టీజర్‌తో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కారు.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. ఈ కారే ఎందుకు అంత స్పెషల్?

ఈ సంవత్సరం ప్రారంభంలో మహీంద్రా (Mahindra) తన ప్రీమియం కార్ల లైనప్‌లో భాగంగా XUV 7XOను విడుదల చేసి మంచి హడావుడి సృష్టించింది. ఆ ఉత్సాహం తగ్గకముందే, ఇప్పుడు కంపెనీ మరో పెద్ద లాంచ్‌కు సిద్ధమవుతోంది. అదే 2026 థార్ రాక్స్. ఇప్పటికే భారత మార్కెట్లో థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సమయంలో, మహీంద్రా విడుదల చేసిన తాజా టీజర్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇటీవల మహీంద్రా షేర్ చేసిన టీజర్ చిత్రంలో "స్పాట్‌లైట్ దాని నక్షత్రాన్ని కనుగొంది" అనే క్యాచ్‌ఫ్రేజ్‌ను ఉపయోగించింది. ఈ ఒక్క లైన్ చాలు... కొత్త థార్ వస్తుందా? లేక థార్‌కు సంబంధించిన స్పెషల్ ఎడిషన్ ఏదైనా సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలకు దారి తీసింది.

టీజర్‌లో పూర్తిగా కారు కనిపించకపోయినా, అందులో కనిపిస్తున్న స్టాన్స్, లైటింగ్ స్టైల్ చూస్తే థార్ రాక్స్‌కు సంబంధించినదే అనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. టీజర్‌ను బట్టి, మహీంద్రా థార్‌కు ఒక ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేసే అవకాశం ఉందని లేదా చిన్న ఫేస్‌లిఫ్ట్‌తో 2026 మోడల్‌ను తీసుకురాబోతుందన్న చర్చ జరుగుతోంది. డిజైన్‌లో స్వల్ప మార్పులు, కొత్త ఫీచర్లు లేదా కొత్త కలర్ థీమ్‌తో థార్ రాక్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు.

Mahindra Thar Roxx 2026 Teaser Hints At New Update Details Inside

మొత్తానికి, ఈ టీజర్‌తో మహీంద్రా థార్ అభిమానుల అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసిందని చెప్పొచ్చు. గతంలో మహీంద్రా తన ఇతర మోడళ్లకు తీసుకువచ్చిన నలుపు లేదా ఎబోనీ ఎడిషన్లను చూస్తే, అదే ఫార్ములాను ఇప్పుడు థార్ రాక్స్‌పై కూడా ప్రయోగించే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ ఎడిషన్లలో పెద్ద డిజైన్ మార్పులు కాకుండా, చిన్న అప్‌డేట్లు, కలర్ థీమ్ మాత్రమే కంపెనీ అందిస్తూ ఉంటుంది.

అదే విధంగా, థార్ రాక్స్ ప్రత్యేక ఎడిషన్ కూడా పరిమితమైన మార్పులతో, చూడగానే ప్రత్యేకంగా కనిపించేలా రూపొందించే అవకాశం ఉంది. ఊహాగానాలు నిజమైతే, థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ పూర్తిగా నలుపు రంగులో విడుదల కావొచ్చని అంటున్నారు. బాహ్య భాగంలో ఆల్-బ్లాక్ పెయింట్, బ్లాక్ అలాయ్ వీల్స్, డార్క్ బ్యాడ్జింగ్ లాంటి అంశాలతో పాటు, లోపలి భాగంలో కూడా నల్లటి థీమ్, డార్క్ అప్హోల్స్టరీ, బ్లాక్ ట్రిమ్‌ను అందించే అవకాశముంది.

Mahindra Thar Roxx 2026 Teaser Hints At New Update Details Inside

ఇది థార్‌కు మరింత మస్క్యులర్, అగ్రెసివ్ లుక్‌ను ఇవ్వడంతో పాటు, యువతను ప్రత్యేకంగా ఆకర్షించేలా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలలుగా మరో ఆసక్తికరమైన విషయం చర్చలో ఉంది. థార్‌లో చిన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం. ప్రస్తుతం ఉన్న పెద్ద డీజిల్ ఇంజిన్‌తో పోలిస్తే, ఈ చిన్న ఇంజిన్ వేరియంట్ తీసుకువస్తే థార్ ప్రారంభ ధరలు కొంత మేర తగ్గవచ్చు.

దీంతో థార్ మరింత అందుబాటులోకి వచ్చి, బడ్జెట్‌ను చూసుకునే వారికి ఈజీగా దొరుకుతుంది . ఈ తాజా టీజర్‌ చిన్న ఫేస్‌లిఫ్ట్‌ను సూచించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అలా జరిగితే, వాహనంలో పూర్తిస్థాయి మార్పులు కాకుండా, ఎక్కువగా అందానికి సంబంధించిన అప్‌డేట్‌లకే మహీంద్రా పరిమితం కావొచ్చని భావిస్తున్నారు. థార్‌కు ఇప్పటికే ఉన్న రగ్గడ్ ఇమేజ్‌ను అలాగే ఉంచుతూ, కొంత తాజాదనాన్ని జోడించే దిశగానే ఈ అప్‌డేట్లు ఉండే అవకాశం ఉంది.

Mahindra Thar Roxx 2026 Teaser Hints At New Update Details Inside

ఇంటీరియర్ చూస్తే, ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత ఆధునికంగా కనిపించేలా అప్‌గ్రేడ్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అందించే అవకాశముంది. అదేవిధంగా, సీటింగ్‌లో స్వల్ప మార్పులు, కొత్త అప్హోల్స్టరీ లేదా మెరుగైన కంఫర్ట్‌పై దృష్టి పెట్టే అప్‌డేట్లు రావొచ్చని అంచనా. చిన్న ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో థార్ రాక్స్ క్యాబిన్‌ను మరింత ప్రీమియంగా, యూజర్‌ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నం కనిపించవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, January 23, 2026, 11:12 [IST]
English summary
Mahindra thar roxx 2026 teaser hints at new update details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+