స్విఫ్ట్, వ్యాగన్ఆర్ కథ ముగిసింది.. టాప్ 1లో కేవలం రూ.5.99 లక్షలకే దొరికే ప్రీమియం కారు
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఊహించని పెద్ద మార్పు చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన మే 2026 నెల వాహన విక్రయాల నివేదిక కార్ల ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా మార్కెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లు ఈసారి వెనకబడిపోయాయి. వీటన్నింటినీ దాటుకుంటూ మారుతి సుజుకి బాలెనో సరికొత్త రికార్డులతో నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా అవతరించింది. అయితే ఈ కార్ల అమ్మకాల మధ్య చాలా స్వల్ప తేడా మాత్రమే ఉండడం గమనార్హం.
ఈసారి సేల్స్ రిపోర్ట్‌లో ఒక క్రేజీ అప్‌డేట్ ఏమిటంటే.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్-5 కార్ల జాబితాలో ఒక్క హ్యాచ్‌బ్యాక్ కారు కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ టాప్-10 కార్ల ఓవరాల్ లిస్ట్‌లో మాత్రం హ్యాచ్‌బ్యాక్ కార్లు హ్యుందాయ్ క్రెటా కంటే చాలా పైస్థానంలో నిలిచాయి. మే 2026 లో దేశంలోనే అత్యధికంగా విక్రయించబడిన కారుగా మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మోడల్ ఏకంగా 24,546 యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది.

టాప్-10 మోడల్ వైజ్ విక్రయాల వివరాలను పరిశీలిస్తే, మారుతి సుజుకి ఫ్రాంక్స్ 20,686 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా 20,350 యూనిట్లతో మూడో స్థానాన్ని, టాటా పంచ్ 20,208 యూనిట్లతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఐదో స్థానంలో టాటా నెక్సాన్ కారు 19,100 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. ఈ టాప్-5 కార్ల తర్వాతే హ్యాచ్‌బ్యాక్ లైనప్ ప్రారంభం కావడం విశేషం.
మారుతి సుజుకి బాలెనో కారు మే నెలలో మొత్తం 18,396 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానంలో నిలిచి, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 18,076 యూనిట్లతో ఏడో స్థానంలో, మారుతి సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహింద్రా స్కార్పియో 15,774 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 15,235 యూనిట్ల అమ్మకాలతో టాప్-10 జాబితాను ముగించాయి.

జనాలు బాలెనో కారును ఇంతగా ఇష్టపడటానికి కారణం దాని సరికొత్త అగ్రెసివ్ డిజైన్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు. ఈ కారు ఏరోడైనమిక్ బాడీ డిజైన్, బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ తో లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. కారు ముందు భాగంలో షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. వెనుక వైపు ట్వీక్డ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, అగ్రెసివ్ బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చాయి. లోపలి భాగంలో డ్యూయల్-టోన్ అప్హోల్‌స్టరీతో కేబిన్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వైర్‌లెస్ సపోర్ట్ ఉన్న 9-ఇంచుల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. దీంతో పాటు ఆర్కమిస్ ట్యూన్డ్ ఆడియో సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా అలసట లేకుండా ఉండేలా సీట్లను చాలా కంఫర్టబుల్‌గా డిజైన్ చేశారు.

సేఫ్టీ విషయంలో కూడా మారుతి సుజుకి బాలెనో సూపర్ సేఫ్ అని నిరూపించుకుంది. ఇందులో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్-స్టాప్ అసిస్టెన్స్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి గజబ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు స్ట్రక్చరల్ సేఫ్టీని పెంచడానికి బలమైన హార్టెక్ (HEARTECT) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇందులో భారీ బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఇది నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, ఆర్క్టిక్ వైట్, ఓపులెంట్ రెడ్, లక్స్ బీజ్ వంటి ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది డ్యూయల్‌జెట్, డ్యూయల్ వీవీటీ టెక్నాలజీతో పనిచేస్తూ అదిరిపోయే పవర్, మైలేజ్‌ను అందిస్తుంది. కస్టమర్ల కోసం 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (ఆటో గేర్ షిఫ్ట్) ఆప్షన్లు ఉన్నాయి. కేబిన్ లోపల శబ్దాలు రాకుండా ఎన్‌వీహెచ్ (NVH) లెవల్స్‌ను తగ్గించారు. ఈ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 22 నుంచి 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.10 లక్షల వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications