మహీంద్రా మాస్టర్ ప్లాన్..బడ్జెట్ లోనే లగ్జరీ..కొత్త కారు చూస్తే పాత కారు అమ్మేయాలనిపిస్తుంది

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV స్కార్పియో N(Scorpio N)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్ వంటి హేమాహేమీలకు పోటీగా, మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు, సెక్యూరిటీ అప్‎డేట్స్‎తో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్(Scorpio N Facelift) రాబోతోంది. 2026 నాటికి భారత రోడ్లపై సందడి చేయనున్న ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి.

మహీంద్రా స్కార్పియో N ఇప్పటికే తన గంభీరమైన లుక్‌తో బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీస్‎గా పేరు తెచ్చుకుంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఈ లుక్ మరింత మెరుగుపడనుంది. కారు ముందు భాగంలో కొత్త రకమైన హారిజంటల్ స్లాట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, 18-అంగుళాల సరికొత్త అలాయ్ వీల్స్‌తో ఇది మునుపటి కంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్స్‎లో కూడా సరికొత్త సిగ్నేచర్ స్టైల్ మార్పులు ఉండబోతున్నాయి.

Mahindra Scorpio N Facelift 2026 Panoramic Sunroof ADAS Premium Features Full Details

ఇప్పటి వరకు స్కార్పియో Nలో కేవలం సింగిల్ పేన్ సన్‎రూఫ్ మాత్రమే ఉండేది సింగిల్ పేన్ సన్‌రూఫ్ మాత్రమే ఉండేది. కానీ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ రాబోతోంది. దీనివల్ల కారు లోపల మరింత వెలుతురు రావడమే కాకుండా ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతినిస్తుంది. టాటా సఫారీ వంటి కార్లలో ఈ ఫీచర్ ఇప్పటికే ఉండడంతో ఇప్పుడు మహీంద్రా కూడా ఆ లోటును భర్తీ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ పూర్తిగా హైటెక్ టచ్‌తో రాబోతోంది. ఇందులో 10.25 అంగుళాల నుంచి 12.3 అంగుళాల వరకు ఉండే పెద్ద ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. పెద్ద ఎస్‌యూవీలను పార్కింగ్ చేయడం కష్టమనే వారికి ఈ కెమెరా సెటప్ ఒక వరం లాంటిది. ఇరుకైన సందుల్లో కూడా కారును సులభంగా నడిపేందుకు వీలుగా 360డిగ్రీల కెమెరాను ఇస్తున్నారు.

Mahindra Scorpio N Facelift 2026 Panoramic Sunroof ADAS Premium Features Full Details

థార్ రాక్స్ తరహాలో 10.25 అంగుళాల పూర్తి స్థాయి డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. వేసవి కాలంలో ప్రయాణాన్ని హాయిగా మార్చేలా ముందు సీట్లకు వెంటిలేషన్ ఫీచర్ ఇస్తున్నారు

మహీంద్రా ఇప్పుడు సేఫ్టీకి పెద్ద పీట వేస్తుంది. ఇప్పటికే గ్లోబల్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించిన స్కార్పియో N, ఇప్పుడు Level 2 ADAS ఫీచర్లతో రాబోతుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఇవి ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్‎ను అలర్ట్ చేస్తాయి.

Mahindra Scorpio N Facelift 2026 Panoramic Sunroof ADAS Premium Features Full Details

మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (203 PS), 2.2 లీటర్ డీజిల్ (175 PS) ఇంజిన్లే కొనసాగుతాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఆఫ్-రోడ్ ప్రియుల కోసం 4WD (4XPLOR) సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనివల్ల బురద, కొండ ప్రాంతాల్లో కూడా కారు దూసుకుపోతుంది.

మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ధర రూ.14 లక్షల నుంచి రూ.26లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు 2026 ఆగస్టు నాటికి లేదా పండుగ సీజన్లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టైల్, పవర్, లగ్జరీ కోరుకునే వారికి ఈ ఎస్‌యూవీ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 3, 2026, 13:40 [IST]
English summary
Mahindra scorpio n facelift 2026 panoramic sunroof adas premium features full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+