కరెంట్ కార్లలో ఇది కింగ్.. సింగిల్ ఛార్జ్‌తో 453 కిలోమీటర్లు.. ధర కూడా చాలా తక్కువ
గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం కియా (Kia), మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఎలక్ట్రిక్ కారు కియా EV2 (Kia EV2) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో యూరప్ మార్కెట్ కోసం దీనిని ప్రదర్శించిన కియా, ఇప్పుడు దీని ధరలు, వేరియంట్లను వెల్లడించింది. విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, ఏకంగా 453 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. జర్మనీతో సహా పలు యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీని బుకింగ్స్ షురూ అయ్యాయి. కియా సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా EV2 రికార్డు సృష్టించబోతోంది.
అందుబాటు ధరలో లగ్జరీ ఈవీ!
కియా EV2 ప్రధానంగా బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లను కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. యూరోపియన్ మార్కెట్లలో దీని బేస్ వేరియంట్ ధర సుమారు EUR 26,600 (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) గా నిర్ణయించారు. స్లోవేకియాలోని కియా ప్లాంట్‌లో ఈ కార్ల ఉత్పత్తి జరుగుతోంది. కేవలం అమ్మడమే కాకుండా, కస్టమర్ల సౌకర్యార్థం కియా ఈ కారును లీజుకు కూడా ఇస్తోంది. నెలకు కేవలం రూ. 26,000 (EUR 239) చెల్లించి ఈ కారును వాడుకునే సదుపాయం కల్పించడం విశేషం. ఇది ముఖ్యంగా సిటీల్లో తిరిగే యువతకు మరియు చిన్న కుటుంబాలకు గొప్ప వరం అని చెప్పవచ్చు.

వేరియంట్ల వారీగా బ్యాటరీ, పవర్
కియా EV2 ను మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్స్‌లో లాంచ్ చేశారు..
లైట్ (Light): ఇది బేస్ వేరియంట్. ఇందులో 4-సీట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దీనివల్ల వెనుక కూర్చునే వారికి అద్భుతమైన లెగ్ స్పేస్, సౌకర్యం లభిస్తుంది. ఇందులో 42.2 kWh బ్యాటరీ ప్యాక్, 146 hp ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 317 కి.మీ రేంజ్ ఇస్తుంది.
ఎయిర్ (Air): ఇది 5-సీట్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీలు ఉన్నాయి. 61 kWh బ్యాటరీ వెర్షన్ ఏకంగా 453 కి.మీ భారీ రేంజ్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ.36.52 లక్షలు.
ఎర్త్ (Earth): ఇది 4, 5 సీట్ల ఫార్మాట్లలో లభిస్తుంది. 42.2 kWh బ్యాటరీతో వస్తూ 308 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.34.12 లక్షల నుంచి మొదలవుతుంది.
GT-లైన్: ఇది స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం. ఇందులో 61 kWh బ్యాటరీ ఉండి, 413 కి.మీ రేంజ్ అందిస్తుంది. దీని ధర దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటుంది.

అత్యాధునిక ఫీచర్లు, డిజైన్
కియా EV2 కేవలం రేంజ్ లోనే కాదు, ఫీచర్ల విషయంలో కూడా రాజీ పడలేదు. కారు లోపల లగ్జరీ ఇంటీరియర్‌తో పాటు డిజిటల్ డిస్ప్లే సెటప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) ఫార్మాట్‌లో వచ్చే ఈ కారు, కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉంది. స్లిమ్ LED హెడ్ లైట్లు, ఏరోడైనమిక్ బాడీ వల్ల కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. సేఫ్టీ పరంగా కూడా కియా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను ఇందులో జోడించింది.
భారత్ లోకి ఎప్పుడు రావచ్చు?
ప్రస్తుతానికి యూరప్ మార్కెట్లలో విడుదలైన కియా EV2, త్వరలోనే గ్లోబల్ మార్కెట్లకు విస్తరించనుంది. భారతదేశంలో కియా ఇప్పటికే EV6, EV9 వంటి ప్రీమియం కార్లను విక్రయిస్తోంది. అయితే, భారతీయ కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోయేలా కియా EV3 లేదా EV2ను 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో లాంచ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే, ఇక్కడ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ముఖ్యంగా 453 కిమీ రేంజ్ అనేది భారతీయ రోడ్ల పరిస్థితులకు ఒక గేమ్ ఛేంజర్ కానుంది.

మార్కెట్ పోటీ
యూరోపియన్ మార్కెట్లలో కియా EV2 కు ప్రధానంగా రెనో, సిట్రోయెన్, ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదరుకాబోతుంది. అయినప్పటికీ, కియా అందించే లగ్జరీ ఫినిషింగ్, బ్యాటరీ వారంటీ కస్టమర్లను ఆకర్షిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈవీల కోసం చూస్తున్న వారికి EV2 ఒక సరైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి కియా EV2 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








