ఈ కారు కోసమే కస్టమర్లు ఎక్కువగా ఎదురుచూసింది.. తమ కుటుంబాలతో కలిసి డీలర్‌షిప్‌లలో సందడి!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటిగా నిలిచిన మహీంద్రా XUV700 ఇప్పుడు కొత్త రూపంలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కారు అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మహీంద్రా XUV 7XO అనే కొత్త పేరుతో ఇటీవలే కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. స్టైలింగ్ నుంచి ఫీచర్ల వరకు అనేక మార్పులతో వచ్చిన ఈ కొత్త మోడల్‌పై ఇప్పటికే వినియోగదారుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే, జనవరి 8 నుంచి మహీంద్రా XUV 7XO టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త డిజైన్, ఇంటీరియర్ లుక్, డ్రైవింగ్ ఫీల్‌ను ప్రత్యక్షంగా అనుభవించేందుకు కస్టమర్లు షోరూమ్‌లకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. టెస్ట్ డ్రైవ్‌లకు వచ్చిన స్పందనను చూస్తే, ఈ మోడల్‌పై ఉన్న ఆసక్తి ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.
ఇదే సమయంలో, ఇప్పటికే బుకింగ్‌లు చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే XUV 7XO ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లకు చేరుకోవడం మొదలైందని కార్వాలే వెల్లడించింది. షోరూమ్‌లలో వాహనాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత వినియోగదారులు ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీలర్‌షిప్‌లకు చేరడంతో, చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి షోరూమ్‌లను సందర్శిస్తూ కొత్త XUV 7XOను దగ్గరగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు అనువైన స్పేస్, ప్రీమియం ఫీల్ ఇచ్చే ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు ఈ SUVపై ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. మహీంద్రా XUV 7XO శక్తివంతమైన పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ SUVలో పెట్రోల్, డీజిల్ రెండూ అందుబాటులో ఉండటం వల్ల వివిధ అవసరాలకు అనుగుణంగా కొనుగోలుదారులు ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది.
పెట్రోల్ వేరియంట్లో 2.0 లీటర్ M-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 bhp హార్స్‌పవర్‌తో పాటు 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం, స్మూత్ డ్రైవింగ్ అనుభూతి కోరుకునే వారికి ఈ ఇంజన్ మంచి ఎంపిక. ఇక డీజిల్ వేరియంట్‌లో 2.2 లీటర్ M-హాక్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇది 182 bhp పవర్‌తో పాటు 420 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే ఆటోమేటిక్ వేరియంట్లలో టార్క్ మరింత పెరిగి 450 Nm వరకు అందుతుంది. ఇది భారీ లోడుతో ప్రయాణాలు చేసే వారికి, హైవే డ్రైవింగ్ ఇష్టపడే వారికి మరింత బలం అందిస్తుంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి. దీని వల్ల డ్రైవింగ్ మరింత స్మూత్‌గా, కంఫర్ట్‌గా మారుతుంది. ఆల్-వీల్ డ్రైవ్(AWD) సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, XUV 7XOలో అత్యంత ఆకర్షణీయమైన అంశం డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న ట్రిపుల్ స్క్రీన్ సిస్టమ్. ఇందులో మూడు 12.3 అంగుళాల భారీ స్క్రీన్‌లు ఉంటాయి. డ్రైవర్ కోసం ప్రత్యేక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి. ఈ సెటప్ వాహనానికి ఒక ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ ఫీల్‌ను ఇస్తోంది.

భద్రత విషయంలో SUVలో లెవల్ 2 ప్లస్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), రాడార్, కెమెరా సిస్టమ్‌లలో చేసిన కీలక అప్‌గ్రేడ్‌ల వల్ల, ADAS ఇప్పుడు మరింత ఖచ్చితంగా పనిచేసేలా రూపకల్పన చేయబడింది. కొత్త 540 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరాను అందించడం మరో పెద్ద హైలైట్. మొత్తంగా 120కిపైగా భద్రతా లక్షణాలతో ఈ SUVను మహీంద్రా సిద్ధం చేసింది.


Click it and Unblock the Notifications








