సేల్స్‌లో సునామీ సృష్టించిన ఆనంద్ మహీంద్రా కంపెనీ.. SUVలతో సింహంలా దూసుకుపోయింది!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరోసారి తన అమ్మకాలతో మార్కెట్లో దూసుకుపోతూ శక్తివంతమైన ప్రదర్శనను కనబరిచింది. మార్చి నెల ముగిసిన వెంటనే కంపెనీ విడుదల చేసిన సేల్స్ గణాంకాలు, దాని వృద్ధి వేగాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న డిమాండ్, ఇప్పుడు మరింత బలంగా మారిందని ఈ తాజా గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2026లో మహీంద్రా దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కలిపి మొత్తం 99,969 యూనిట్ల వాహనాలను రవాణా చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ స్థాయి పెరుగుదల, కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకం ఎంతగానో పెరిగిందని తెలియజేస్తోంది.

ఈ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించింది యుటిలిటీ వెహికల్(SUV) విభాగం. భారత మార్కెట్లో SUVలకు ఉన్న భారీ డిమాండ్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ, కంపెనీ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. దేశీయంగా SUV అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగి 60,272 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. ఎగుమతులను కలిపితే, మొత్తం యుటిలిటీ వెహికల్ అమ్మకాలు 62,109 యూనిట్లకు చేరడం, ఈ సెగ్మెంట్‌లో కంపెనీ బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

Mahindra March 2026 Sales Report Details Inside Check Here

ఇక వాణిజ్య వాహనాల విభాగం కూడా ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది. సాధారణంగా ఈ సెగ్మెంట్ స్థిరమైన వృద్ధిని చూపుతుంటుంది. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మార్చి నెలలో కంపెనీ 24,928 యూనిట్ల కమర్షియల్ వాహనాలను దేశీయంగా విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధిని నమోదు చేయడం, ఈ విభాగం కూడా కంపెనీకి స్థిరమైన ఆదాయ వనరుగా కొనసాగుతున్నదని సూచిస్తోంది.

ఈ పెరుగుదల, మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయని సూచిస్తోంది. ఈ విభాగంలో సెగ్మెంట్ వారీగా చూసుకుంటే, 2 టన్నుల లోపు లైట్ కమర్షియల్ వాహనాలు(LCV

Mahindra March 2026 Sales Report Details Inside Check Here

ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు 13 శాతం పెరిగి 21,402 యూనిట్లకు చేరుకోవడం, సరుకు రవాణా అవసరాలు పెరుగుతున్నాయని తెలియజేస్తోంది. ఇక త్రీ-వీలర్ సెగ్మెంట్ విషయానికి వస్తే, మరింత బలమైన ప్రదర్శన కనబరిచింది. మార్చిలో ఈ విభాగంలో అమ్మకాలు 39 శాతం పెరిగి 10,801 యూనిట్లకు చేరుకోవడం విశేషం. ముఖ్యంగా నగరాలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి త్రీ-వీలర్లు కీలకంగా మారడంతో, ఈ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి, కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలతో కొత్త మైలురాయిని చేరుకుంది. మొత్తం 6,60,276 ఎస్‌యూవీలు, 3.5 టన్నుల లోపు లైట్ కమర్షియల్ వాహనాలు (LCVs) 2,89,597 యూనిట్లు విక్రయిస్తూ, కంపెనీ ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యధిక అమ్మకాల వాల్యూమ్‌ను నమోదు చేసింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 20 శాతం(YoY) వృద్ధి, LCV (

Mahindra March 2026 Sales Report Details Inside Check Here

మొత్తంగా చూస్తే, మహీంద్రా కంపెనీ ప్యాసింజర్ వాహన విభాగం అలాగే వాణిజ్య వాహనాల విభాగంలో కూడా మెరుగైన అమ్మకాల గణంకాలను నమోదు చేసింది. ఇది కంపెనీ మొత్తం వృద్ధికి బలమైన మద్దతు అందిస్తోంది. చిన్న వాహనాల నుంచి మధ్యస్థ సెగ్మెంట్ల వరకు, అలాగే త్రీ-వీలర్ కేటగిరీలోనూ పెరుగుతున్న డిమాండ్ కంపెనీని మరింత బలమైన స్థానంలో నిలబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 1, 2026, 15:01 [IST]
English summary
Mahindra march 2026 sales report details inside check here
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+