మార్కెట్లో కియా ప్రభంజనం.. ఒక్క నెలలోనే 12 వేల కార్లు.. కొత్తగా కొనేవారు మొత్తం ఈ కంపెనీ కార్లనే సెలక్ట్ చేస్త
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియా (Kia) తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ (Kia Sonet) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2026 మార్చి నెలలో కియా మోటార్స్ విడుదల చేసిన విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, సోనెట్ కారు అగ్రస్థానంలో నిలిచింది.
కేవలం ఒక్క నెలలోనే 12,012 మంది కొత్త కస్టమర్లు ఈ కారును తమ సొంతం చేసుకున్నారు. గత ఏడాది మార్చి నెలలో (2025) ఈ విక్రయాలు కేవలం 7,705 యూనిట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏకంగా 56 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఉండటమే ఈ కారు విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కియా విక్రయాల జాబితాలో సోనెట్ తర్వాత స్థానంలో కియా సెల్టోస్ (Kia Seltos) నిలిచింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గత నెలలో 11,041 యూనిట్ల విక్రయాలను సాధించింది. గత ఏడదితో పోలిస్తే సెల్టోస్ విక్రయాలు ఏకంగా 69 శాతం పెరగడం గమనార్హం. మూడో స్థానంలో ఉన్న కియా క్యారెన్స్ (Kia Carens) ఫ్యామిలీ ఎంపీవీ విభాగంలో 5,933 యూనిట్లతో నిలకడైన అమ్మకాలను నమోదు చేసింది.
అయితే కియా కార్నివాల్ విక్రయాలు మాత్రం 71 శాతం క్షీణించి కేవలం 67 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఇక కంపెనీ కొత్తగా తెచ్చిన కియా సైరోస్ (Syros) 59 యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మొత్తంగా చూస్తే కియా గత నెలలో 29,112 కార్లను అమ్మి 14 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు EV6, EV9 గత నెలలో ఒక్క యూనిట్ కూడా విక్రయం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి దశలో ఉండటం వల్ల కస్టమర్లు వీటి వైపు మొగ్గు చూపడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
కియా సోనెట్, సెల్టోస్ వంటి పెట్రోల్, డీజిల్ మోడళ్లు ఇస్తున్న మైలేజీ, పర్ఫార్మెన్స్ ముందు ఈ ఎలక్ట్రిక్ కార్లు వెనుకబడి ఉన్నాయి. అయినప్పటికీ, భవిష్యత్తులో ఈ విభాగంపై కియా తన పట్టును సాధించేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

కియా సోనెట్ ప్రధానంగా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. వేగం కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 120bhp పవర్, 172Nm టార్క్‌ను అందిస్తుంది. బడ్జెట్, మైలేజీని చూసుకునే వారి కోసం 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది (83bhp పవర్, 115Nm టార్క్). ఇక లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వారి కోసం పవర్ ఫుల్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116bhp పవర్, 250Nm టార్క్) ఆప్షన్ కూడా ఉంది. ఈ వైవిధ్యమైన ఇంజిన్ ఆప్షన్లే సోనెట్ ను మార్కెట్ లో రారాజుగా నిలబెట్టాయి.
కియా సోనెట్ ప్రారంభ ధర రూ.8.32 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై టాప్ మోడల్ కు వచ్చేసరికి రూ.14.17 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలో 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి విలాసవంతమైన ఫీచర్లు లభిస్తున్నాయి.
మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లకు సోనెట్ ఇప్పుడు గట్టి సవాల్ విసురుతోంది. ముఖ్యంగా కియా బ్రాండ్ పై ఉన్న నమ్మకం, వారి సర్వీస్ నెట్‌వర్క్ సోనెట్ ను నంబర్-1 స్థానంలో నిలబెట్టాయి.


Click it and Unblock the Notifications








