ఇది కారు కాదు థియేటర్..బటన్ నొక్కితే 8సెకన్లలోపే 100కి.మీ స్పీడ్..డీలర్‌షిప్‌లకు చేరుతున్న లేటెస్ట్ సెన్సేషన్
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మహీంద్రా, తాజాగా XEV 9e మోడల్‌లో అత్యంత విలాసవంతమైన సినెలక్స్ ఎడిషన్ (Cineluxe Edition)ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభంలోనే దీనిని పరిచయం చేయగా, ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్నాయి. అంటే మీరు ఈ కారును నేరుగా షోరూమ్‌కు వెళ్లి చూసి, టెస్ట్ డ్రైవ్ చేసి ఇంటికి తెచ్చుకునే సమయం వచ్చేసిందన్నమాట.
మహీంద్రా XEV 9e సినెలక్స్ ఎడిషన్ ప్రధాన ఆకర్షణ దాని ఇంటీరియర్. కారు లోపలికి అడుగు పెట్టగానే మీకు ఒక లగ్జరీ లాంజ్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. దీని క్యాబిన్‌లో చెస్టనట్ బ్రౌన్, క్ట్రన్ బ్లాక్ కలర్స్‌లో స్మూత్-గ్రెయిన్ లెదరెట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కారుకు అత్యంత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతేకాదు, ఈ కారులో ఇన్ఫినిటీ రూఫ్ (పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్),16 మిలియన్లకు పైగా రంగుల ఆప్షన్లు ఇచ్చే అంబియంట్ లైటింగ్ సిస్టమ్ ఉంది. అంటే మీ మూడ్‌ని బట్టి కారు లోపలి లైటింగ్ రంగును మార్చుకోవచ్చు. డాష్‌బోర్డ్ మొత్తం కవర్ చేస్తూ ట్రిపుల్ హెచ్‌డీ (Triple HD) డిస్ప్లే సెటప్ ఉండటం ఈ కారును ఫ్యూచర్ వెహికల్ మాదిరి చూపిస్తుంది.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేసేవారికి ఇది ఒక వరమనే చెప్పాలి. సినెలక్స్ ఎడిషన్‌లో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీతో కూడిన 16 స్పీకర్ల హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ అమర్చారు. కారు లోపల ఒక చిన్న థియేటర్ ఉన్నంత సౌండ్ క్వాలిటీని ఇది అందిస్తుంది. ఇక ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, ఇది సాటిన్ బ్లాక్, సాటిన్ వైట్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కారు బాడీ డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉండి, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.
ఈ స్పెషల్ ఎడిషన్ కారు 79kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే లాంగ్ ట్రిప్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. దీని వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 286hp శక్తిని, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కారు కేవలం 7.45 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్పీడ్, రేంజ్ రెండింటిలోనూ మహీంద్రా రాజీ పడలేదని ఇక్కడ స్పష్టమవుతోంది.

మహీంద్రా ఈ కారులో ప్యాక్ త్రీ (Pack Three) అనే అడ్వాన్స్‌డ్ ఫీచర్ల సెట్‌ను అందించింది. ఇందులో స్ట్రెయిట్ అహెడ్ విజన్‌ఎక్స్ ఏఆర్ హెడ్స్-అప్ డిస్ప్లే (HUD) ఉంటుంది. ఇది కారు వేగం, మ్యాప్ వివరాలను విండ్‌షీల్డ్‌పైనే చూపిస్తుంది. డ్రైవర్, ప్యాసింజర్ మానిటరింగ్ సిస్టమ్, హ్యాండ్స్-ఫ్రీ పార్క్ అసిస్ట్, సెక్యూర్ 360 సేఫ్టీ సూట్ వంటివి ఈ కారులో సేఫ్టీని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాయి. కారు చుట్టూ ఉన్న ప్రతి అంగుళాన్ని గమనించేలా సెక్యూర్ 360 ప్రో కెమెరా సిస్టమ్ కూడా ఉంది. పావ్ పాల్ (PawPal) మోడ్ ద్వారా మీ పెంపుడు జంతువులకు కూడా కారులో సౌకర్యవంతమైన వాతావరణాన్ని (HVAC) అందించవచ్చు.
మహీంద్రా XEV 9e సినెలక్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.29.35 లక్షలుగా నిర్ణయించారు. దీని టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 31.25 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లకు ఈ కార్లు చేరుకుంటున్నాయి. టాటా హారియర్ ఈవీ (Harrier EV), బీవైడీ అట్టో 3 (BYD Atto 3) వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారు, లగ్జరీ, టెక్నాలజీ కలగలిసిన వాహనం కావాలనుకుంటే మహీంద్రా XEV 9e సినెలక్స్ ఒక సరైన ఎంపిక.


Click it and Unblock the Notifications








