మధ్యతరగతి కోసం తక్కువ ధరకే 500+కి.మీ రేంజ్ కారు వస్తోంది.. ముందే బయటపడిన ఎక్స్‌టీరియర్ డిజైన్!
కియా ఇండియా ఈ జూలైలో రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన టీజర్లతో ఒక హైబ్రిడ్ ఎస్‌యూవీతో పాటు మరో పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా రానున్నట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కియా కొత్త ఈవీకి సంబంధించిన కీలక వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారత మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న కియా సైరోస్(Kia Syros) కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ బెంగళూరు నగరంలోని రోడ్డుపై ఎలాంటి క్యామోఫ్లాజ్ లేకుండా సైరోస్ ఈవీ టెస్ట్ రన్ చేస్తుండగా కనిపించింది. ఈ వాహనానికి గ్రీన్ నంబర్ ప్లేట్ ఉండటంతో ఇది ఎలక్ట్రిక్ మోడల్ అనే విషయం స్పష్టమైంది.
డిజైన్ విషయానికి వస్తే, కొత్త కియా సిరోస్ ఈవీ రూపురేఖలు ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న పెట్రోల్ సిరోస్‌ను దాదాపు పూర్తిగా పోలి ఉన్నాయి. బయట నుంచి చూసినప్పుడు రెండింటి మధ్య పెద్దగా తేడా కనిపించదు. డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఎలక్ట్రిక్ SUV తన పెట్రోల్ వెర్షన్‌కు దగ్గర పోలికను కొనసాగించినప్పటికీ, EVకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కియా కొన్ని కీలక మార్పులు చేసింది.

ముందుభాగంలో సన్నగా కనిపించే క్లోజ్డ్ గ్రిల్, కొత్త స్టైల్ బంపర్ కారుకి మరింత కొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. ఐస్‌క్యూబ్ LED హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌పై ఆకర్షణీయంగా అమర్చిన త్రిభుజాకార కలర్ డిజైన్ ఎలిమెంట్లు ఈ SUVకు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెట్రోల్ మోడల్‌లోని బలమైన బాడీ లైన్లు అలాగే కొనసాగాయి. మందంగా కనిపించే B-పిల్లర్, పెద్ద గాజు విస్తీర్ణం, వీల్ ఆర్చ్‌లు SUVకు స్పోర్టీ స్టాన్స్‌ను ఇస్తున్నాయి.
అయితే ప్రత్యేకంగా EV కోసం రూపొందించిన 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ దీని రూపాన్ని మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయి. అంతేకాకుండా, మోటరైజ్డ్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది. ఇవి కారు ప్రీమియం ఫీల్‌ను మరింత పెంచనున్నాయి. క్యాబిన్‌లోకి అడుగుపెడితే ఆధునిక టెక్నాలజీకి పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డుపై ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కోసం రెండు పెద్ద స్క్రీన్‌లు అందుబాటులో ఉంటాయి.

కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్ క్యాబిన్‌కు స్టైలిష్ లుక్‌ను తీసుకురావడమే కాకుండా, బ్యాటరీ రీజెనరేషన్ స్థాయిని నియంత్రించేందుకు ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా అందించనుంది. వీటితో పాటు డ్యాష్‌క్యామ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ప్రీమియం ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఈ కారు మధ్యతరగతిని ఆకట్టుకోవచ్చు.
ఈ కథణంలో చిత్రాలను కార్‌దేఖో నుంచి తీసుకున్నాం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మోడల్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కియా తయారీ కేంద్రంలోనే ఈ వాహనాన్ని ఉత్పత్తి చేయనున్నందున, దిగుమతి ఖర్చులు తగ్గి ధరను పోటీతత్వంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ కొత్త EVలో కియా ఇప్పటికే విడుదల చేసిన కారెన్స్ క్లావిస్ EVలో ఉపయోగించిన బ్యాటరీ టెక్నాలజీనే అందించనున్నట్లు సమాచారం.
ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో 42 kWh బ్యాటరీ ప్యాక్, టాప్ వేరియంట్‌లో 51.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. ARAI ధృవీకరించిన అంచనాల ప్రకారం, 42 kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 420 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇక 51.4 kWh బ్యాటరీతో కూడిన టాప్ వేరియంట్ 520 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను అందించే అవకాశముంది.


Click it and Unblock the Notifications