మాడు పగిలే ఎండల్లో కూడా ఈ కారు లోపల ఉంటే కశ్మీర్ లో ఉన్నట్లే.. బడ్జెట్ ధరలో బెస్ట్ వెంటిలేటెడ్ సీట్ కార్లుమాడు
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. కారులో ఏసీ ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత వల్ల సీట్లు వేడెక్కి ఒంటికి చెమటలు పట్టడం సహజం. ఇలాంటి సమయంలో మనల్ని చల్లగా ఉంచే అద్భుతమైన ఫీచరే వెంట్రిలేటెడ్ సీట్లు (Ventilated Seats). ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ సౌకర్యం, ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్న రెండు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer):
టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో కొత్తగా రేసర్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వేగానికి మాత్రమే కాదు, సౌకర్యానికి కూడా మారుపేరుగా నిలుస్తోంది. సాధారణ ఆల్ట్రోజ్ కంటే ఇది కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ, ఇందులో ఇచ్చే ఫీచర్లు మాత్రం అద్భుతం. ముఖ్యంగా ఈ కారులోని ఆర్3 (R3) టాప్ వేరియంట్‌లో వెంట్రిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అందించారు.

ఈ సీట్లు మూడు రకాల కూలింగ్ మోడ్స్‌తో వస్తాయి, అంటే మీ అవసరానికి తగ్గట్టుగా చల్లదనాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సీట్ల పక్కనే ఉండే బటన్ల ద్వారా దీనిని ఆపరేట్ చేయవచ్చు. ఆల్ట్రోజ్ రేసర్ ఆర్3 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 120 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగంతో పాటు చల్లదనాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):
టాటా ఆల్ట్రోజ్‌కు గట్టి పోటీనిచ్చే కారు హ్యుందాయ్ ఐ20. హ్యుందాయ్ కంపెనీ తన ఐ20 మోడల్‌లో ప్రీమియం ఫీచర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఐ20 లోని అస్టా ఆప్షనల్ (Asta (O)), అస్టా ఆప్షనల్ నైట్ ఎడిషన్ వేరియంట్లలో వెంట్రిలేటెడ్ సీట్లను పొందవచ్చు. ఈ వేరియంట్ల ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.11.53 లక్షల వరకు ఉన్నాయి.

కేవలం చల్లని సీట్లు మాత్రమే కాదు, ఇందులో 7-స్పీకర్ల బోస్ (Bose) సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే చల్లని సీటులో కూర్చుని, అదిరిపోయే మ్యూజిక్ వింటూ లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది, ఇది 82 బిహెచ్‌పి పవర్‌ను ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఐ20 చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
వెంట్రిలేటెడ్ సీట్లు ఎందుకు ముఖ్యమంటే?
చాలామంది ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు. కానీ ఏసీ గాలి మన ముఖం మీద, శరీరం మీద పడుతుంది కానీ, మన వెన్నుభాగానికి తగలదు. దీనివల్ల లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు చొక్కా చెమటతో తడిసిపోతుంది. వెంట్రిలేటెడ్ సీట్లు ఉన్న కార్లలో సీటు లోపలి నుంచి చల్లని గాలి వస్తుంది, దీనివల్ల మన శరీరం ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటుంది. వేసవిలోనే కాదు, వర్షాకాలంలో సీట్లు మెత్తగా, పొడిగా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ముందు సీట్లకు మాత్రమే అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








