9 మందికి ఈ ఒక్కకారు చాలు.. ఇప్పుడు ఎక్కువగా ఇదే కొంటున్నారు! గ్రామాలు, పట్టణ రోడ్లపై స్మూత్‌గా వెళ్తుంది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గ్రామీణ రోడ్ల నుంచి చిన్న పట్టణాల వరకు తనదైన ముద్ర వేసుకున్న SUVలలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. దశాబ్దాలుగా మార్కెట్లో కొనసాగుతున్న ఈ మోడల్, గ్లామర్ కంటే గట్టి పనితీరు, నమ్మకాన్ని ప్రాధాన్యంగా చూసే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్లపై కూడా సులభంగా నడిచే సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు, మెకానికల్ సింప్లిసిటీ బొలెరోను ఒక "నమ్మకమైన భాగస్వామి"గా నిలబెట్టాయి. ఈ విశ్వాసమే ఇప్పుడు అమ్మకాల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో బొలెరో 9,788 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 8,031 యూనిట్లుగా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 22 శాతం వృద్ధి సాధించడం నిజంగా గమనార్హం.

మార్కెట్లో పోటీ పెరుగుతున్నప్పటికీ, ఈ స్థాయి గ్రోత్ సాధించడం బొలెరోకు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. అయితే నెలవారీగా చూసినట్లయితే మాత్రం బొలెరో కాస్త తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2026లో ఈ SUV మొత్తం 9,863 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ లెక్కన నెలవారీగా చూసినట్లయితే అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గుదలను నమోదు చేసింది. అయినప్పటికి దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Mahindra Bolero March 2026 Sales Recorded 22 Percent Growth Compared To Previous

ఈ ఐకానిక్ మోడల్, కాలానికి అనుగుణంగా మారుతూ ముందుకు సాగుతోంది. అమ్మకాలలో కనిపిస్తున్న వృద్ధి, బొలెరోపై వినియోగదారుల నమ్మకం ఇంకా ఎంత బలంగా ఉందో చెప్పే మరో నిదర్శనం. మహీంద్రా బొలెరో ప్రస్తుతం భారత మార్కెట్లో వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. గ్రామీణ రోడ్లు, కుటుంబ ప్రయాణాలు, అలాగే వాణిజ్య వినియోగం ఈ అవసరాలకు సరిపడేలా కంపెనీ ఈ SUVను మూడు ప్రధాన వెర్షన్లలో అందిస్తోంది.

ఈ విధంగా ప్రతి కస్టమర్‌కు తగిన ఎంపిక ఇవ్వడం బొలెరో సక్సెస్‌కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ లైనప్‌లో ముఖ్యంగా సాధారణ బొలెరో మోడల్ అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్‌గా నిలిచింది. గట్టి నిర్మాణం, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఇది చాలా మంది వినియోగదారులకు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ధర విషయంలో కూడా ఇది అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్.

Mahindra Bolero March 2026 Sales Recorded 22 Percent Growth Compared To Previous

ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు సుమారు రూ.9.80 లక్షల వరకు ఉంటుంది. సీటింగ్ పరంగా చూస్తే, ఇది 7-సీటర్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. అంటే కుటుంబంతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి కూడా ఇది సరైన ఆప్షన్. Mahindra Bolero లైనప్‌లో మరో ముఖ్యమైన మోడల్ బొలెరో నియో (Bolero Neo).

ఇది సాధారణ బొలెరోతో పోలిస్తే కొంచెం ఆధునిక డిజైన్, మెరుగైన ఫీచర్లతో వస్తుంది. అర్బన్ లుక్‌తో పాటు, మంచి కంఫర్ట్ ఇవ్వడం ఈ మోడల్ ప్రత్యేకత. ధర పరంగా చూస్తే, ఇది సుమారు రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ.10.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉండటం వల్ల, కుటుంబ వినియోగానికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

Mahindra Bolero March 2026 Sales Recorded 22 Percent Growth Compared To Previous

ఈ సీరిస్‌లో మరింత పెద్దదైన, ఉపయోగకరమైన వెర్షన్ బొలెరో నియో ప్లస్ (Bolero Neo Plus). ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ధర సుమారు రూ.10.90 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 9-సీటర్ ఎంపికతో లభించడం ప్రధాన ప్రత్యేకత. అదనంగా, ఇదే మోడల్ 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అంబులెన్స్ వాహనంగా కూడా అందుబాటులో ఉండటం ఆసక్తికర విషయం.

More from DriveSpark

Article Published On: Wednesday, April 8, 2026, 14:13 [IST]
English summary
Mahindra bolero march 2026 sales recorded 22 percent growth compared to previous
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+