మహీంద్రా ఫీచర్ల సునామీ..గుంతల రోడ్ల మీద కూడా గాలిలో తేలినట్టు వెళ్లొచ్చు..XUV 7XO చూస్తే వావ్ అనాల్సిందే

మహీంద్రా అండ్ మహీంద్రా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న XUV700ని సరికొత్త హంగులతో, సరికొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మహీంద్రా XUV 7XO. ఇటీవల విడుదలైన XUV 3XO బాటలోనే, ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా నెక్స్ట్ లెవల్‌లో కనిపిస్తోంది. రూ.13.66 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూమ్) వచ్చిన ఈ కారు, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.

లుక్ అదిరింది.. డిజైన్ అదిరిపోయింది!
కొత్త XUV 7XOని చూస్తే ఎవరైనా సరే చూపు తిప్పుకోలేరు. దీని ముందు భాగంలో 8 వర్టికల్ స్లాట్‌లతో ఉన్న కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. వెనుక వైపు చూస్తే, మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ కారు తరహాలో ఉండే కనెక్టెడ్ ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక 19 ఇంచుల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత రాయల్ లుక్‌ను జోడించాయి.

Mahindra XUV 7XO Launched in India at Rs 13 66 Lakh with Triple-Screen Setup and Davinci Suspension

లోపల అంతా లగ్జరీ.. టెక్నాలజీ గురు
కారు లోపలికి వెళ్తే మనల్ని ఒక సరికొత్త ప్రపంచం ఆహ్వానిస్తుంది. ట్యాన్ బ్రౌన్, బీజ్ కలర్ కాంబినేషన్ క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇచ్చింది. డాష్‌బోర్డ్‌పై ట్రిపుల్ స్క్రీన్ సెటప్ దీని అసలు సిసలు హైలైట్. ఇందులో డ్రైవర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం మరొకటి.. ఇలా మూడు 12.3 ఇంచ్ స్క్రీన్‌లు అమర్చారు. అంతేకాదు, ప్రపంచంలోనే మొదటిసారిగా ఇందులో డావిన్చీ సస్పెన్షన్ సిస్టమ్ వాడారు, దీనివల్ల ప్రయాణం ఎంతో స్మూత్‌గా ఉంటుంది.

హైటెక్ ఫీచర్లు.. చాట్ జీపీటీ కూడా
టెక్నాలజీలో మహీంద్రా తగ్గేదే లే అన్నట్లుగా ఉంది. అలెక్సాతో పాటు చాట్ జీపీటీ (ChatGPT) ఇంటిగ్రేషన్‌ను కూడా ఇందులో ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, లెవల్ 2 ప్లస్ ADAS సిస్టమ్, 540-డిగ్రీ కెమెరా, 120కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఈ కారును ఒక కోటలా సురక్షితంగా మారుస్తాయి.

Mahindra XUV 7XO Launched in India at Rs 13 66 Lakh with Triple-Screen Setup and Davinci Suspension

ఇంజిన్ పవర్.. వేగం సూపర్
ఇంజిన్ విషయానికి వస్తే పాత నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌నే మహీంద్రా కొనసాగించింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (197 bhp), 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (182 bhp) ఆప్షన్లు ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు డీజిల్ వెర్షన్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ధర, బుకింగ్స్
మహీంద్రా XUV 7XO మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ ప్రారంభ ధర రూ.13.66 లక్షలు కాగా, డీజిల్ ధర రూ.14.96 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే ఈ ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. దీని టెస్ట్ డ్రైవ్‌లు జనవరి 8 నుంచి ప్రారంభమవుతాయి, బుకింగ్‌లు జనవరి 14 నుంచి చేసుకోవచ్చు.ముందుగా బుక్ చేసుకున్న వారికి జనవరి 14 నుంచే కారు డెలివరీలు మొదలవుతాయి.

Mahindra XUV 7XO Launched in India at Rs 13 66 Lakh with Triple-Screen Setup and Davinci Suspension

మొదటగా AX7, AX7T, AX7L వేరియంట్‌ల డెలివరీ చేస్తారు. ఆ తర్వాత AX, AX3, AX5 వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్ 2026 నుంచి మొదలవుతాయి. మార్కెట్లో టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లకు ఈ XUV 7XO గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 7:05 [IST]
English summary
Mahindra xuv 7xo launched in india at rs 13 66 lakh with triple screen setup and davinci suspension
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+