డిఫెండర్ కారు లాంటి లుక్.. మిడిల్ క్లాస్ బడ్జెట్‎కి నచ్చే రేటు.. మహీంద్రా కొత్త కారు మామూలుగా లేదు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విభాగంలో రారాజుగా వెలుగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, త్వరలోనే దేశీయ మార్కెట్లోకి మరో రెండు సరికొత్త ఎస్‌యూవీలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌కమింగ్ కార్ల జాబితాలో సరికొత్త న్యూ జనరేషన్ XUV 3XOతో పాటు, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మినీ స్కార్పియో (Mini Scorpio) ఉండటం విశేషం. సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ కార్ల ప్రారంభ ధర రూ. 10 లక్షల కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని సమాచారం.

సరికొత్త లుక్‌తో న్యూ జనరేషన్ XUV 3XO
మహీంద్రా తన పాపులర్ మోడల్ XUV 3XO ని కేవలం ఫేస్‌లిఫ్ట్ రూపంలో కాకుండా, పూర్తిగా సరికొత్త జనరేషన్ అప్‌డేట్‌తో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా NU_IQ అనే అధునాతన ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది. దీనివల్ల కారు ప్రస్తుత మోడల్ కంటే మరింత ధృడంగా, మోడ్రన్‌గా మారనుంది.

Mahindras Upcoming Mini Scorpio and Next Gen XUV 3XO Promise Premium SUV Looks at Affordable Prices

గత ఏడాది కంపెనీ ప్రదర్శించిన విజన్ X (Vision X) కాన్సెప్ట్ డిజైన్‌ను బేస్ చేసుకుని ఈ కారును రూపొందిస్తున్నారు. ఈ మోడల్‌ను 2028 మధ్య నాటికి మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. సరికొత్త మార్పుల వల్ల దీని ధర ప్రస్తుత ధర కంటే రూ. 80 వేల నుండి రూ. 1.5 లక్షల వరకు పెరగొచ్చని అంచనా.

లగ్జరీ ఇంటీరియర్, అదిరిపోయే ఫీచర్లు
కొత్త జనరేషన్ XUV 3XO ఇంటీరియర్‌లో విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నాయి. సరికొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇందులో హైలైట్‌గా నిలవనున్నాయి.

అంతేకాకుండా, కస్టమర్లను ఆకట్టుకోవడానికి పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవెల్ 2+ ADAS సేఫ్టీ ఫీచర్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్నారు. ఇంజిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతమున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లను అలాగే కొనసాగిస్తూనే, భవిష్యత్తులో సరికొత్త హైబ్రిడ్ ఆప్షన్‌ను కూడా తీసుకురానున్నారు.

Mahindras Upcoming Mini Scorpio and Next Gen XUV 3XO Promise Premium SUV Looks at Affordable Prices

రంగంలోకి మినీ స్కార్పియో.. ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్‌తో
మహీంద్రా లైనప్‌లో XUV 3XO కారుకు పోటీగా కాకుండా, దానికి అదనపు బలంగా మినీ స్కార్పియోను రంగంలోకి దించుతున్నారు. ఇది చూడటానికి స్కోర్పియో కారు లాగే రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. ఈ కారు డిజైన్ విజన్ S (Vision S) కాన్సెప్ట్ ఆధారంగా లగ్జరీ కార్ అయిన లాండ్ రోవర్ డిఫెండర్ లాంటి బాక్సీ లుక్‌ను కలిగి ఉండబోతోంది.

XUV 3XO లో లేని విధంగా ఈ మినీ స్కోర్పియోలో 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెవెల్ 2+ ADAS, వెంటిలేటెడ్ సీట్లు, రేర్ ఏసీ వెంట్స్ లాంటి టాప్ క్లాస్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. NU_IQ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే మొదటి కారు ఇదే కావచ్చు. దీనిని 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

Article Published On: Sunday, June 28, 2026, 13:52 [IST]
English summary
Mahindras upcoming mini scorpio and next gen xuv 3xo promise premium suv looks at affordable prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+