ఆశ్చర్యపోయే ఫీచర్లతో రెండు కొత్త టాప్ వేరియంట్లను తెచ్చిన కియా.. 28 ADAS ఫీచర్లు, లగ్జరీ ఫీలింగ్!
భారతదేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, ప్రీమియం క్యాబిన్‌తో ఈ SUV ఇప్పటికే లక్షలాది మంది కొనుగోలుదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. మీరు కూడా సెల్టోస్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే, కియా నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీ భారత మార్కెట్లో సెల్టోస్‌కు రెండు కొత్త టాప్-ఎండ్ వేరియంట్లను పరిచయం చేసింది. కొత్తగా విడుదలైన GTX (O), X-Line (O) వేరియంట్లు ఇప్పుడు సెల్టోస్ శ్రేణిలో అత్యంత ప్రీమియం ఆప్షన్లుగా నిలిచాయి. ఈ వేరియంట్ల ప్రారంభ ధర రూ.21.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.
ఇప్పటికే ఫీచర్ల విషయంలో మంచి పేరు తెచ్చుకున్న సెల్టోస్‌ను మరింత ప్రీమియంగా మార్చే ఉద్దేశంతో కియా ఈ కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్లలో అతిపెద్ద హైలైట్ ADAS F+ సూట్. మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో ఈ వ్యవస్థ మరింత భద్రతను అందిస్తుంది. దీంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చే పలు కొత్త ప్రీమియం ఫీచర్లను కూడా కియా జోడించింది.

ఇప్పటి వరకు కియా సెల్టోస్‌ను HTE, HTE (O), HTK, HTK (O), HTX, HTX (A), GTX, X-Line, GTX (A), X-Line (A) వంటి మొత్తం 10 వేరియంట్లలో విక్రయిస్తోంది. తాజాగా వచ్చిన GTX (O), X-Line (O) పేర్లతో రెండు కొత్త టాప్-ఎండ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సెల్టోస్ లైనప్‌లో ఇవే అత్యంత ప్రీమియం, అత్యంత ఖరీదైన వేరియంట్లుగా నిలవనున్నాయి.
ఇప్పటికే ఫీచర్ల పరంగా మంచి పేరు తెచ్చుకున్న సెల్టోస్‌ను మరింత ఆధునికంగా, లగ్జరీగా మార్చే లక్ష్యంతో కియా ఈ కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. ఈ రెండు కొత్త వేరియంట్లలో క్యాబిన్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అనేక కొత్త ఫీచర్లను కంపెనీ జోడించింది. డ్రైవర్‌కు కీలక సమాచారాన్ని నేరుగా విండ్‌స్క్రీన్‌పైనే చూపించే HUD (హెడ్-అప్ డిస్‌ప్లే), క్యాబిన్‌లో గాలి నాణ్యతను తెలియజేసే AQI డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.

ముందు, వెనుక దృశ్యాలను ఒకేసారి రికార్డ్ చేసే డ్యూయల్-ఛానల్ స్మార్ట్ డాష్‌క్యామ్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ సపోర్ట్, అలాగే ఇన్‌బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ప్రయాణ అనుభవం కూడా కొత్త స్థాయికి చేరుతుంది. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. GTX (O), X-Line (O) వేరియంట్లలో తాజా ADAS F+ సూట్‌ను అందిస్తోంది.
ఇందులో ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్-జంక్షన్ క్రాసింగ్, లేన్ చేంజ్ ఆన్‌కమింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ సైడ్ అసిస్ట్, ఇవేసివ్ స్టీరింగ్ అసిస్ట్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అలాగే, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి అత్యాధునిక భద్రతా సాంకేతికతలు ఉన్నాయి. మొత్తం 28 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో ఈ SUV ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.

ఇంజిన్ పరంగా కియా ఎలాంటి మార్పులు చేయలేదు. సెల్టోస్‌లో మునుపటిలాగే 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 hp), 1.5-లీటర్ డీజిల్ (116 hp), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ (160 hp) మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో కూడా మార్పులు లేవు. పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, CVT, డీజిల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, టర్బో పెట్రోల్‌కు 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications