మహీంద్రాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే.. 4 నెలల్లోనే 20 వేల ఇళ్లలోకి ఎంట్రీ! కొత్త ట్రెండ్ సెట్టర్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరోసారి తన సత్తా చాటుకుంది. భారతీయ వినియోగదారుల అభిరుచిని అర్థం చేసుకుని, వారి అవసరాలకు తగ్గట్లుగా వాహనాలను రూపొందించే కంపెనీగా మహీంద్రా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అదే కారణంగా, ఈ బ్రాండ్‌కు చెందిన SUVలను సొంతం చేసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. బొలెరో వంటి బలమైన గ్రామీణ వాహనం నుంచి ఆధునిక ఫీచర్లతో కూడిన Mahindra XUV700 వరకు విస్తరించిన మోడల్ లైనప్‌ను చూస్తే, ప్రతి వర్గానికి సరిపోయే వాహనం అందుబాటులో ఉందనే భావన కలుగుతుంది.

ఇటీవల కంపెనీ Mahindra XUV700కు కొత్త వెర్షన్‌ను పరిచయం చేసి మార్కెట్‌ను మరోసారి ఆశ్చర్యానికి గురి చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే పలు ముఖ్యమైన మార్పులు, మెరుగైన టెక్నాలజీ, అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఈ ఫ్యామిలీ SUVకు మంచి స్పందన లభించింది. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ, ఈ మోడల్‌కు వారసురాలిగా వచ్చిన ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ (XUV 7XO) కూడా విడుదలైన వెంటనే భారీ డిమాండ్‌ను సృష్టించింది.

Mahindra 7xo Suv Strong Demand 20000 Units Delivered In India More Details

ప్రారంభం నుంచే అద్భుతమైన స్పందనను అందుకున్న ఈ 7-సీటర్ SUV, మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే కీలక మైలురాయిని అందుకుంది. మహీంద్రా ప్రకటించిన వివరాల ప్రకారం, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఇప్పటికే 20,000 యూనిట్ల డెలివరీలను పూర్తి చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విజయాన్ని వాహనం జనవరిలో విడుదలైన నాలుగు నెలల వ్యవధిలోనే సాధించడం. ఈ వేగాన్ని చూస్తే, రాబోయే రోజుల్లో ఇది తన ఆధిపత్యాన్ని మరింత బలపరచడం ఖాయం.

మహీంద్రా ఫ్లాగ్‌షిప్ SUVగా నిలిచిన ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ, AX, AX3, AX5, AX7, AX7T, AX7L వంటి వేరియంట్లలో అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు విస్తృత ఎంపికలను అందిస్తోంది. ధర విషయానికి వస్తే, ఈ ప్రీమియం SUV రూ. 13.66 లక్షల నుండి ఉంటుంది. డిజైన్ పరంగా కొత్త XUV 7XO పూర్తిగా రిఫ్రెష్ అయిన ఫీల్‌ను ఇస్తుంది. బయటకు చూస్తేనే ఇది ఒక మోడ్రన్, అగ్రెసివ్ SUV అని అర్థమవుతుంది.

Mahindra 7xo Suv Strong Demand 20000 Units Delivered In India More Details

ఫుల్-విడ్త్ పియానో బ్లాక్ గ్రిల్ దీనికి ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తే, LED DRLలతో కూడిన బై-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు నైట్ డ్రైవ్‌లో స్పష్టమైన విజిబిలిటీని అందిస్తాయి. వెనుక భాగంలో డైమండ్ ప్రేరిత క్లియర్ లెన్స్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఈ SUVకి ప్రీమియం టచ్‌ను జోడిస్తాయి. 19-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బలమైన బ్లాక్ క్లాడింగ్, ఎలక్ట్రిక్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి అంశాలు దీని స్టైల్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి.

అదనంగా, ఎక్స్‌పోజ్డ్ ఐస్-క్యూబ్ ఫాగ్ ల్యాంప్‌లు SUVకు ఒక యూనిక్ విజువల్ ఐడెంటిటీని అందిస్తున్నాయి. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎక్కడా తగ్గదు. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తోంది. ఈ రెండు ఇంజిన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో, డీజిల్ వేరియంట్‌లో ఆప్షనల్ AWD సిస్టమ్ ఇవ్వడం ఆఫ్-రోడ్ ప్రియులకు పెద్ద ఆకర్షణగా మారింది.

Mahindra 7xo Suv Strong Demand 20000 Units Delivered In India More Details

టాప్ వేరియంట్లలో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ SUVలో వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, కో-డ్రైవర్ సీట్‌కు బాస్ మోడ్ పవర్ అడ్జస్ట్‌మెంట్, రియర్ సన్‌షేడ్స్, అకౌస్టిక్ సోలార్ విండ్‌స్క్రీన్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌, టెక్నాలజీ పరంగా చూస్తే, అడ్రినాక్స్ ప్లస్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto సపోర్ట్ ఉన్నాయి. అదనంగా, అలెక్సాతో పాటు చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్ ఇవ్వడం దీన్ని మరింత స్మార్ట్‌గా మార్చింది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 7, 2026, 10:51 [IST]
English summary
Mahindra 7xo suv strong demand 20000 units delivered in india more details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+