దేశంలో ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే.. సొంతం కావాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే
భారత మార్కెట్లో మహీంద్రా (Mahindra) మరోసారి తన క్రేజ్‌ను నిరూపించింది. XUV 700కి కొనసాగింపుగా అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ మోడల్ మహీంద్రా XUV 7XOను కంపెనీ ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ అయినప్పటి నుంచే ఈ SUVకి మార్కెట్లో అసాధారణమైన స్పందన లభిస్తోంది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో వచ్చిన XUV 7XOపై కస్టమర్ల ఆసక్తి ఎంత స్థాయిలో ఉందో బుకింగ్ గణాంకాలే చెబుతున్నాయి. మహీంద్రా XUV 7XOను రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో ప్రవేశపెట్టింది. ఈ ధరలు ప్రారంభ ధరలు మాత్రమే కాగా, మొదటి 40,000 మంది కస్టమర్ల డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టంచేసింది.
ఆకర్షణీయమైన ధరలతో పాటు, ప్రీమియం SUV అనుభూతిని అందిస్తుందనే నమ్మకమే భారీ బుకింగ్‌లకు ప్రధాన కారణం. XEV 9S, XUV 7XO SUVల కోసం ఒకేసారి బుకింగ్‌లను ప్రారంభించిన మహీంద్రా, జనవరి 14, 2026 మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 93,689 బుకింగ్‌లను నమోదు చేసింది. ఈ రెండు వాహనాలకు కలిపి వచ్చిన బుకింగ్‌ల విలువ రూ. 20,500 కోట్లకు మించిందని(ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా) కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

ఇది భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రాకు ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్‌ను మరోసారి చాటిచెప్పింది. అయితే, ఈ స్థాయిలో డిమాండ్ రావడంతో XUV 7XO డెలివరీలు ఆలస్యం కావడం తప్పనిసరి అయింది. ముఖ్యంగా ఈ SUV బేస్ వేరియంట్ అయిన AX ట్రిమ్‌కు అత్యధికంగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా, ఈ వేరియంట్‌కు దాదాపు 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశముందని సమాచారం.
ఈ వెయిటింగ్ పీరియడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లకు రెండింటికీ వర్తిస్తుందని తెలుస్తోంది. సాధారణంగా ఉత్పత్తి సామర్థ్యం, వేరియంట్ ప్రాధాన్యతలు, సరఫరా గొలుసు వంటి అంశాలతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. కానీ XUV 7XO AX విషయంలో కారణం మాత్రం విపరీతమైన డిమాండ్. తక్కువ ధరలో పెద్ద SUV లుక్, బలమైన ఇంజిన్ ఆప్షన్లు, అవసరమైన అన్ని ఫీచర్లతో రావడం వల్ల ఎక్కువ మంది కొనుగోలుదారులు బేస్ వేరియంట్‌కే మొగ్గు చూపుతున్నారు.

మహీంద్రా XUV 7XOలో AX3, AX5 వేరియంట్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా, AX3, AX5 ట్రిమ్‌లలోని అన్ని వేరియంట్లకు సగటున 5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. బేస్ AX వేరియంట్‌తో పోలిస్తే ఈ వెయిటింగ్ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ, విలువ కలిగిన ప్యాకేజీ కావడంతో AX3, AX5 వేరియంట్లు కూడా కొనుగోలుదారుల నుంచి భారీ స్పందనను పొందుతున్నాయి.
మహీంద్రా XUV 7XO SUV ధర భారత మార్కెట్లో రూ. 13.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ధరకు తగ్గట్టుగానే కాకుండా, అంతకంటే ఎక్కువ స్థాయిలో పనితీరు అందించేలా ఈ SUVని మహీంద్రా రూపొందించింది. పవర్‌ట్రెయిన్ పరంగా ఇది రెండు బలమైన ఇంజిన్ ఎంపికలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఈ ఇంజిన్ గరిష్టంగా 200 PS పవర్, 380 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ అలాగే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, డీజిల్ ప్రియుల కోసం మహీంద్రా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా అందిస్తోంది. ఈ శక్తివంతమైన యూనిట్ 185 PS పవర్, 450 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








