భార్య, పిల్లలు, సామాన్లు.. అన్నీ ఒక్కసారే ఎక్కించేయొచ్చు..భారత రోడ్లపై మహీంద్రా విశ్వరూపం

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో-ఎన్(Scorpio-N) ఆధారంగా రూపొందిస్తున్న సరికొత్త పికప్ ట్రక్కును భారత మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శితమైన ఈ వాహనం, ఇప్పుడు భారత రోడ్లపై మంచు కురుస్తున్న వేళ కఠినమైన పరీక్షలను (Snow Testing) ఎదుర్కొంటోంది.

మహీంద్రా తన గ్లోబల్ పికప్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పై ఫోటోల ప్రకారం, ఈ పికప్ ట్రక్కును మంచుతో నిండిన రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఇది కేవలం కమర్షియల్ వాహనంలా కాకుండా ఒక లైఫ్ స్టైల్ వాహనంగా రూపొందుతోంది.

Mahindra s Game Changer Scorpio-N Based Global Pik Up Spotted Testing in Snow

ముందు భాగం స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని పోలి ఉన్నప్పటికీ, ఇది మరింత రగ్గడ్ లుక్ కలిగి ఉంది. ఇందులో నిలువుగా ఉండే ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, పెద్ద గ్రిల్ మరియు మజిల్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. ఇది సింగిల్ క్యాబ్, డ్యూయల్ క్యాబ్ అనే రెండు ఆప్షన్లలో రానుంది. ఫ్యామిలీతో ప్రయాణించాలనుకునే వారికి డ్యూయల్ క్యాబ్ వెర్షన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

సాధారణంగా పికప్ ట్రక్కులలో విలాసవంతమైన ఫీచర్లు ఉండవనే అభిప్రాయాన్ని మహీంద్రా తుడిచిపెట్టేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఇందులో 12 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. 5G కనెక్టివిటీ, సన్‌రూఫ్, సెమీ-ఆటోమేటిక్ పార్కింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండనున్నాయి.

Mahindra s Game Changer Scorpio-N Based Global Pik Up Spotted Testing in Snow

ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) తో పాటు ట్రైలర్ స్వే మిటిగేషన్ (Trailer Sway Mitigation) వంటి ఫీచర్లు రాబోతున్నాయి. అంటే లోడ్ వేసుకుని వెళ్తున్నప్పుడు వాహనం అదుపు తప్పకుండా ఈ సిస్టమ్ చూసుకుంటుంది.

మహీంద్రా తన నమ్మకమైన 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌ను ఈ పికప్ ట్రక్కులో ఉపయోగించబోతోంది. ఇది సుమారు 172 bhp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

Mahindra s Game Changer Scorpio-N Based Global Pik Up Spotted Testing in Snow

ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం మహీంద్రా ప్రసిద్ధ 4Xplore ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇందులో ఉండనుంది. గడ్డి, కంకర, మంచు, బురద, ఇసుక వంటి వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా ఇందులో డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

మహీంద్రా గ్రూప్ తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్, ట్రాక్టర్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ.15,000 కోట్లను కేటాయించింది. 1500 ఎకరాల్లో విస్తరించనున్న ఈ ప్లాంట్ 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏడాదికి 5 లక్షల వాహనాలను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ మహీంద్రా భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలు, నెక్స్ట్ జనరేషన్ ఎస్‌యూవీల తయారీకి కేంద్ర బిందువుగా మారబోతోంది.

భారత మార్కెట్లో టయోటా హిలక్స్ (Toyota Hilux) ధర సుమారు 35-40 లక్షల వరకు ఉండగా, ఇసుజు వి-క్రాస్ (Isuzu V-Cross) ధర 25-30 లక్షల మధ్యలో ఉంది. మహీంద్రా తన గ్లోబల్ పికప్‌ను రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే కంపెనీగా మహీంద్రా మళ్ళీ రికార్డు సృష్టిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 10, 2026, 14:10 [IST]
English summary
Mahindra s game changer scorpio n based global pik up spotted testing in snow
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+