రిమోట్‌తో ఇంజిన్ స్టార్ట్.. ఏసీ కూడా ఆన్..కియా స్మార్ట్ ఫీచర్ల ముందు ఏదైనా జుజూబీ
భారతీయ వాహన రంగంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు కారు ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‌లా మారిపోయింది. ఈ మార్పును ముందుగానే పసిగట్టిన సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియా ఇండియా (Kia India), ఇప్పుడు ఒక భారీ మైలురాయిని చేరుకుంది. భారత రోడ్లపై ప్రస్తుతం కైయాకు చెందిన 5 లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లు పరుగులు తీస్తున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 40 శాతం వాటా ఈ స్మార్ట్ కార్లదే కావడం విశేషం.
సాధారణంగా ఏదైనా సర్వీస్ ఉచితంగా ఉన్నంత వరకే మనం ఉపయోగిస్తాం. కానీ కియా విషయంలో ఇది రివర్స్ అయింది. కారు కొన్నప్పుడు కంపెనీ ఇచ్చే ఉచిత కియా కనెక్ట్ సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిసిన తర్వాత కూడా, వేల మంది కస్టమర్లు సొంతంగా డబ్బులు చెల్లించి మరీ ఆ సేవలను రిన్యూవల్ చేసుకుంటున్నారు.

అంటే ఈ టెక్నాలజీ కేవలం ఆడంబరం కోసం కాకుండా, డ్రైవర్ల రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయిందని అర్థమవుతోంది. 'ఒక్కసారి ఈ ఫీచర్లకు అలవాటు పడితే, మళ్ళీ పాత కాలపు కార్ల వైపు చూడలేరు' అని కస్టమర్ల అభిప్రాయం.
కియా తన వాహనాల్లో ప్రవేశపెట్టిన కియా కనెక్ట్ 2.0లో కొన్ని వందల ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఆఫీసులో ఉండి లేదా ఇంట్లో ఉండి మీ ఫోన్ ద్వారానే కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేయొచ్చు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కారులోకి వెళ్లకముందే ఏసీ ఆన్ చేసి క్యాబిన్ చల్లబరుచుకోవచ్చు.

మీ కారు ఎక్కడుందో తెలుసుకోవడానికి లైవ్ ట్రాకింగ్, లిమిట్ దాటి వెళ్తే అలర్ట్ చేసే జియో ఫెన్సింగ్, కారు కండిషన్ ఎలా ఉందో చెప్పే వెహికల్ డయాగ్నస్టిక్స్ వంటివి ఇందులో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ 5 లక్షల మార్కును అందుకోవడంలో కియా పాపులర్ ఎస్‌యూవీ సెల్టోస్ (Seltos) సింహభాగం పోషించింది.
మొత్తం కనెక్టెడ్ కార్ల అమ్మకాల్లో 70 శాతం సెల్టోస్ వేరియంట్లే ఉండటం గమనార్హం. దీనితో పాటు సోనెట్ (Sonet), కారెన్స్ (Carens) మోడళ్లు కూడా టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, లోపల ఉండే అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వల్లే కైయా కార్లకు ఇంత డిమాండ్ పెరిగింది.

కియా ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఈ ఘనతపై స్పందిస్తూ.. "మేము కేవలం వాహనాలను మాత్రమే అమ్మడం లేదు, కస్టమర్లకు ఒక డిజిటల్ అనుభవాన్ని అందిస్తున్నాం" అని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల్లో మరిన్ని మెరుగైన ఫీచర్లు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
ముఖ్యంగా ఓవర్ ది ఎయిర్(OTA) అప్‌డేట్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్ లాగే కారు సాఫ్ట్‌వేర్‌ను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే వెసులుబాటు కైయా కార్లలో ఉంది. ఇండియన్ కస్టమర్ ఇప్పుడు కేవలం మైలేజీ మాత్రమే చూడటం లేదు, కారు తనతో ఎంత బాగా మాట్లాడుతుంది. ప్రయాణాన్ని ఎంత సుఖమయం చేస్తుంది అనేది కూడా లెక్కిస్తున్నాడు. ఆ విషయంలో కైయా సక్సెస్ అయిందని ఈ 5 లక్షల మైలురాయి నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications








