ఏంటి మామ ఈ మహీంద్రా వాళ్లు.. ఈ కారు కొంటే ఏకంగా రూ.70,000 డిస్కౌంట్ ఇస్తున్నారు
సొంతంగా ఒక మంచి ఎస్‌యూవీ (SUV) కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా (Mahindra) ఈ జూన్ 2026 నెలలో తన వివిధ రకాల మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO పై అదిరిపోయే తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ జూన్ నెలలో ఈ కారును సొంతం చేసుకోవడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 70,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
జూన్ 30 వరకే సువర్ణావకాశం
కార్స్24 నివేదిక ప్రకారం.. మహీంద్రా XUV 3XO పై అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ లో నేరుగా లభించే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్ యాక్సెసరీస్ వంటి ఇతర అదనపు ప్రయోజనాలు కూడా కలిసి ఉన్నాయి. అయితే మీరు ఉండే నగరం లేదా ఎంచుకునే డీలర్‌షిప్‌ను బట్టి ఈ డిస్కౌంట్ వివరాలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందే షోరూమ్‌కు వెళ్లి పూర్తి వివరాలు కనుక్కోవడం మంచిది.

ఆకట్టుకునే మోడ్రన్ డిజైన్, ఫీచర్లు
మహీంద్రా XUV 3XO డిజైన్ పరంగా కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. కారు ముందు భాగంలో ఇచ్చిన గ్లోస్ బ్లాక్ గ్రిల్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన సి-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఈ కారుకు రోడ్డుపై మంచి గంభీరమైన లుక్‌ను ఇస్తాయి. కారు లోపలి భాగం విషయానికి వస్తే.. ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా అత్యంత పెద్దదైన పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. దీనితో పాటు కేబిన్‌కు లగ్జరీ ఫీల్ ఇచ్చేలా 10.25-ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను అమర్చారు.
పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, మైలేజ్
పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మహీంద్రా XUV 3XO దూకుడుగా ఉంటుంది. కస్టమర్ల సౌకర్యార్థం ఇందులో మూడు రకాల పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఇందులో రెండు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు కాగా.. మరొకటి నమ్మకమైన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్లు కారుకు అద్భుతమైన పికప్‌ను అందించడంతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్లలో లీటరుకు సుమారు 18 నుంచి 20 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్లలో లీటరుకు దాదాపు 21 నుంచి 23 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజ్ లభిస్తుంది.

నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ, ధరల వివరాలు
భద్రతకు పెద్దపీట వేసే మహీంద్రా.. ఈ కారులో బేస్ మోడల్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఇచ్చింది. అంతేకాకుండా, దీని టాప్-ఎండ్ మోడళ్లలో రోడ్డు ప్రమాదాలను నివారించే అడ్వాన్స్‌డ్ లెవెల్-2 ఏడీఏెస్ (ADAS) టెక్నాలజీ,కారును సులభంగా పార్క్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా సదుపాయం కూడా ఉంది.
మార్కెట్లో ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 7.54 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ. 14.88 లక్షల వరకు ఉంటుంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో.. ఈ డిస్కౌంట్ ఆఫర్ కస్టమర్లకు మంచి డీల్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications