కేవలం రూ. 5.99 లక్షలకే లగ్జరీ కారు.. లీటరుకు 30 కిమీ మైలేజ్.. టాటా నెక్సాన్ కే షాకిచ్చిన కారు
మారుతి సుజుకి నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫేవరెట్ కార్ బలేనో(Maruti Baleno) మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. 2025 డిసెంబర్‌లో ఊహించని రీతిలో అమ్మకాల్లో అగ్రస్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక్క నెలలోనే వేల సంఖ్యలో కార్లు అమ్ముడవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో అలాగే ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి బలేనో 2025 డిసెంబర్ నెలలో ఏకంగా 22,108 యూనిట్లను విక్రయించి దేశంలోనే నెంబర్ 1 కారుగా నిలిచింది. అంతకుముందు అమ్మకాల్లో దూసుకుపోయిన మారుతి ఫ్రాంక్స్ (20,700 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,400 యూనిట్లు, మారుతి డిజైర్ వంటి కార్లను కూడా వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. గత ఐదు నెలలుగా నెలకు సగటున 13,776 కార్లు అమ్ముడవుతుండగా, డిసెంబర్ నాటికి ఆ సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేసింది.

బలేనో ఇంతలా అమ్ముడవ్వడానికి ప్రధాన కారణం దాని ధర. సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చిన GST 2.0 సంస్కరణల వల్ల బలేనో ధర భారీగా తగ్గింది. ప్రభుత్వం చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై పన్ను భారాన్ని తగ్గించడంతో, మారుతి ఆ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకు అందించింది.
ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. టాప్ ఎండ్ మోడల్ (Alpha AMT) కూడా రూ.9.10 లక్షల లోపే లభిస్తుండటంతో, సామాన్యుడి బడ్జెట్ కు ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సరిగ్గా సెట్ అయింది. దాదాపు రూ.86,000 వరకు ధర తగ్గడం ఈ కారుకు వరంగా మారింది.

మధ్యతరగతి ప్రజలు కారు కొనేటప్పుడు ప్రధానంగా చూసేది మైలేజీ. బలేనో పెట్రోల్ మోడల్ లీటరుకు 22.94 కి.మీ మైలేజీ ఇస్తుండగా, దీని సీఎన్‌జీ (CNG) వేరియంట్ ఏకంగా 30.61 కి.మీ మైలేజీని అందిస్తోంది. అంటే దాదాపు ఒక బైక్ ఇచ్చే మైలేజీతో కారులో హాయిగా ఫ్యామిలీతో ప్రయాణించవచ్చు.
పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా సిటీలో నిత్యం ప్రయాణించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. హైబ్రిడ్ టెక్నాలజీ సాయంతో తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు బ్యాటరీ పవర్ వాడటం వల్ల ఇంధన ఆదా ఇంకా ఎక్కువగా జరుగుతుంది.

బలేనో కేవలం మైలేజీ మాత్రమే కాదు, లగ్జరీ ఫీచర్లకు కూడా కేరాఫ్ అడ్రస్.
360-డిగ్రీ కెమెరా: ఇరుకైన సందుల్లో లేదా పార్కింగ్ చేసేటప్పుడు కారు చుట్టూ ఉన్న దృశ్యాలను స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు.
హెడ్స్-అప్ డిస్ప్లే (HUD): డ్రైవర్ చూపు రోడ్డు మీద నుంచి పక్కకు తిప్పకుండానే స్పీడ్, నావిగేషన్ వంటి వివరాలు విండ్‌షీల్డ్ పై కనిపిస్తాయి.
9-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉంది.

ఈ 2025 మోడల్ లో భద్రతకు పెద్దపీట వేశారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ABS తో కూడిన EBD, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ప్రయాణీకులకు పూర్తి రక్షణనిస్తాయి. భారత్ NCAP టెస్టుల్లో కూడా ఈ కారు మెరుగైన రేటింగ్ సాధించడం విశేషం.
బలేనో చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నెక్స్-రే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. లోపల 318 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల ఫ్యామిలీ ట్రిప్స్ కు అవసరమైన లగేజీని సులభంగా సర్దుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.


Click it and Unblock the Notifications