ఒకే కారులో.. పెట్రోల్, హైబ్రిడ్, EV! మిడిల్‌క్లాస్ కోసం స్కార్పియో చిన్న తమ్ముడు వచ్చేస్తున్నాడు!

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చుతూ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra And Mahindra) 2025లో ఒకేసారి నాలుగు భవిష్యత్తు కాన్సెప్ట్ కార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అవే మహీంద్రా విజన్ ఎస్, మహీంద్రా విజన్ ఎక్స్, మహీంద్రా విజన్ టీ, మహీంద్రా విజన్ ఎస్‌ఎక్స్‌టీ. ఈ కార్లను చూసిన వెంటనే "మహీంద్రా ఇప్పుడు భవిష్యత్తు కార్ల యుగంలోకి అడుగుపెట్టింది" అనే అభిప్రాయం ఆటోమొబైల్ ప్రపంచంలో వ్యక్తమైంది. ఈ కాన్సెప్ట్ మోడళ్ల వెనుక ఉన్న అసలైన హైలైట్ మాత్రం కంపెనీ రూపొందించిన సరికొత్త NU_IQ Platform ప్లాట్‌ఫామ్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన ఈ ఆధునిక ప్లాట్‌ఫామ్‌పై 3.9 మీటర్ల నుంచి 4.3 మీటర్ల పొడవు కలిగిన విభిన్న రకాల వాహనాలను తయారు చేయవచ్చు.

ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్ ఒకే సమయంలో సంప్రదాయ ICE ఇంజిన్ కార్లకు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మద్దతు ఇవ్వడం విశేషం. అంటే రాబోయే కాలంలో పెట్రోల్, హైబ్రిడ్, EV ఏ సెగ్మెంట్‌లోనైనా మహీంద్రా వేగంగా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ఇది బలమైన బేస్‌గా మారనుంది. ఇక ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై మార్కెట్లోకి వచ్చే తొలి మోడల్‌గా మహీంద్రా విజన్ ఎస్ (Mahindra Vision S) నిలవనుందని సమాచారం.

Mahindra Upcoming Vision S New Compact Suv In India Full Details Inside

ఇప్పటికే ఈ కాన్సెప్ట్ SUV భారతీయ రోడ్లపై టెస్టింగ్ దశలో కనిపించడం భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇదే మహీంద్రా తదుపరి బిగ్ SUV అంటూ చర్చలు మొదలయ్యాయి. స్పై చిత్రాల వివరాల ప్రకారం, ఈ SUVకు బలమైన రోడ్ ప్రెజెన్స్, హై-గ్రౌండ్ క్లియరెన్స్, భవిష్యత్తు డిజైన్ ఎలిమెంట్స్, కొత్త LED లైటింగ్ సిగ్నేచర్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

బయటకు కాన్సెప్ట్ మోడల్‌లా కనిపించినప్పటికీ, ప్రొడక్షన్ వెర్షన్‌కు దగ్గరగా ఉన్న డిజైన్‌తోనే టెస్టింగ్ జరుగుతుంది. విజన్ ఎస్ భారత మార్కెట్లోకి వస్తే, ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమాణం పరంగా, ఈ SUV ప్రస్తుతం మార్కెట్లో ఉన్న XUV 3XO కంటే కొంచెం ప్రీమియంగా, Scorpio Classic కంటే కాంపాక్ట్‌గా ఉండేలా కంపెనీ దీనిని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mahindra Upcoming Vision S New Compact Suv In India Full Details Inside

ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, ఈ SUVను పలు ఇంజన్ ఆప్షన్‌లతో తీసుకురావాలని భావిస్తోంది. అందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు, ఎక్కువ టార్క్, లాంగ్ డ్రైవ్‌ల కోసం 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో పెరుగుతున్న హైబ్రిడ్ టెక్నాలజీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

అంటే ఒకే మోడల్‌లో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, తర్వాత EV ఇలా అన్ని రకాల వినియోగదారులను టార్గెట్ చేసే భారీ ప్లాన్‌తో మహీంద్రా ముందుకు వెళ్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొత్త NU_IQ Platform ప్లాట్‌ఫామ్ ఈ ఫ్లెక్సిబిలిటీకి ప్రధాన కారణం. మార్కెట్ వ్యూహం పరంగా చూస్తే, కంపెనీ ముందుగా ICE వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అంటే తొలి దశలో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Mahindra Upcoming Vision S New Compact Suv In India Full Details Inside

ఆ తర్వాత పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం Mahindra Vision S ICE వెర్షన్ 2027లో భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. దాని తర్వాత కొంత గ్యాప్‌తో EV వెర్షన్ కూడా అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మొదటగా విడుదల కానున్న విజన్ S ప్రారంభ ధర కేవలం రూ. 8-9 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా.

Article Published On: Tuesday, May 12, 2026, 12:33 [IST]
English summary
Mahindra upcoming vision s new compact suv in india full details inside
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+