ప్రస్తుతం చాలా మంది బుక్ చేస్తున్న కారు ఇదే.. రెండు కుటుంబాలు కూర్చోవచ్చు, సింగిల్ ఛార్జ్‌తో 521 కి.మీలు

మహీంద్రా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ XEV 9S అనే సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVని ఇటీవల విడుదల చేసింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ మూడు-వరుస SUV, అంటే సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పూర్తి స్థాయి ఫ్యామిలీ EV అన్నమాట. పెద్ద కుటుంబంతో ప్రయాణించే వారికి అవసరమైన స్థలం, సౌకర్యం, ఆధునిక టెక్నాలజీ - ఈ మూడింటినీ సమతుల్యంగా కలిపి మహీంద్రా ఈ వాహనాన్ని రూపొందించింది. XEV 9S లోని మూడు వరుసల సీటింగ్ అమరిక ఏడుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చునేలా రూపొందించబడింది. మొదటి రెండు వరుసల్లో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉండటంతో పాటు, మూడో వరుస చిన్నపిల్లలకే పరిమితం కాకుండా పెద్దలు కూర్చునేంత స్పేస్‌ను అందిస్తుంది.

బ్యాటరీ విషయంలో మహీంద్రా ఎలాంటి రాజీ పడలేదు. XEV 9S రెండు బ్యాటరీ ఆప్షన్లతో 59kWh,పెద్ద 79kWh లతో అందుబాటులో ఉంది. 79kWh బ్యాటరీ వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 521 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది భారతీయ రోడ్లు, డ్రైవింగ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చాలా ప్రాక్టికల్ రేంజ్‌. రోజూ ఛార్జ్ చేసే టెన్షన్ లేకుండా, దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకునే అవకాశం దీనివల్ల లభిస్తుంది.

Mahindra Xev 9s Most Important Features You Must Know

డ్రైవింగ్ అనుభూతి విషయానికి వస్తే, XEV 9S లో సింగిల్-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది సిటీ డ్రైవింగ్‌లో సాఫీగా, శబ్దం లేకుండా నడిచేలా ఆప్టిమైజ్ చేయబడింది. ట్రాఫిక్‌లో తరచూ ఆగి మళ్లీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా తక్షణ టార్క్‌తో స్మూత్ యాక్సిలరేషన్ ఇస్తుంది. అదే సమయంలో హైవే డ్రైవింగ్‌లో స్థిరమైన వేగంతో, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రయాణించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

ఈ కారు చాలా శక్తివంతమైనది, 210 kW శక్తిని, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని తరగతిలో అత్యంత వేగవంతమైన 7-సీటర్ SUV (7.0 సెకన్లలో 0-100 కిమీ/గం). దీని టాప్ స్పీడ్ గంటకు 202 కిమీలుగా ఉంటుంది. ప్రధానంగా దీని ధరలు వచ్చేసి రూ. 19.95 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే నగరాలను బట్టి మారుతు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

Mahindra Xev 9s Most Important Features You Must Know

డిజైన్ పరంగా చూస్తే పూర్తిగా ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ SUVలా కనిపిస్తుంది. ముందు భాగంలో స్టైలిష్ LED DRLలు వెంటనే ఆకట్టుకుంటాయి, వాటికి జతగా ఇచ్చిన ద్వి-LED హెడ్‌ల్యాంప్‌లు రాత్రి డ్రైవింగ్‌లో అద్భుతమైన విజిబిలిటీని అందిస్తాయి. సంప్రదాయ ICE SUVలలో కనిపించే ఓపెన్ గ్రిల్‌కు బదులుగా, ఇందులో క్లోజ్డ్ గ్రిల్‌ను ఉపయోగించారు. ఈ గ్రిల్ మధ్యలో ప్రత్యేకమైన మహీంద్రా EV లోగో ఉండటం వాహనానికి ఒక ప్రీమియం, మోడ్రన్ ఐడెంటిటీని ఇస్తుంది.

ఇంటీరియర్‌ నెక్స్ట్-జెనరేషన్ SUV అన్న ఫీలింగ్ వస్తుంది. డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించిన ట్రిపుల్-స్క్రీన్ డిజైన్ ప్రధాన హైలైట్. ఈ సెటప్‌లో 12.3 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్రత్యేకంగా ప్యాసింజర్ కోసం ఇచ్చిన డెడికేటెడ్ స్క్రీన్ ఉన్నాయి. డ్రైవర్‌కు అవసరమైన సమాచారం ఒకే చూపులో అర్థమయ్యేలా ఉండగా, ప్యాసింజర్ కూడా తన స్క్రీన్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ లేదా వాహన సంబంధిత ఫీచర్లను నియంత్రించుకోవచ్చు.

Mahindra Xev 9s Most Important Features You Must Know

భద్రత విషయంలో మహీంద్రా XEV 9S ఎక్కడా రాజీ పడలేదని స్పష్టంగా తెలుస్తుంది. XEV 9Sలో మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. L2+ ADAS సిస్టమ్‌ను అమర్చారు. ఇది 5 రాడార్లు, 1 హై-రిజల్యూషన్ విజన్ కెమెరా ఆధారంగా పనిచేస్తుంది. భద్రతను డిజిటల్ స్థాయికి తీసుకెళ్లేలా Secure360 Pro అనే కొత్త ఫీచర్‌ను మహీంద్రా పరిచయం చేసింది. మొత్తంగా, మహీంద్రా XEV 9Sలో 140కి పైగా ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2026, 9:15 [IST]
English summary
Mahindra xev 9s most important features you must know
Read more on: #mahindra #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+