మధ్యతరగతి మనసు గెలిచిన కారు.. కస్టమర్లకు బాగా నచ్చింది.. కొనడానికి పోటీ!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ (Kia motors) భారత మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే సెల్టోస్, సోనెట్, కారెన్స్ క్లావిస్ వంటి మోడళ్లతో భారతీయ వినియోగదారుల మనసులు గెలుచుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు సిరోస్ (Syros) SUVతో కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది. ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, భద్రతా అంశాల కలయికతో రూపొందిన ఈ SUV మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల కియా 2026 మోడల్ సిరోస్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ SUVపై వినియోగదారుల ఆసక్తి మరింత పెరిగింది. కొత్త మోడల్‌లో అందించిన అప్‌డేట్స్, మెరుగైన ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్స్ కారణంగా షోరూమ్‌లకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

కొత్త వాహనం గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా, టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కూడా చాలా మంది కస్టమర్లు కియా డీలర్‌షిప్‌లను సందర్శిస్తున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా మే 2026 నెలలో కియా సిరోస్ అమ్మకాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. గత 31 రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 961 యూనిట్ల సిరోస్ SUVలను కంపెనీ విక్రయించింది.

Kia Syros Records 961 Unit Sales In May 2026 It Is 73 Percent Growth

భారత మార్కెట్లో SUVల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతున్నప్పటికీ, సిరోస్ తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకర్షించడంలో విజయవంతమవుతోంది. గత ఏడాది మే 2025లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే, మే 2026లో సిరోస్ విక్రయాలు 73.47 శాతం మేర పెరగడం విశేషం. ఇది కేవలం సంఖ్యల పరంగా వచ్చిన పెరుగుదల మాత్రమే కాదు, భారతీయ కస్టమర్లు ఈ SUVపై ఉంచుతున్న విశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.

కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలు సిరోస్‌ను ప్రాధాన్యంగా పరిశీలిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మార్కెట్లో కియా బ్రాండ్‌కు ఇప్పటికే ఉన్న బలమైన గుర్తింపు, డీలర్ నెట్‌వర్క్, అమ్మకాల అనంతర సేవలు, అలాగే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాహనాలను అందించే వ్యూహం సిరోస్ విజయానికి ప్రధాన కారణాలు. ఈ అమ్మకాల ఊపు కొనసాగితే రాబోయే నెలల్లో కియా సిరోస్ కంపెనీకి మరింత బలమైన సేల్స్‌ను అందించే మోడల్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kia Syros Records 961 Unit Sales In May 2026 It Is 73 Percent Growth

ఈ కాంపాక్ట్ SUV ప్రస్తుతం రూ. 8.39 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కియా సిరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, అలాగే 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. పనితీరు,మైలేజ్ సామర్థ్యంలో కూడా ఈ SUV బెస్ట్.

పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుండగా, DCT వేరియంట్ 17.68 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు డీజిల్ మాన్యువల్ మోడల్ 20.75 కిలోమీటర్ల మైలేజీ, డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ 17.65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. అయితే సిరోస్ కథ ఇక్కడితో ముగియడం లేదు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కియా ఇండియా ఇప్పుడు సిరోస్ EVను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Kia Syros Records 961 Unit Sales In May 2026 It Is 73 Percent Growth

రాబోయే సిరోస్ EV K1 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చెందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో ఇన్‌స్టర్ EV 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అందువల్ల భారత మార్కెట్‌కు వచ్చే సిరోస్ EVలో కూడా ఇలాంటి బ్యాటరీ కాన్ఫిగరేషన్లు లేదా వాటికి సమానమైన సెటప్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Article Published On: Tuesday, June 9, 2026, 10:35 [IST]
English summary
Kia syros records 961 unit sales in may 2026 it is 73 percent growth
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+