ఇదెక్కడి కొత్త కారు భయ్యా.. బయట చూస్తే ఒకలా, లోపల చూస్తే మరో లెవెల్! ఇంత స్టైల్ ఎక్కడ చూసాం?
జపాన్‌కు చెందిన ప్రీమియం ఆటోమొబైల్ బ్రాండ్ లెక్సస్ (Lexus) భారత మార్కెట్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తన దృష్టిని మరింతగా మళ్లిస్తూ, కొత్త తరం లెక్సస్ ఈఎస్ 500ఇ (Lexus ES 500e) మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు తొలిసారిగా 2025 ఏప్రిల్‌లో జరిగిన Shanghai Motor Show 2025లో ప్రపంచానికి పరిచయమై, ఇప్పుడు భారత మార్కెట్లో అడుగుపెట్టడం గమనార్హం. ఈసారి లెక్సస్ తీసుకున్న నిర్ణయం కొంచెం ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లలో అందించే సెడాన్‌ను ఈసారి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మొబిలిటీపై కంపెనీ పెట్టిన దృష్టిని స్పష్టంగా తెలియజేస్తోంది.
అంతేకాదు, ఈ కొత్త సెడాన్‌ను టయోటా క్యామ్రీలో ఉపయోగించిన TNGA-K ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయడం ద్వారా పనితీరు, స్టెబిలిటీ విషయంలో మంచి బ్యాలెన్స్‌ను అందించేలా చేశారు. లెక్సస్ ES సెడాన్ ఎనిమిదవ తరం మోడల్‌గా భారత మార్కెట్లోకి వచ్చి, తన మునుపటి వెర్షన్‌తో పోలిస్తే కొత్త రూపంతో ఆకట్టుకుంటోంది. డిజైన్ విషయానికి వస్తే, LF-ZC కాన్సెప్ట్‌లో మొదటిసారిగా చూపించిన Provocative Simplicity డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ కారును రూపొందించారు.

అంటే, సింపుల్‌గా కనిపించినా లోపల బలమైన డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిబింబించేలా ప్రతి లైన్, ప్రతి కర్వ్‌ను తీర్చిదిద్దారు. ఫ్యూచరిస్టిక్ లుక్, స్మూత్ సర్ఫేస్‌లు, మరియు ప్రీమియం ఫినిష్ కలిసి ఈ కారును రోడ్డు మీద ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్‌ను భారత మార్కెట్లో రూ. 89.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయడం ద్వారా ఇది ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది.
ధర ఎక్కువైనా, అందులో ఇచ్చే లగ్జరీ, టెక్నాలజీ, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కలిపి ఒక ఫ్యూచర్-రెడీ ప్యాకేజ్‌గా నిలుస్తోంది. టయోటా లైనప్‌లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రస్థానం ప్రారంభమై ఉండగా, ఇప్పుడు ఈ లెక్సస్ ES EV చేరడం ఆ దిశలో మరొక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. ఇది డిజైన్ పరంగా ముందు భాగంలో ఇప్పటివరకు లెక్సస్ కార్లకు గుర్తుగా ఉన్న స్పిండిల్ గ్రిల్‌ను తొలగించడం ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.

దాని స్థానంలో మినిమలిస్టిక్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందించేలా ఫ్రంట్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. అయితే బ్రాండ్ ఐడెంటిటీని మాత్రం కోల్పోకుండా, డేటైమ్ రన్నింగ్ లైట్స్‌లో కనిపించే 'ట్విన్ L-సిగ్నేచర్' ల్యాంప్‌లు ముందు భాగానికి ఒక ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. గ్రిల్‌కు ఇరువైపులా నలుపు రంగు ఎలిమెంట్స్‌తో పాటు LED హెడ్‌లైట్లు అమర్చడం వల్ల కారు మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో స్టైల్, సింప్లిసిటీ రెండింటినీ కలిపిన డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.
ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కారుకు ప్రీమియం టచ్‌ను ఇస్తే, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ దాని స్టాన్స్‌ను మరింత బలంగా చూపిస్తాయి. వెనుక భాగంలో ట్విన్ L-సిగ్నేచర్ ల్యాంప్స్‌తో పాటు వాటిని కలిపే LED లైట్ బార్ కారు వెనుక భాగానికి ఒక డైనమిక్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తుంది. డెక్‌లిడ్ స్పాయిలర్ తరహా డిజైన్ ఎలిమెంట్ కారుకు స్పోర్టీ ఫీల్‌ను జోడించి, మొత్తం డిజైన్‌ను పూర్తి చేస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌కు తగ్గట్టే అత్యంత ప్రీమియంగా రూపొందించబడింది. లోపల 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే డ్రైవర్‌కు పూర్తిగా డిజిటల్ అనుభవాన్ని అందిస్తాయి. అదనంగా Mark Levinson ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉండటం వల్ల మ్యూజిక్ అనుభవం మరింత లగ్జరీగా మారుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు రోజువారీ వినియోగాన్ని సులభతరం చేస్తాయి.
కారులో 74.69kWH బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 343 bhp శక్తిని ఉత్పత్తి చేసే డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో పనిచేస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 580 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని లెక్సస్ పేర్కొంది. ఇది 5.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. EV కోసం 11kWh AC హోమ్ ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. 8 సంవత్సరాలు లేదా 2,00,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications








