దేశంలో ఈ కారు కొనేవారు పెరుగుతున్నారు.. ఇండియాలో కొరియన్ పవర్ చూపిస్తుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లిన మోడళ్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఈ SUV తన ప్రత్యేకమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో, Kia బ్రాండ్‌కు భారతదేశంలో ఒక బలమైన గుర్తింపును తీసుకురావడంలో సెల్టోస్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఈ SUV తన క్రేజ్‌ను కొనసాగిస్తూ, అమ్మకాల పరంగా మంచి ప్రదర్శనను చూపుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, మార్చి 2026లో సెల్టోస్ మొత్తం 11,041 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, దీని పెరుగుదల మరింత స్పష్టంగా తెలుస్తుంది. మార్చి 2025లో ఈ SUV 6,525 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

అంటే, కేవలం ఒక సంవత్సరంలోనే అమ్మకాల సంఖ్యలో భారీగా పెరుగుదల. శాతంగా చూస్తే, 69 శాతం వృద్ధి. ఇప్పటికే మార్కెట్లో స్థిరమైన స్థానం ఉన్న మోడల్‌కు ఇంత పెద్ద వృద్ధి రావడం అసాధారణం. ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు, వినియోగదారుల నమ్మకం మరింతగా పెరుగుతోందనే సంకేతం. పెరుగుతున్న పోటీ మధ్య సెల్టోస్ తన స్థాయిని నిలబెట్టుకోవడం, కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడం దీని బలాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Kia Seltos March 2026 Sales Recorded 11041 Units More Details Inside

అలాగే, ఫిబ్రవరి 2026లో అమ్మకాల గణాంకాలు 10,308 యూనిట్లు భారత మార్కెట్లో విక్రయించబడింది. దీని ప్రకారం, నెలవారీగా చూసినట్లయితే, మెరుగైన వృద్ధి అని చెప్పొచ్చు. కియా సెల్టోస్ ధరల పరంగా విభిన్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మంచి రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉండటంతో, బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఉన్న కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందించబడింది.

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, Kia ఈ మోడల్‌ను మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందిస్తోంది. రోజువారీ వినియోగానికి అనువుగా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే, ఎక్కువ పనితీరు కోరుకునే వారికి 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. దీని తోడుగా, ఇంధన సామర్థ్యం మరియు దీర్ఘ ప్రయాణాలకు అనువుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా ఉంది.

Kia Seltos March 2026 Sales Recorded 11041 Units More Details Inside

ఇలా మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లు అందించడం ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల పరంగా కూడా ఈ SUV చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్, iMT, అలాగే 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండటం వల్ల, డ్రైవింగ్ స్టైల్‌కు తగ్గట్టు వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

కియా సెల్టోస్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ SUV నిజంగా ప్రీమియం అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. లోపల కూర్చున్న వెంటనే కనిపించే ప్రధాన ఆకర్షణ 12.3-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లేలు. ఇవి ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సమర్థంగా కలిపి, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఆధునికంగా మార్చేస్తాయి. కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా కేబిన్‌కు ఒక ఫ్రెష్ లుక్ ఇస్తుంది.

Kia Seltos March 2026 Sales Recorded 11041 Units More Details Inside

పనోరమిక్ సన్‌రూఫ్ ఈ SUVలోని మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కేబిన్‌ను మరింత స్పేసియస్‌గా అనిపించేలా చేస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వల్ల డ్రైవర్, ప్యాసింజర్‌లు తమకు నచ్చిన ఉష్ణోగ్రతను వేర్వేరుగా సెట్ చేసుకోవచ్చు. అదనంగా, బోస్ సౌండ్ సిస్టమ్ అందించే ఆడియో క్వాలిటీ ప్రయాణాన్ని మరింత ఎంజాయబుల్‌గా మార్చుతుంది. ఇదే సమయంలో, Kia ఈ SUVలో అత్యాధునిక టెక్నాలజీని కూడా సమృద్ధిగా అందించింది.

భద్రతా పరంగా లెవల్-2 ADAS, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, LED లైట్, వెనుక సీట్లకు రిక్లైన్ ఫంక్షన్, ప్యాసింజర్‌లకు కూడా మంచి కంఫర్ట్ లభిస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 13, 2026, 16:31 [IST]
English summary
Kia seltos march 2026 sales recorded 11041 units more details inside
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+