రూ.5 లక్షల్లో మంచి కారు.. 34 కిమీ మైలేజ్.. అందుకే ఇంజనీర్లు, డాక్టర్లకు ఈ కారే ఇష్టం!

భారతీయ పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందించడంలో దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లు సాధారణంగా బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రతినెలా కూడా ఈ కంపెనీ అమ్మకాల పరంగా ఆకట్టుకునే సేల్స్ గణంకాలను నమోదు చేస్తుంటాయి. ఈ క్రమంలో మారుతి ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి వ్యాగన్‌ ఆర్ (Wagon R) అమ్మకాల విషయంలో గత నెలలో మెరుగైన సంఖ్యలను సాధించింది. తాజాగా వచ్చిన సేల్స్ ప్రకారం, వ్యాగన్‌ ఆర్ జూన్ 2026 లో 16,952 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్లో తన సత్తా ఎంటో ఆటోమొబైల్ రంగానికి చూపించింది.

ఇది గత ఏడాది అంటే 2025 జూన్ నెలతో పోలిస్తే దాదాపుగా 31.11 శాతం వృద్ధి సాధించడం విశేషం. మార్కెట్లో పోటీ ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. వివిధ కార్ల తయారీదారులు వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త డిజైన్లతో అధునాతన ఫీచర్లతో, ఆకర్షణీయమైన కలర్స్‌లలో అందిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీలకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఇలాంటి పోటీ సమయంలో కూడా హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి వ్యాగన్‌ ఆర్ సేల్స్‌లో సత్తా చాటుతుంది.

Maruti Best Hatchback Wagonr June 2026 Sales Recorded 16952 Units

జూన్ 2026 లో సాధించిన అమ్మకాలతో వ్యాగన్‌ ఆర్ ఆ నెలలో ఏకంగా అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఈ కారు కంటే ముందు జాబితాలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో కూడా ఇదే కంపెనీకి చెందిన నెక్సాన్ ఉంది, ఇక మూడో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలిచింది.

వ్యాగన్‌ ఆర్ 1999లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా ఫీచర్లు, పనితీరులో అప్‌డేట్ అవుతూ వచ్చింది. తక్కువ ధర, ఫ్యూయల్ ఖర్చు తగ్గిస్తూ మంచి మైలేజ్ ఇవ్వడం, అలాగే, పేద, మధ్యతరగతి ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లకు సరిపోయే ప్రాక్టికల్ డిజైన్, రోజూ వారి ప్రయాణాలకు అనువుగా ఉండటం వల్ల ఈ కారు ఇప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూనే ఉంది.

Maruti Best Hatchback Wagonr June 2026 Sales Recorded 16952 Units

ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.4.99 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.6.95 లక్షల వరకు ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇది LXi, VXi, ZXi, ZXi+ నాలుగు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇంజిన్ల విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లు ఉన్నాయి. మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది గరిష్టంగా 67 PS పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెండోది 1.2-లీటర్ పెట్రోల్, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు కొన్ని వేరియంట్లలో AMT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మరో వైపు పెట్రోల్ ఖర్చలు తగ్గించుకోవాని అనుకునే వారికి CNG వేరియంట్ కూడా లభించడం విశేషం. ఇందులోని 1.0-లీటర్ CNG ఇంజిన్ 57 PS పవర్, 82 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti Best Hatchback Wagonr June 2026 Sales Recorded 16952 Units

ఈ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, 1.0 లీటర్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.35 కిలోమీటర్లు, 1.0 లీటర్ AMT వేరియంట్ 25.19 కిలోమీటర్లు, 1.2 లీటర్ మాన్యువల్ 23.56 కిలోమీటర్లు, 1.2 లీటర్ AMT 24.43 కిలోమీటర్ల వరకు అందిస్తాయి. ఇక CNG వేరియంట్ ఒక్క కిలో గ్యాస్‌తో 33.47 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Article Published On: Tuesday, July 7, 2026, 18:27 [IST]
English summary
Maruti best hatchback wagonr june 2026 sales recorded 16952 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+