ఇక ఫార్చ్యూనర్ పని ఖతం.. మార్కెట్లోకి 3 బ్రహ్మస్త్రాలను దింపుతున్న ఎంజీ కంపెనీ

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor) సరికొత్త వ్యూహంతో దూసుకురాబోతోంది. రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్‌ను మార్చేలా ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ విభాగాలలో 3 సరికొత్త కార్లను లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఎంజీ మెజస్టర్ (MG Majestor)
ఎంజీ మోటార్స్ నుంచి రాబోతున్న అత్యంత పవర్‌ఫుల్, భారీ ఎస్‌యూవీ ఎంజీ మెజస్టర్. గతంలో మార్కెట్లో ఉన్న గ్లోస్టర్ (Gloster) ప్లేస్‌లో ఈ కొత్త కారు రాబోతోంది. ఆటో ఎక్స్‌పో 2025లో మొదటిసారి కనిపించిన ఈ కారును చూసి జనాలు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ మే నెలలోనే దీన్ని అధికారికంగా షోరూమ్‌లలోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మల్హోత్రా కన్ఫర్మ్ చేశారు.

JSW MG Motor to Launch 3 New SUVs by Year-End Including Toyota Fortuner Rival Majestor

లుక్ పరంగా పాత గ్లోస్టర్ కంటే ఇది ఎంతో భారీగా, రగ్గడ్, మస్కులర్ స్టైల్‌లో కనిపిస్తుంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో అమర్చిన అతిపెద్ద గ్రిల్, సరికొత్త స్ప్లిట్ హెడ్‌లైట్స్, అగ్రెసివ్ బంపర్ కారుకు ఒక రేంజ్ క్రేజ్‌ను ఇస్తున్నాయి. ఇవే కాకుండా 19-ఇంచుల భారీ అలాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, పటిష్టమైన స్కిడ్ ప్లేట్ దీని సొంతం.

కారు లోపలికి అడుగుపెడితే ఇది కారులా కాదు.. ఏదో ఒక లగ్జరీ రాజభవనంలా అనిపిస్తుంది. కస్టమర్ల కంఫర్ట్ కోసం డాష్‌బోర్డ్‌ను పూర్తిగా మార్చేసి సరికొత్త మోడ్రన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కేబిన్ లోపల 12.3-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అంతే సైజు ఉన్న భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకే లైన్లో కనిపిస్తాయి. రెండు వైర్‌లెస్ ఛార్జర్లు, వెంటిలేషన్, హీటింగ్ ఆప్షన్లు ఉన్న సీట్లను అమర్చారు. వీటన్నింటికీ మించి.. డ్రైవర్, పక్కన కూర్చునే వారి సీట్లలో 8-పాయింట్ మసాజ్ ఫీచర్‌ను ఇచ్చారు. దీనివల్ల ఎంత లాంగ్ జర్నీ చేసినా ఒళ్లు నొప్పులు అనే మాటే రాదు.

ఈ కారు కేవలం సిటీ రోడ్లకే కాదు.. అడవులు, కొండలు, బురద దారుల్లో కూడా దూసుకుపోయేలా డిజైన్ చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. కారులో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్‌తో పాటు ఫ్రంట్, సెంటర్, రేర్.. ఇలా మూడు చోట్లా లాకింగ్ డిఫరెన్షియల్స్ ఇచ్చారు. దీనివల్ల కారు ఎలాంటి కఠినమైన ఇసుక, బురద దారుల్లో ఇరుక్కుపోకుండా ఈజీగా బయటపడిపోతుంది. ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను వాడారు. ఇది పవర్‌ఫుల్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

JSW MG Motor to Launch 3 New SUVs by Year-End Including Toyota Fortuner Rival Majestor

ఎంజీ స్టార్‌లైట్ బేస్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
ఎంజీ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి ఈ ఏడాది చివరికల్లా ఒక సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయబోతోంది. చైనా మార్కెట్లో సూపర్ హిట్ అయిన వులింగ్ స్టార్‌లైట్ 560 (Wuling Starlight 560) మోడల్‌ను బేస్ చేసుకుని మన దేశీయ మార్కెట్ కోసం దీన్ని తయారు చేస్తున్నారు. ఈ కారు భారత మార్కెట్లోకి వచ్చాక నేరుగా టాటా సఫారీ ఈవీ, మహీంద్రా రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును భారతీయ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా 5-సీటర్, 7-సీటర్.. ఇలా రెండు రకాల సిట్టింగ్ ఆప్షన్లలో తీసుకురాబోతున్నారు. విశాలమైన లెగ్‌రూమ్, బూట్ స్పేస్‌తో పాటు ఎంజీ కంపెనీకి చెందిన ఐ-స్మార్ట్ (i-SMART) కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ రేంజ్ కూడా సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా.

ఎంజీ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ (New Hybrid Model)
ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయిన కస్టమర్ల కోసం ఎంజీ కంపెనీ ఒక సూపర్ మైలేజ్ ఇచ్చే సరికొత్త హైబ్రిడ్ (Hybrid) ఎస్‌యూవీని కూడా ఈ ఏడాది డిసెంబర్ లోపు మార్కెట్లోకి దించబోతోంది. ఇది కూడా వులింగ్ స్టార్‌లైట్ ప్లాట్‌ఫారమ్‌పైనే రానుంది. ఇందులో ఉండే అడ్వాన్స్‌డ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ (PHEV) కారు మైలేజ్ పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

ఈ హైబ్రిడ్ కారు అసలైన స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. చైనాలో విక్రయించే మోడల్ డేటా ప్రకారం.. ఈ కారులో పెట్రోల్ అసలు వాడకుండా, కేవలం బ్యాటరీ పవర్ (Pure EV Mode) తోనే ఏకంగా 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

అంటే మీ రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఒక్క చుక్క పెట్రోల్ కూడా అవసరం లేదన్నమాట. లాంగ్ జర్నీ వెళ్లినప్పుడు పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల కారు లీటరుకు దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Article Published On: Monday, May 25, 2026, 16:20 [IST]
English summary
Jsw mg motor to launch 3 new suvs by year end including toyota fortuner rival majestor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+