VIPలు, మినిస్టర్స్, PM సెక్యూరిటీ కాన్వాయ్‌‌లో కూడా ఉపయోగించే కారు.. సాధారణ ప్రజలు ఎగబడుతున్నారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో విశ్వసనీయతకు మరో పేరు చెప్పాలంటే చాలామంది ముందుగా గుర్తుచేసుకునేది టయోటా ఇన్నోవానే (Toyota Innova). కుటుంబ ప్రయాణాలు, వ్యాపార అవసరాలు, దీర్ఘ దూర టూర్లు, VIP ప్రయాణాలు.. ఇలా ఏ అవసరానికైనా సరిపోయే ఒక పూర్తి స్థాయి ప్రీమియం MPVగా ఇన్నోవా సంవత్సరాలుగా భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టయోటా బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిన మోడల్ కూడా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నోవా కేవలం ఒక కారు మాత్రమే కాదు, చాలా కుటుంబాల ప్రయాణాల్లో భాగమైన ఓ భావోద్వేగం లాంటిది. పెద్ద కుటుంబాలు, వ్యాపారవేత్తలు, ట్రావెల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా ఇన్నోవాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అంతేకాదు, మినిస్టర్స్, దేశ ప్రధానమంత్రి భద్రతా కాన్వాయ్‌లో కూడా ఈ వాహనం కనిపించడం విశేషం. ప్రస్తుతం టయోటా భారత మార్కెట్లో ఇన్నోవాను రెండు ప్రధాన రూపాల్లో విక్రయిస్తోంది. ఒకటి ఇన్నోవా క్రిస్టా కాగా, మరొకటి ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్. ఇన్నోవా క్రిస్టా రఫ్ అండ్ టఫ్ స్వభావంతో ఉండగా, ఇన్నోవా హైక్రాస్ కొత్త తరం డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన మైలేజ్ కలిగి ఉంటుంది.

Innova Hycross And Crysta Combined Become Best Selling Toyota Cars In India

ఈ రెండు వేరియంట్లు కలిసి టయోటా విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నెల నెలా భారీ స్థాయిలో అమ్ముడవుతూ, టయోటా లైనప్‌లో అత్యధికంగా కొనుగోలు చేయబడుతున్న కార్లలో ఇన్నోవా ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. 2026 ఏప్రిల్ నెలలో టయోటా భారతీయ మార్కెట్లో మొత్తం 30,159 కార్లను విక్రయించగా, అందులో అత్యధిక వాటా ఇన్నోవా MPVలదే కావడం విశేషం. కంపెనీ విక్రయాల్లో 32 శాతం వాటాను క్రిస్టా, హైక్రాస్ కలిసి సాధించాయి.

అంటే టయోటా అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి ఇన్నోవా మోడల్ కావడం ఈ MPVకి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇన్నోవా లైనప్‌లో ముఖ్యంగా హైక్రాస్ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతూ కొనుగోలుదారుల మొదటి ఎంపికగా మారింది. 2026 ఏప్రిల్‌లో ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5,602 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు, మైలేజ్ కారణంగా దీనికి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది.

Innova Hycross And Crysta Combined Become Best Selling Toyota Cars In India

గత ఏడాది ఇదే నెలలో హైక్రాస్ విక్రయాలు 4,494 యూనిట్లుగా ఉండగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరగడం గమనార్హం. మరోవైపు, సంప్రదాయ డీజిల్ MPVగా పేరు తెచ్చుకున్న ఇన్నోవా క్రిస్టా కూడా తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. 2026 ఏప్రిల్‌లో ఈ మోడల్ 4,028 యూనిట్ల అమ్మకాలతో బలమైన ప్రదర్శన కనబరిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో క్రిస్టా కేవలం 3,205 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి మంచి వృద్ధిని నమోదు చేసింది.

దూర ప్రయాణాలకు అనువైన కంఫర్ట్, విశ్వసనీయమైన ఇంజిన్ పనితీరు, మంచి రీసేల్ విలువ వంటి కారణాలతో చాలా మంది ఇప్పటికీ క్రిస్టాను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. మొత్తంగా చూస్తే, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో 9,630 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 7,699 యూనిట్లుగా ఉండగా, ఇప్పుడు భారీగా పెరగడం గమనార్హం.

Innova Hycross And Crysta Combined Become Best Selling Toyota Cars In India

టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రూ. 19.18 లక్షల నుండి రూ. 25.98 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. బలమైన డీజిల్ ఇంజిన్, దీర్ఘకాలిక మన్నిక, భారీ కుటుంబాలకు సరిపోయే విశాలమైన క్యాబిన్ వంటి లక్షణాలతో క్రిస్టా ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. మరోవైపు, ఆధునిక ఫీచర్లు, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ ధరలు రూ. 19.53 లక్షల నుండి రూ. 31.84 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Article Published On: Tuesday, May 19, 2026, 9:17 [IST]
English summary
Innova hycross and crysta combined become best selling toyota cars in india
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+