పెద్ద కుటుంబాలు ఈ కారే ఎక్కువగా కొంటున్నారు.. 9 మంది ఒకేసారి వెళ్లొచ్చు, సేల్స్‌లో భారీ వృద్ధి!

భారత మార్కెట్లో మహీంద్రా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలక అనువుగా ఉండే మహీంద్రా బొలెరో (Mahindra Bolero) అంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో చాలా మంది కొంటుంటారు. ఇదోక ఎస్‌యూవీ. బలమైన బాడీ నిర్మాణంతో ఆకట్టుకుంటుంది. చాలా సంవత్సరాలు గా మార్కెట్లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. బొలెరో గత నెలలో కూడా అమ్మకాల పరంగా తన సత్తా ఎలా ఉందో తెలియజేసింది. 2026, జూన్ నెలలో ఈ కారును 9,115 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం బలమైన వృద్ధిని సాధించింది.

2025 జూన్ నెలలో ఈ కారును 7,478 మంది కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఏడాదిలోనే బొలెరో మెరుగైన అమ్మకాలను నమోదు చేసి, మహీంద్రా కంపెనికి బలమైన ఎస్‌యవీగా నిలుస్తుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే నెల వారీగా కూడా చూసిన మహీంద్రా బొలెరో 2 శాతం వృద్ధిన నమోదు చేసింది. 2026 మే నెలలో ఈ కారును దాదాపుగా 8,933 మంది కొనుగోలు చేయడం విశేషం.

Mahindra Bolero June 2026 Sales 22 Percent Growth Details

చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ SUVకు ఉన్న డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది గ్రామాల్లో ఉండే కఠినమైన రోడ్లపై కూడా సులభంగా, లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుంగా సౌకర్యంగా ప్రయాణించడం, అలాగే, కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే, లేదా, ఆఫీసర్లకు సంబంధించిన ప్రయాణాలకు ఇది అత్యంత కంఫర్ట్ కలిగిన, నమ్మకమైన కారుగా ప్రసిద్ధి చెందింది.

ప్రస్తుతం మహీంద్రా బొలెరో మార్కెట్లో మూడు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్, ప్రయాణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ బొలెరో, బొలెరో నియో, బొలెరో నియో ప్లస్ పేర్లతో ఈ ఎస్‌యూవీలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, వ్యక్తిగత వినియోగం నుంచి ఇతర అవసరాల వరకు ఈ మూడు మోడళ్లకు మంచి ఆదరణ ఉంది.

Mahindra Bolero June 2026 Sales 22 Percent Growth Details

మొదట మహీంద్రా బొలెరో ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.9.80 లక్షల వరకు ఉంటుంది. ఇది 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. బలమైన బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు, అన్ని రకాల రోడ్లపై నమ్మకమైన పనితీరు కారణంగా ఈ మోడల్ రెండు దశాబ్దాలుగా భారతీయ కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ శాఖలు, టాక్సీ ఆపరేటర్లలో ఈ వాహనానికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.

మరింత ఆధునిక లుక్, మెరుగైన కంఫర్ట్ కోరుకునే వారి కోసం బొలెరో నియో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.8.69 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ మోడల్ కూడా 7-సీటర్ రూపంలో లభిస్తుంది. సాధారణ బొలెరోతో పోలిస్తే మంచి డిజైన్, ఆధునిక ఇంటీరియర్, మెరుగైన ఫీచర్లు, నగర రోడ్లు, హైవేలపై మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా దీన్ని రూపొందించారు.

Mahindra Bolero June 2026 Sales 22 Percent Growth Details

పెద్ద కుటుంబాలు, ట్రావెల్ ఆపరేటర్లు, కమర్షియల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బొలెరో నియో ప్లస్ అభివృద్ధి చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.90 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్ 9-సీటర్లో లభించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం, విశాలమైన క్యాబిన్, బలమైన నిర్మాణం కారణంగా బొలెరో నియో ప్లస్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.

Article Published On: Friday, July 17, 2026, 16:35 [IST]
English summary
Mahindra bolero june 2026 sales 22 percent growth details
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+