ఈ కంపెనీని నమ్మి 2.8 లక్షల మంది కొన్నారు.. ఈ కారును మాత్రం ప్రజలు మరింత బాగా ఇష్టపడ్డారు
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే, దేశీయ దిగ్గజాలు అయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల స్థాయికి ఎదిగిన కార్ల తయారీదారుల్లో కియా ఇండియా (Kia India) ఒకటి. దక్షిణ కొరియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కియా, భారత మార్కెట్ ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, అతి తక్కువ సమయంలోనే ఇక్కడ తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల అవసరాలకు తగ్గ ఫీచర్లు ఈ మూడు అంశాలను సమన్వయంగా అందించడం కియా విజయానికి ప్రధాన కారణంగా మారింది. భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రతి ఏడాది కియా ఇండియా స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది.
తాజాగా విడుదలైన 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చాటుతున్నాయి. 2025లో కియా ఇండియా నమోదు చేసిన అమ్మకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా ఈ కంపెనీ కార్లకు ఎంతటి డిమాండ్ ఉందో అర్థమవుతుంది. మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కియా తన స్థిరమైన పనితీరుతో మరోసారి తన సత్తాను నిరూపించింది.

భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కియా ఇండియా తన బలమైన వార్షిక పనితీరును కొనసాగిస్తూ, CY(క్యాలెండర్ ఇయర్)2025ను ఇప్పటివరకు అత్యున్నత స్థాయిలో ముగించింది. ఈ సంవత్సరంలో కియా మొత్తం హోల్‌సేల్ వాల్యూమ్‌లు 2,80,286 యూనిట్లకు చేరాయి. ఇది CY2024లో నమోదైన 2.45 లక్షల యూనిట్లతో పోలిస్తే సుమారు 15 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిగా నిలుస్తుంది. ఈ సంఖ్యలు కియా బ్రాండ్ భారత మార్కెట్‌లో ఎంత వేగంగా పట్టు సాధించిందో చూపిస్తున్నాయి.
ఈ స్థిరమైన వృద్ధి కేవలం సంఖ్యల వరకే పరిమితం కాదు. ఇది భారతీయ కొనుగోలుదారుల్లో కియా బ్రాండ్‌కు లభిస్తున్న విశ్వాానికి, ప్రతిబింబంగా నిలుస్తుంది. చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు, యువత నుంచి ఫ్యామిలీ కొనుగోలుదారుల వరకు వినియోగదారులను ఆకట్టుకునేలా కియా తన ఉత్పత్తిని విస్తృతంగా రూపొందించింది. SUVలు, MPVలు, సెడాన్‌లు వంటి విభాగాల్లో అందుబాటులో ఉన్న కియా మోడళ్లు, ప్రతి కస్టమర్ అవసరానికి సరిపోయే ఎంపికను అందిస్తున్నాయి.

ఈ బలమైన పనితీరుకు ప్రధాన కారణంగా నిలిచింది కియా సోనెట్. 2025లో మరోసారి ఈ కాంపాక్ట్ SUV లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటడం ద్వారా కియాకు కీలకమైన ఆధారంగా మారింది. వరుసగా రెండవ సంవత్సరం ఈ ఘనతను సాధించడం విశేషం. భారత మార్కెట్‌లో అత్యంత పోటీ ఉన్న విభాగాల్లో ఒకటైన కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో సోనెట్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, కియాను నడిపించే ప్రధాన శక్తిగా కొనసాగుతోంది.
సోనెట్‌కు లభిస్తున్న ఈ స్థిరమైన డిమాండ్, అదే సమయంలో కియా సెల్టోస్ నుంచి వచ్చిన బలమైన సహకారంతో మరింత బలపడింది. మిడ్-సైజ్ SUV విభాగంలో సెల్టోస్ ఎప్పటిలాగే కియా పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోషిస్తూ, కంపెనీ అమ్మకాలకు స్థిరమైన మద్దతును అందించింది. ఈ రెండు SUVలు కలిసి కియా బ్రాండ్‌కు బలమైన పునాదిని నిర్మించాయి. అదే సమయంలో కియా MPV శ్రేణి కూడా 2025లో మంచి స్పందనను దక్కించుకుంది.

కంపెనీ ప్రకారం, కారెన్స్, కారెన్స్ క్లావిస్, తాజాగా పరిచయమైన కారెన్స్ క్లావిస్ EV మోడళ్లకు వినియోగదారుల నుంచి సానుకూల స్పందన లభించింది. కుటుంబ అవసరాలకు సరిపోయే స్థలం, సౌకర్యం, ఆధునిక ఫీచర్ల కలయిక ఈ మోడళ్లను కొనుగోలుదారుల దగ్గర మరింత ఆదరణ పొందేలా చేసింది. ప్రీమియం విభాగంలోకి వస్తే, నాల్గవ తరం కార్నివాల్ లిమోసిన్, EV6 మోడళ్లు కూడా కియా బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.


Click it and Unblock the Notifications








