దేశంలో ఈ కారు క్రేజ్ పీక్‌కు చేరింది.. ఇప్పుడు బుక్‌ చేస్తే 336 రోజుల తర్వాత డెలివరీ! షోరూమ్స్ ఫుల్‌గా బిజీ!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో SUVలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రఫ్ అండ్ టఫ్ లుక్, ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం, భారీ రోడ్ ప్రెజెన్స్ కలిగిన వాహనాలకు యువత నుంచి కుటుంబాల వరకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తీసుకొచ్చిన థార్ (Thar) భారత మార్కెట్‌లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. మొదట్లో ఇది ప్రధానంగా ఆఫ్‌రోడింగ్ ప్రేమికులు, అడ్వెంచర్ అభిమానులను టార్గెట్ చేస్తూ వచ్చినప్పటికీ, క్రమంగా సాధారణ కుటుంబాలు కూడా థార్ వైపు ఆకర్షితులయ్యాయి. అయితే మూడు డోర్ల థార్‌లో స్థలం పరిమితంగా ఉండటం, వెనుక సీట్లో ప్రయాణించడం కొంచెం అసౌకర్యంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 5 డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను తీసుకొచ్చింది.

ఐదు డోర్లతో వచ్చిన ఈ కొత్త SUV విడుదలైన మొదటి రోజు నుంచే భారీ స్థాయిలో స్పందనను అందుకుంది. థార్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను కొనసాగిస్తూ, కుటుంబ వినియోగానికి అనుకూలంగా మరింత ప్రీమియం ఫీల్‌తో దీన్ని రూపొందించడం వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. మార్కెట్‌లో విడుదలైన తొలి ఏడాదిలోనే థార్ రాక్స్ 1 లక్ష అమ్మకాల మార్కును దాటడం పెద్ద విషయంగా భావిస్తున్నారు.

Mahindra Thar Roxx High Demand Causes Long Waiting Period In India

2026లో కూడా థార్ రాక్స్‌కు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి నెలా బుకింగ్స్ బలంగా కొనసాగుతుండటంతో కొన్ని వేరియంట్లకు భారీ స్థాయిలో వెయిటింగ్ పీరియడ్ నమోదవుతోంది. ఎక్కువగా డిమాండ్ ఉన్న కొన్ని ట్రిమ్స్ కోసం దాదాపు 336 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు వినియోగదారులు తమ వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొన్ని వేరియంట్లకు 28 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

ఈ SUVకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ కొనసాగుతుండటంతో, డెలివరీ సమయాలు నగరానికొకలా, వేరియంట్‌కొకలా మారుతున్నాయి. ముఖ్యంగా ఏ ట్రిమ్‌ను ఎంచుకుంటున్నారు, పెట్రోల్ లేదా డీజిల్ పవర్‌ట్రెయిన్ తీసుకుంటున్నారా, ఆటోమేటిక్ లేదా మాన్యువల్ వేరియంట్ కావాలా వంటి అంశాలపై ఆధారపడి వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా మారుతోంది. సాధారణంగా టాప్ ఎండ్ ట్రిమ్‌లు, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లకు అత్యధిక డిమాండ్ ఉండటంతో వాటి కోసం ఎక్కువకాలం వేచి ఉండాల్సి వస్తోంది.

Mahindra Thar Roxx High Demand Causes Long Waiting Period In India

దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. గుర్గావ్‌, ఫరీదాబాద్‌, నోయిడా వంటి ప్రాంతాల్లో థార్ రాక్స్ 2.0 MX1 ట్రిమ్‌కు ఏకంగా 336 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ నమోదవుతోంది. అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు SUV కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థాయి వెయిటింగ్ పీరియడ్ చూస్తే ఆ ప్రాంతాల్లో థార్ రాక్స్‌కు ఉన్న క్రేజ్ ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతోంది.

బెంగళూరులో అదే 2.0 MX1 ట్రిమ్‌కు 120 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండగా, హైదరాబాద్‌లో పరిస్థితి మెరుగ్గా 42 రోజుల వెయిటింగ్ మాత్రమే ఉంది. అయితే హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక డీజిల్, ఆటోమేటిక్ ట్రిమ్‌లకు ముఖ్యంగా 2.2 MX5 AT డీజిల్, 2.2 MX5 డీజిల్, స్టార్ ఎడిషన్ AT, స్టార్ ఎడిషన్ AT డీజిల్, స్టార్ ఎడిషన్ డీజిల్ వంటి వేరియంట్లకు 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ నమోదవుతోంది.

Mahindra Thar Roxx High Demand Causes Long Waiting Period In India

అయితే ఈ డెలివరీ సమయాలు పూర్తిగా స్థిరంగా ఉండవు. మీరు ఎంచుకునే రంగు, ప్రత్యేక వేరియంట్, పవర్‌ట్రెయిన్ ఎంపిక, ఆటోమేటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అదేవిధంగా ఏ డీలర్‌షిప్ నుంచి బుకింగ్ చేస్తున్నారు, ఆ ప్రాంతంలో స్టాక్ లభ్యత ఎలా ఉంది, నెలవారీ డిమాండ్ ఎంత ఉంది వంటి విషయాలు కూడా వెయిటింగ్ సమయాన్ని ప్రభావితం చేస్తాయి. పూర్తి వివరాలకు షోరూమ్‌లో సంప్రదించగలరు.

Article Published On: Saturday, May 23, 2026, 11:02 [IST]
English summary
Mahindra thar roxx high demand causes long waiting period in india
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+