సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా హవా.. 5 లక్షల ఇళ్లకు చేరిన మిడిల్ క్లాస్ కారు

దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టి తన సత్తాను చాటుతోంది. ఆ కంపెనీ ప్రొడక్ట్ అయిన సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఈ విషయంలో కియా సోనెట్ ఓ భారీ రికార్డును క్రియేట్ చేసింది.

భారత ఆటో మార్కెట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నేటి వరకు కియా సోనెట్ ఏకంగా 5 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించినట్లు కంపెనీ నేడు (22 జనవరి 2026) అధికారికంగా ప్రకటించింది. కియా బ్రాండ్ పట్ల భారతీయ వినియోగదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని కంపెనీ హర్షం వ్యక్తం చేసింది.

కియా ఇండియాకు సోనెట్ ఒక వెన్నెముక లాంటిది. భారత మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సోనెట్ తనదైన ముద్ర వేసింది. తాజాగా 5 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం మీద కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్‌హక్ పార్క్ సంతోషం వ్యక్తం చేశారు.

Kia Sonet Creates History in India 5 Lakh Sales Milestone Achieved

"సోనెట్ కారు కొనుగోలు చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కియా బ్రాండ్‌పై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. మోడ్రన్ డిజైన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, నమ్మకమైన పర్ఫామెన్స్ వల్లే సోనెట్ ఇంతటి ఘన విజయాన్ని సాధించిదని ఆయన పేర్కొన్నారు.

ఈ కారు కేవలం పట్టణాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కూడా భారీ అమ్ముడవుతోంది. కియా ఇండియా మొత్తం విక్రయాల్లో సోనెట్ వాటానే దాదాపు 35 శాతంగా ఉంది. వరుసగా రెండేళ్ల పాటు ఏడాదికి లక్షకు పైగా యూనిట్లు అమ్ముడవడం సోనెట్ క్రేజ్ కు ఉన్న నిదర్శనం.

Kia Sonet Creates History in India 5 Lakh Sales Milestone Achieved

ముఖ్యంగా చెప్పాలంటే కియా మేక్ ఇన్ ఇండియా విజన్ కింద అనంతపురం ప్లాంటులో తయారైన ఈ కారు, భారతీయుల ఆకాంక్షలకు తగ్గట్లుగా ఉండడమే దీని విజయ రహస్యం. కియా సోనెట్ లో ఉన్న డిఫరెంట్ ఇంజిన్ ఆప్షన్లు, గేర్‌బాక్స్ ఆప్షన్లు కస్టమర్లకు గొప్ప వెసులుబాటును కల్పిస్తున్నాయి.

కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా సోనెట్ జెండా పాతేసింది. మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాలకు(మెక్సికో, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు) లక్షకు పైగా సోనెట్ కార్లను కియా కంపెనీ ఎగుమతి చేసింది.

Kia Sonet Creates History in India 5 Lakh Sales Milestone Achieved

ఇది భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీలో కియా ముందంజలో ఉండడం కూడా యువతను ఈ కారు వైపు ఆకర్షించేలా చేసింది.

ప్రస్తుతం కియా ఇండియా దేశవ్యాప్తంగా 369 నగరాల్లో 821 టచ్‌పాయింట్లతో విస్తరించింది. సోనెట్ తో పాటు సెల్టోస్, కారెన్స్, కార్నివాల్, ఎలక్ట్రిక్ వాహనాలైన EV6, EV9 వంటి మోడళ్లతో కియా భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక పవర్‌హౌస్‌లా ఎదిగింది. ఇప్పటివరకు కియా ఇండియా తన అనంతపురం ప్లాంట్ నుంచి మొత్తం 15 లక్షల వాహనాలను పంపించగా, అందులో 12 లక్షల విక్రయాలు దేశీయంగానే జరగడం విశేషం.

భారతీయ రోడ్లపై కియా సోనెట్ సృష్టించిన ఈ 5 లక్షల విక్రయాల ప్రభంజనం, ఆ బ్రాండ్ పట్ల కస్టమర్లకు ఉన్న తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్స్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సోనెట్ తన విజయయాత్రను ఇలాగే కొనసాగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, January 22, 2026, 14:15 [IST]
English summary
Kia sonet creates history in india 5 lakh sales milestone achieved
Read more on: #kia motors #kia sonet #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+