిన వేరియంట్‌ను లేదా ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

Tata Punch EV: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ SUV కోరుకునే వారికి పంచ్ ఒక ఆకర్షణీయమైన ఎంపిక. దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ SUVగా పంచ్ ఈవీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ధర పరంగా చూస్తే, పంచ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధరలు ప్రస్తుతం రూ. 9.69 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అయితే, టాటా తీసుకొచ్చిన బ్యాటరీ లీజింగ్ మోడల్ వల్ల ఈ కారు మరింత అందుబాటులోకి వచ్చింది.

Indias Most Affordable EV Cars Tiago EV Punch EV XUV 3XO Ev And Comet EV Details

బ్యాటరీని లీజ్‌పై తీసుకునే ఆప్షన్‌తో, ప్రారంభ ధరను రూ. 6.49 లక్షల వరకు తగ్గించడం సాధ్యమైంది. ఈ మోడల్‌ను టాటా రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో అందిస్తోంది 30kWh, 40kWh. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, తక్కువ రేంజ్ కావాలనుకునే వారు ఒక వేరియంట్‌ను, ఎక్కువ రేంజ్ కోరుకునే వారు మరో వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. నగర ప్రయాణాలకే కాకుండా, కొంతమేర హైవే డ్రైవింగ్‌కూ అనువుగా ఉండేలా దీనిని రూపుదిద్దారు.

Mahindra XUV 3XO EV: భారత ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా కూడా తన పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పరిచయం చేసిన Mahindra XUV 3XO EV ఒక ఆధునిక ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొద్ది నెలల క్రితమే విడుదలైన ఈ మోడల్, కొత్త డిజైన్, అడ్వాన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీకి తగిన ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Indias Most Affordable EV Cars Tiago EV Punch EV XUV 3XO Ev And Comet EV Details

ఈ ఎలక్ట్రిక్ కారులో 39.4kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది, ఇది రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌ను అందించగలదు. నగరంలో స్మూత్ డ్రైవింగ్ అనుభవం, తక్కువ రన్నింగ్ ఖర్చు వంటి ప్రయోజనాలతో ఇది ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ధర విషయానికి వస్తే, XUV 3XO EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.89 లక్షలుగా నిర్ణయించారు.

MG Comet EV: చిన్న పరిమాణం, స్మార్ట్ డిజైన్‌తో నగర ట్రాఫిక్‌లో సులభంగా నడిపించుకునే కామెట్ కారులో 17.3kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 41.43 BHP శక్తి, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, రోజువారీ కమ్యూట్‌కు సరిపడే పనితీరును అందిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బ్యాటరీ లీజింగ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ప్రారంభ ధరను రూ. 4.99 లక్షలు తగ్గించుకోవచ్చు.

Article Published On: Sunday, May 3, 2026, 7:30 [IST]
English summary
Indias most affordable ev cars tiago ev punch ev xuv 3xo ev and comet ev details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+