XUV 7XO మేకప్ అదిరింది కానీ..లోపల అసలు మేటర్ మిస్సయింది..కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి

మహీంద్రా సంస్థ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ(Mahindra XUV 7XO) ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఇంటీరియర్‌తో ఈ కారును ఊరంతా మెచ్చుకుంటున్నా, తీరా లోపలికి వెళ్లి చూస్తే నిత్యం అవసరమయ్యే కొన్ని కీలక ఫీచర్లు ఇందులో కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ధరను అదుపులో ఉంచేందుకో ఏమో కానీ, మహీంద్రా కొన్ని చిన్న చిన్న సౌకర్యాలను పక్కన పెట్టేసింది. దీనివల్ల డ్రైవింగ్ ప్రియులు, ఫ్యామిలీ మ్యాన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అసలు ఈ కారులో ఏమేం మిస్ అయ్యాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Mahindra XUV 7XO Review Top Features Missed in the New Tech-Loaded SUV

ఈ కారులో అత్యాధునిక ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది కానీ, స్టీరింగ్ వెనుక ఉండే ప్యాడిల్ షిఫ్టర్లు(Paddle Shifters) మాత్రం లేవు. స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునే వారికి, గేర్లను వేగంగా మార్చాలనుకునే వారికి ఇది పెద్ద మైనస్ అని చెప్పాలి. ప్యాడిల్ షిఫ్టర్లు ఉంటే డ్రైవర్ కంట్రోల్ మరింత మెరుగ్గా ఉంటుంది.

అలాగే పవర్డ్ టెయిల్‌గేట్ (బటన్ నొక్కితే డిక్కీ తెరుచుకునే సౌకర్యం), హెడ్-అప్ డిస్ప్లే (HUD), కెమెరా వాషర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో లేవు. దీని ప్రధాన పోటీదారు అయిన టాటా సఫారిలో ఈ ఫీచర్లు అన్నీ అందుబాటులో ఉండటం గమనార్హం.

Mahindra XUV 7XO Review Top Features Missed in the New Tech-Loaded SUV

మహీంద్రా దీనిని 7 సీటర్ ఎస్‌యూవీగా ప్రచారం చేస్తోంది. మొదటి రెండు వరుసల్లో కూర్చునే వారికి రాజభోగంలా ఉన్నా, మూడో వరుసలో మాత్రం స్థలం చాలా తక్కువగా ఉంది. ఇది కేవలం చిన్న పిల్లలకు మాత్రమే సరిపోతుంది. ఇక డ్యాష్‌బోర్డ్ మీద మూడు స్క్రీన్లతో కూడిన భారీ డిస్ప్లే సెటప్ చూడటానికి బాగుంది కానీ, ఏసీ కంట్రోల్స్ కూడా పూర్తిగా టచ్‌స్క్రీన్‌లోనే ఉండటం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపరేట్ చేయడం కాస్త కష్టంగా మారుతోంది.

రెండో వరుస సీట్లలో వెంటిలేటెడ్ సౌకర్యం ఇచ్చారు కానీ, సీట్లను ముందుకు వెనక్కి జరుపుకునే ఆప్షన్ లేకపోవడం లాంగ్ జర్నీలో అసౌకర్యంగా అనిపించవచ్చు. ఈ కారులో ఉన్న 2.0 లీటర్ ఎం-స్టాలియన్ పెట్రోల్ ఇంజిన్ పవర్ విషయంలో కింగ్ అనిపించుకున్నా, మైలేజ్ విషయంలో మాత్రం వెనకబడి ఉంది.

Mahindra XUV 7XO Review Top Features Missed in the New Tech-Loaded SUV

ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో పెట్రోల్ వేరియంట్ 6 నుంచి 8 కి.మీ మైలేజీ మాత్రమే ఇస్తోందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. ఇక అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు అయిన ADAS లెవల్-2, 540 డిగ్రీల కెమెరా కేవలం టాప్ ఎండ్ (AX7) మోడల్‌లోనే అందుబాటులో ఉన్నాయి. మిడ్-రేంజ్ వేరియంట్లలో కూడా ADAS ఇచ్చి ఉంటే మహీంద్రాకు తిరుగు ఉండేది కాదు.

టెక్నికల్ పరంగా చూస్తే XUV 7XO ఒక అద్భుతమైన కారు. ఇందులో సందేహం లేదు. అయితే మైలేజ్ గురించి ఆందోళన చెందే వారు పెట్రోల్ కంటే డీజిల్ వేరియంట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇది సిటీ మరియు హైవే ప్రయాణాలకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే మహీంద్రా కనీసం మిడ్ వేరియంట్ల నుండి ADAS వంటి భద్రతా ఫీచర్లను అందించి ఉంటే ఈ కారుకు మరింత విలువ పెరిగేది.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2026, 9:56 [IST]
English summary
Mahindra xuv 7xo review top features missed in the new tech loaded suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+