లగ్జరీ కార్లు కుళ్లుకునే విధంగా మేకప్ వేసుకుని వస్తున్న మహీంద్రా స్కార్పియో.. అదిరిపోయే 5 అప్‌డేట్స్ ఇవే

కారు అనేది చాలా మందికి కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. అది ఒక స్టేటస్, ఒక ఫ్యామిలీ మెమరీ. ముఖ్యంగా Mahindra Scorpio N లాంటి SUV అయితే ఆ అనుభూతి ఇంకాస్త స్పెషల్. ఇంట్లో కొత్త స్కార్పియో వస్తే గేటు దగ్గరే పక్కింటి వాళ్లు చూసేంత క్రేజ్... ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్స్, ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ ఇలా అన్ని కలగలిపిన ఒక ఎమోషన్. అలాంటి ఒక ఐకానిక్ SUV ఇప్పుడు కొత్త లుక్, కొత్త టెక్నాలజీతో మళ్లీ రావడానికి సిద్ధమవుతుంది. పాత జ్ఞాపకాలను అలాగే ఉంచుతూ... కొత్త ఫీల్ ఇచ్చేలా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ రాబోతుందన్న వార్త ఇప్పుడు ఆటో లవర్స్‌లో ఎక్స్‌సైట్మెంట్ పెంచుతోంది.

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అంటేనే ఒక పవర్ఫుల్ బ్రాండ్. అందులోనూ స్కార్పియో అనే పేరు వింటే చాలు, ఎస్‌యూవీ లవర్స్ ఒళ్లు పులకరిస్తుంది. మార్కెట్లోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్న ఇప్పటికీ స్కార్పియో ఎన్ కోసం నెలల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉందంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాపులారిటీని మరో స్థాయికి తీసుకెళ్తూ, మహీంద్రా సంస్థ స్కార్పియో-ఎన్ మోడల్‌ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ త్రైమాసికం చివరలో అంటే జూన్ లేదా జూలై నాటికి ఈ కొత్త బాహుబలి రోడ్లపైకి రాబోతోంది.

Mahindra Scorpio-N Facelift 2026 5 Major Upgrades Expected Launch Date Revealed

స్టైలిష్ లుక్.. అదిరిపోయే డిజైన్
కొత్త స్కార్పియో-ఎన్ ఎక్సటర్నల్లో కంపెనీ కీలక మార్పులు చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే, ఇది మరింత మజిల్ బాడీతో కనిపిస్తుంది. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, రీ-వర్క్ చేసిన బంపర్ వాహనానికి రాయల్ లుక్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ లోపల ఎల్‌ఈడీ అమరికను మార్చడం వల్ల రాత్రి పూట ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారు ఎత్తును, గంభీరత్వాన్ని మరింత పెంచుతున్నాయి.

ప్రీమియం ఇంటీరియర్
కారు లోపల అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ కార్లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. మహీంద్రా ఈసారి డాష్‌బోర్డ్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు మనకు నిలువుగా ఉన్న ఏసీ వెంట్లు కనిపించేవి, కానీ కొత్త మోడల్‌లో ఇవి అడ్డంగా (Horizontal) మారుతున్నాయి. దీనివల్ల క్యాబిన్ చాలా వెడల్పుగా, రిచ్‌గా కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వాడకం వల్ల లోపల ప్రీమియం ఫీల్ పెరుగుతుంది. ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఇది ఒక అద్భుతమైన అనుభవం కానుంది.

పెద్ద టచ్‌స్క్రీన్..
నేటి తరం కుర్రాళ్లకు కావాల్సిన హై-టెక్ ఫీచర్లను మహీంద్రా పుష్కలంగా జోడించింది. పాత మోడల్‌లో డాష్‌బోర్డ్‌లో ఇమిడిపోయి ఉండే చిన్న స్క్రీన్ బదులు, ఇప్పుడు 10.25 అంగుళాల భారీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ రాబోతోంది. ఇది చూడటానికి ఒక ప్రీమియం టాబ్లెట్‌లా ఉండి, వాహనంలోని అన్ని ఫీచర్లను ఈజీగా కంట్రోల్ చేసేలా ఉంటుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు మరింత వేగంగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు.

Mahindra Scorpio-N Facelift 2026 5 Major Upgrades Expected Launch Date Revealed

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
డ్రైవర్ సీటులో కూర్చున్న వారికి మునుపటి కంటే మెరుగైన డిజిటల్ ఎక్స్‎పీరియన్స్ కలగనుంది. అనలాగ్ డయల్స్‌కు స్వస్తి పలుకుతూ, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మహీంద్రా పరిచయం చేస్తోంది. ఇందులో నావిగేషన్ నుంచి టైర్ ప్రెజర్ వరకు ప్రతి చిన్న విషయాన్ని కంటికి స్పష్టంగా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ మోడ్‌ను బట్టి ఈ స్క్రీన్ రంగులు కూడా మారుతూ ఉండటం మరో విశేషం.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు
లుక్స్‌లో ఎంత మార్పు వచ్చినా, స్కార్పియో అసలు సిసలు బలం దాని ఇంజన్. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా మహీంద్రా తన పవర్‌ఫుల్ ఇంజన్లను కొనసాగిస్తోంది. 200 bhp పవర్‌ను ఇచ్చే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేగాన్ని ఇష్టపడే వారికి కేరాఫ్ అడ్రస్. ఇక డీజిల్ వేరియంట్లలో 130 bhp, 172 bhp సామర్థ్యం గల 2.2 లీటర్ ఇంజన్లు అందుబాటులో ఉంటాయి. సిటీ రోడ్ల మీదైనా, కొండ కోనల్లో ఆఫ్-రోడింగ్ చేయడానికైనా ఈ ఇంజన్లు తిరుగులేని పనితీరును కనబరుస్తాయి.

మొత్తానికి మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ కేవలం ఒక అప్‌డేట్ మాత్రమే కాదు, ఇది ఎస్‌యూవీ రంగంలో ఒక కొత్త సంచలనం కాబోతోంది. అదిరిపోయే లుక్స్, అధునాతన టెక్నాలజీ, పవర్‌ఫుల్ ఇంజన్ కలయికతో వస్తున్న ఈ కారు కోసం ఆటోమొబైల్ మార్కెట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Article Published On: Monday, April 27, 2026, 7:10 [IST]
English summary
Mahindra scorpio n facelift 2026 5 major upgrades expected launch date revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+