సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా ఈ కారే కావాలంటున్నారు.. ఒక్క ఛార్జ్‌తో 682 కి.మీ రేంజ్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు
భారతీయ రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల (EV) జోరు పెరిగింది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. మహీంద్రా నుంచి వచ్చిన ఫ్యూచరిస్టిక్ మోడల్ మహింద్రా XEV 9e ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, దానికి తోడు అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉండటంతో కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు సాధించిన అమ్మకాలు చూస్తుంటే, ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో మహీంద్రా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
అమ్మకాల సునామీ - సేల్స్ రిపోర్ట్
మహీంద్రా XEV 9e విడుదలైనప్పటి నుంచి అమ్మకాల్లో దూసుకుపోతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు) ఈ కారు ఏకంగా 27,140 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంటే నెలకు సగటున 2,260 మంది ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మే, జూన్, అక్టోబర్ నెలల్లో అమ్మకాలు 2,700 యూనిట్లు దాటిపోయాయి. ఈ గణాంకాలు చూస్తుంటే.. ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నప్పటికీ ఈ కారుకు ఉన్న డిమాండ్ అర్థమవుతుంది.

అత్యున్నత భద్రత - 5 స్టార్ రేటింగ్
ప్రస్తుత కాలంలో కారు కొనేవారు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మహీంద్రా XEV 9e ఈ విషయంలో కస్టమర్ల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంది. Bharat NCAP (BNCAP) క్రేష్ టెస్టులో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 32 పాయింట్లు సాధించడం విశేషం. పిల్లల భద్రత విషయంలో కూడా 49కి 45 పాయింట్లు సాధించి, ఫ్యామిలీస్ కోసం ఇది అత్యంత సురక్షితమైన కారు అని నిరూపించుకుంది.
మతిపోగొట్టే రేంజ్, పవర్:
మహీంద్రా XEV 9e రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది.
59kWh బ్యాటరీ: ఇది 231hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. MIDC రేంజ్ ప్రకారం ఇది 542 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, 170kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది.
విశాలమైన స్థలం, లగ్జరీ ఫీచర్లు
ఈ కారు డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. 4789 మిమీ పొడవు, 1907 మిమీ వెడల్పుతో రోడ్డు మీద రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. లోపల స్పేస్ విషయంలో రాజీ పడలేదు. ఇందులో 663 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు ముందు భాగంలో 150 లీటర్ల ఫ్రంక్ (Frunk) కూడా ఉంది. అంటే సామాన్ల కోసం అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. 207 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్ల మీద కూడా హాయిగా ప్రయాణించవచ్చు.

ధర, పోటీ:
మహీంద్రా XEV 9e ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.21.90 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ.31.25 లక్షల వరకు ఉంది. ఈ ధరలో ఇది టాటా హారియర్ ఈవీ, బీవైడీ అట్టో 3, విన్‌ఫాస్ట్ వీఎఫ్7 వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఫీచర్లు, రేంజ్, సేఫ్టీ పరంగా చూస్తే ఈ కారు తన ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








