మధ్యతరగతి ఫ్యామిలీస్‌కు రియల్ హీరోలు.. పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి న్యాయం! బెస్ట్ ఆప్షన్ ఏది?
భారతీయ మధ్యతరగతి కుటుంబాల కలల కార్లలో ఎప్పుడూ ముందుంటున్న రెండు ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto K10), మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso). చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, పెద్ద ప్రయోజనాలను అందించే ఈ కార్లు నగర జీవనశైలికి అచ్చంగా సరిపోతాయి. సులభమైన డ్రైవింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజ్ వంటి లక్షణాలు వీటిని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తాయి. ఈ రెండు కార్లలోనూ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, స్పేర్ పార్ట్స్ సులభంగా లభించడం, దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు వినియోగదారులకు అదనపు భరోసాను ఇస్తాయి. ఈ కార్ల గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.
ధర: మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు కార్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఆల్టో కె10ప్రస్తుతం రూ. 3.70 లక్షల నుండి రూ. 5.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తోంది. అదే సమయంలో ఎస్ ప్రెస్సో ధర రూ. 3.50 లక్షల నుండి రూ. 5.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇవి రెండూ సరైన ఎంపికలుగా నిలుస్తాయి.

డిజైన్: ఎస్ ప్రెస్సో కొంచెం బోల్డ్, మినీ SUV స్టైల్‌ను గుర్తు చేసే డిజైన్‌ను కలిగి ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు దీన్ని మరింత ప్రీమియంగా చూపిస్తాయి. స్టీల్ వీల్స్ ఉన్నప్పటికీ, ఎత్తైన బాడీ స్ట్రక్చర్ దీనికి ప్రత్యేకమైన రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లపై కూడా బెస్ట్‌గా ఉంటుంది.
ఆల్టో కె10 డిజైన్ సింపుల్‌గా, కానీ ఆధునిక టచ్‌తో ఉంటుంది. ముందు భాగంలో LED హెడ్‌లైట్లు, LED DRLలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెనుకవైపు LED టెయిల్ ల్యాంప్‌లు కారుకు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. స్టీల్ వీల్స్ ఉన్నప్పటికీ, మొత్తం బాడీ డిజైన్ నగరాల్లో నిత్యవసర ప్రయాణాలకు సరిపోయేలా కాంపాక్ట్‌గా ఉంటుంది. 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ నగర రోడ్లకు సరిపోతే, 2,380 mm వీల్‌బేస్ సౌకర్యవంతమైన కేబిన్ స్పేస్‌ను అందిస్తుంది.

ఇంజిన్: ఆల్టో కె10లో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1-లీటర్ CNG ఆప్షన్ కూడా లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ఎంపిక ఉండటం డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. మైలేజీ విషయానికి వస్తే, లీటరుకు సుమారు 24 నుండి 34 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు సుమారు 145 కి.మీ. వరకు చేరగలదు, హైవే ప్రయాణాల్లో కూడా ఇది స్థిరమైన పనితీరును అందిస్తుంది.
ఎస్ ప్రెస్సో 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ CNG ఇంజిన్‌లతో వస్తుంది. దీనికీ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజీ పరంగా ఇది లీటరుకు సుమారు 24 నుండి 33 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 148 కి.మీ. వరకు ఉండటం దీని చురుకుదనాన్ని చూపిస్తుంది. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, తేలికైన బాడీ కలయికతో నగరంలోనూ, చిన్నపాటి హైవే డ్రైవ్‌ల్లోనూ ఇది సులభంగా నడుస్తుంది.

ఫీచర్స్: ఎస్ ప్రెస్సో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఆధునిక ఫీల్‌ను అందిస్తుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, USB కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు దీనిని డైలీ యూజ్‌కు అనుకూలంగా మారుస్తాయి. భద్రత పరంగా 2 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD వంటి ప్రామాణిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉండటం పార్కింగ్ సమయంలో అదనపు భరోసాను ఇస్తుంది.
ఆల్టో కె10లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ప్రయాణాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపుతుంది. కీలెస్ ఎంట్రీ లభిస్తుంది. భద్రత పరంగా, 6 ఎయిర్‌బ్యాగులు ఉండటం ఈ సెగ్మెంట్‌లో పెద్ద ప్లస్‌గా చెప్పాలి. అదనంగా ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 3-పాయింట్ సీట్ బెల్టులు ప్రయాణీకుల రక్షణకు తోడ్పడతాయి.


Click it and Unblock the Notifications








