ఎప్పుడొచ్చామన్నది కాదన్నా.. మార్కెట్ దున్నేశామా లేదా ? హ్యుందాయ్‌కే సవాల్ విసురుతున్న కియా
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కౌంటర్ పార్ట్ హ్యుందాయ్‌కు తోడుగా, కమ్-బ్యాక్ ఇచ్చిన కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ కియా ఇండియా ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన ఈ సంస్థ, జనవరి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అదిరిపోయే సేల్స్ గ్రోత్‌ను నమోదు చేసింది.
ముఖ్యంగా కంపెనీకి వెన్నెముకగా నిలిచిన సెల్టోస్, సొనెట్ మోడళ్లు ఈసారి కూడా సేల్స్ చార్టులలో టాప్ గేర్‌లో దూసుకుపోతూ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇచ్చాయి. గతేడాది జనవరితో పోల్చినా, లేదా మొన్నటి డిసెంబర్ నెలతో పోల్చినా అమ్మకాల్లో వచ్చిన భారీ మార్పు చూస్తుంటే, కస్టమర్లు క్రాస్ఓవర్లు, ఎస్‌యూవీల విషయంలో కియాని ఏ రేంజ్‌లో ఓన్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. కేవలం ఫీచర్లు ఇవ్వడమే కాకుండా, భారతీయ రోడ్లకు తగ్గట్టుగా స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ కార్లను తీసుకురావడం కియాకు బాగా కలిసి వచ్చింది.

కియా ఇండియా తన మార్కెట్ స్ట్రాటజీని పక్కాగా అమలు చేస్తూ, ఈ ఏడాది జనవరిలో మొత్తం 27,603 వాహనాలను విక్రయించింది. ఇది 2025 జనవరిలో నమోదైన 25,025 యూనిట్లతో పోలిస్తే సుమారు 10.3 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సాధారణంగా డిసెంబర్ నెలలో అమ్మకాలు తగ్గుతుంటాయి, కానీ జనవరి 2026 నాటికి కియా ఏకంగా 47.9 శాతం నెలవారీ వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంటే డిసెంబర్‌లో 18,659 కార్లు అమ్మిన సంస్థ, జనవరి వచ్చేసరికి దాదాపు 9 వేల కార్లను అదనంగా విక్రయించగలిగింది. ఈ దూకుడు వల్ల భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో కియా 6వ స్థానానికి ఎగబాకడమే కాకుండా, 6.1 శాతం మార్కెట్ వాటాను తన ఖాతాలో వేసుకుంది.

కియా ఫ్యామిలీలో ప్రస్తుతానికి సొనెట్ రారాజులా వెలిగిపోతోంది. గత నెలలో 10,998 సొనెట్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది జనవరితో పోలిస్తే 53 శాతం అద్భుతమైన వృద్ధి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాప్-10లో నిలవడం ఈ కారు క్రేజ్‌కు నిదర్శనం. ఇక రెండో జనరేషన్ సెల్టోస్ విషయానికి వస్తే, ఇది మార్కెట్‌ను షేక్ చేస్తోంది.
జనవరిలో 10,639 సెల్టోస్ కార్లు రోడ్లపైకి వచ్చాయి. వార్షిక వృద్ధి 64 శాతం కాగా, డిసెంబర్‌తో పోలిస్తే ఏకంగా 144 శాతం జంప్ కనిపించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా వంటి కార్లకు సెల్టోస్ సింహస్వప్నంలా మారింది. టెక్నాలజీ, సేఫ్టీ, ప్రీమియం లుక్స్ ఈ కారుకు ఇంతటి విజయాన్ని తెచ్చిపెట్టాయి.

కియా కేవలం ఎస్‌యూవీలకే పరిమితం కాకుండా ఫ్యామిలీ కార్ల విభాగంలోనూ సత్తా చాటుతోంది. కేరెన్స్ క్లావిస్, దాని ఎలక్ట్రిక్ వెర్షన్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. జనవరిలో 5,633 కేరెన్స్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతంతో పోలిస్తే 2 శాతం తక్కువ గ్రోత్ ఉన్నప్పటికీ, డిసెంబర్‌తో పోలిస్తే 53 శాతం మెరుగ్గా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు వెళ్లే కస్టమర్ల కోసం కియా త్వరలోనే క్లావిస్ ఈవీని కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది కాకుండా, కార్నివాల్ వంటి ప్రీమియం మోడళ్లు ఉన్నప్పటికీ, వాటి ధర, లగ్జరీ విభాగం కారణంగా అమ్మకాలు పరిమితంగానే (58 యూనిట్లు) నమోదయ్యాయి.

అయితే అన్ని మోడళ్లు కియాకు విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా కియా సైరోస్ (Syros) అమ్మకాలు భారీగా పడిపోవడం కంపెనీకి ఒక హెచ్చరికలా మారింది. గతేడాది జనవరిలో 5,546 యూనిట్లు అమ్ముడైన ఈ మోడల్, ఈ ఏడాది కేవలం 275 యూనిట్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం దీని బాక్సీ డిజైన్, ధర అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లోటును పూడ్చేందుకు కియా ఇప్పుడు సైరోస్ ఈవీని రంగంలోకి దించుతోంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును అందించాలనే లక్ష్యంతో ఎక్సైడ్ ఎనర్జీ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, భారత్‌లోనే బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయాలని భావిస్తోంది.
కియా ఇండియా కేవలం కార్లను అమ్మడమే కాకుండా, ఎలక్ట్రిక్ కార్ల యజమానుల కోసం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరుస్తోంది. భారత్ పెట్రోలియం (BPCL)తో జతకట్టి దేశవ్యాప్తంగా 15,000 పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు కియా సిద్ధమైంది. దీనివల్ల లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవారికి రేంజ్ ఆందోళన ఉండదు.
త్వరలోనే విడుదల కాబోయే చౌక ధర ఎలక్ట్రిక్ కారు, విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ కియాను భవిష్యత్తులో నంబర్ వన్ ఈవీ బ్రాండ్‌గా నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ తర్వాత అంతటి వేగంగా భారతీయ కస్టమర్ల మనసు గెలుచుకున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కియాయే.


Click it and Unblock the Notifications








